అత్యధిక సంఖ్యలో భక్తులను ఆకట్టుకునే 5 ఆలయాలు

0
787

దేవుళ్ళకు, పండుగలకు నిలయం భారతదేశం. భారతదేశవ్యాప్తంగా లక్షలాది ఆలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని మాత్రం బాగా ప్రాచుర్యం పొందాయి. ర్యాంకులు ఇవ్వాలన్న ఉద్దేశంతో గాకుండా, అవి పొందిన ప్రజాదరణను తెలియజేసేందుకు వేల సంఖ్యలో భక్తులు సందర్శించే ఆలయాల వివరాలు ఇక్కడ ఇస్తున్నాం.

తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయం

Tirupati Venkateswara Temple

రోజూ సందర్శించే భక్తుల సగటు సంఖ్యః 65,000 – 70,000

ఏ విధంగా చేరుకోవాలిః తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి 26 కి.మీ.

రోజూ గరిష్ఠ సంఖ్యలో భక్తులు సందర్శించుకునే ఆలయం ఇది. మహా విష్ణు యొక్క ఎనిమిది ఆవాసాల్లో ఒకటిగా దీన్ని పరిగణిస్తారు. కలియుగం ఉన్నంత వరకు ఆలయంలో విగ్రహం ఉంటుందని, దేవుడు భక్తులను పాపాల బారి నుంచి కాపాడుతాడని విశ్వసిస్తారు.

వైష్ణోదేవి ఆలయం

Vaishno Devi

రోజూ సందర్శించే భక్తుల సగటు సంఖ్యః 6౦,000 – 63,000

ఏ విధంగా చేరుకోవాలిః కాత్రా రైల్వే స్టేషన్ నుంచి 15 కి.మీ.

భారతదేశంలో హిందువులకు అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఆలయాన్ని చేరుకొనేందుకు సుమారుగా 13 కి.మీ. మేర కొండలెక్కాల్సి ఉంటుంది. ఇక్కడి దైవం నుంచి పిలుపు వస్తేనే ఆలయ సందర్శన సాధ్యమని భక్తుల విశ్వాసం. ఆలయానికి చేసే తీర్థయాత్ర భోగభాగ్యాలను, ఆరోగ్యాన్ని అందిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు.

పద్మనాభ స్వామి ఆలయం

Padmanabhaswamy Temple

రోజూ సందర్శించే భక్తుల సగటు సంఖ్యః 50,000 – 55,000

ఏ విధంగా చేరుకోవాలిః తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి 1 కి.మీ.

సకల ఐశ్వర్యాలను కోరుకునే భక్తులు ఇక్కడి దైవానికి బంగారం సమర్పించి ఆరాధిస్తారు. ఇక్కడ సమర్పించే ధనానికి ఎన్నో రెట్ల ధనాన్ని భక్తులు పొందుతారని ప్రతీతి. యావత్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయం ఇదే కావడంలో ఆశ్చర్యం లేదు.

స్వర్ణ దేవాలయం

Thiruvananthapuram

రోజూ సందర్శించే భక్తుల సగటు సంఖ్యః 40,000 – 45,000

ఏ విధంగా చేరుకోవాలిః అమృత్ సర్ రైల్వే స్టేషన్ నుంచి 2 కి.మీ.

హర్ మందిర్ సాహిబ్ గా కూడా పేరొందిన ఈ ఆలయం సిక్కులకు పరమ పవిత్ర పుణ్య క్షేత్రం. దేశం లోని వివిధ ప్రాంతాల నుంచి సిక్కులు పంజాబ్ లో 16వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. భారతదేశంలోని అతిపెద్ద వంటశాలల్లో ఒకదాన్ని ఈ గురుద్వారా కలిగి ఉంది. భక్తులంతా కూడా ఇక్కడి లంగర్ లో రుచికరమైన ఆహారాన్ని ఆరగిస్తారు.

జగన్నాథ ఆలయం:

Jagannath Temple

రోజూ సందర్శించే భక్తుల సగటు సంఖ్యః 30,000 – 33,000

ఏ విధంగా చేరుకోవాలిః పూరి రైల్వే స్టేషన్ నుంచి 3 కి.మీ.

జీవితకాలంలో ఏ హిందువైనా దర్శించుకోవాల్సిన చార్ ధామ్ ఆలయాల్లో ఇది కూడా ఒకటి. శ్రీ కృష్ణుడి అవతారమైన జగన్నాథుడు ఇక్కడ కొలువుదీరాడు. పన్నెండో శతాబ్దానికి చెందిన ఈ ఆలయం ఎంతో కళాత్మకంగా ఉంటుంది. భక్తులు ఇక్కడ తాము దైవసన్నిధిలో ఉన్న అనుభూతిని పొందుతారు. ఇక్కడి విగ్రహం నిలువెత్తున ఉండి, ఎంతో అందంగా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here