టికెట్ రద్దు చేసుకున్న తర్వాత మీరు తిరిగి పొందిన డబ్బును చూసి చాలా మంది షాక్‌కు గురై ఉంటారు. మనం తరచూ రైలు టికెట్లు రద్దు చేసుకుంటూ ఉన్నా కూడా, మనకు రద్దు నియమాల గురించి తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి, రైల్‌యాత్రిలో మేము ఈ రద్దు నియమాలను చాలా సులువుగా అర్థమయ్యేలా వివరిస్తున్నాం. అవేమిటంటే..
రద్దు ఛార్జీలు ఏమిటి?
టికెట్లు కన్‌ఫమ్ అయిన లేదా ఆర్‌ఏసీ టికెట్లు ఉన్నవాళ్లు తమ టికెట్లను తామే రద్దు చేసుకోవాలి. ఇక వెయిట్‌లిస్టెడ్ టికెట్ల విషయంలో, తుది జాబితా సిద్ధమయ్యే సమయానికి కన్‌ఫమ్ కాకపోతే వాటంతట అవే రద్దైపోతాయి మరియు పూర్తి డబ్బు వెనక్కి వచ్చేస్తుంది. రైలు బయలుదేరడానికి 48 గంటల ముందు టికెట్ రద్దు చేసుకుంటే పడే ఛార్జీల వివరాలు:
స్లీపర్ క్లాస్‌కు రద్దు ఛార్జీలు: రూ.120 (కన్‌ఫమ్ అయిన టికెట్లకు), రూ.60 (ఆర్‌ఏసీ లేదా వెయిట్‌లిస్టెడ్ టికెట్లకు) ఒక్కో ప్రయాణీకుడికి.
3 ఏసీకి రద్దు ఛార్జీలు: రూ.180 (కన్‌ఫమ్ అయిన టికెట్లకు), రూ.60 (ఆర్‌ఏసీ లేదా వెయిట్‌లిస్టెడ్ టికెట్లకు) ఒక్కో ప్రయాణీకుడికి.
2 ఏసీ రద్దు ఛార్జీలు: రూ. 200 (కన్‌ఫమ్ అయిన టికెట్లకు), రూ.60 (ఆర్‌ఏసీ లేదా వెయిట్‌లిస్టెడ్ టికెట్లకు) ఒక్కో ప్రయాణీకుడికి.
1 ఏసీ రద్దు ఛార్జీలు: రూ. 240 (కన్‌ఫమ్ అయిన టికెట్లకు), రూ.60 (ఆర్‌ఏసీ లేదా వెయిట్‌లిస్టెడ్ టికెట్లకు) ఒక్కో ప్రయాణీకుడికి.
పాక్షిక రద్దు అంటే ఏమిటి మరియు దాని నిబంధనలేమిటి?
ఒకరిద్దరి టికెట్లను రద్దు చేసుకుని మిగిలిన వారి టికెట్లను కొనసాగించడానికి పాక్షిక రద్దు విధానం అవకాశం కలిగిస్తుంది. ఉదాహరణకు, ఒకే దరఖాస్తు ద్వారా మీరు 5 గురు ప్రయాణీకులకు టికెట్ బుక్ చేశారనుకుందాం, ఇప్పుడు, ఇద్దరు ప్రయాణీకులకు టికెట్లు కన్‌ఫమ్ అయ్యాయి, ఒక ప్రయాణీకుడికి ఆర్‌ఏసీ మిగిలిన ఇద్దరికి వెయిట్‌లిస్టెడ్ టికెట్లు వచ్చాయనుకుందాం. పాక్షిక రద్దు విధానం ద్వారా ఆర్‌ఏసీ మరియు వెయిట్‌లిస్టెడ్ టికెట్లను రద్దు చేసుకుని,కన్‌ఫమ్ టికెట్లు పొందిన ఇద్దరు ప్రయాణీకులు రైలు ఎక్కి తమ బెర్తుల్లో ప్రయాణం చేయవచ్చు.
రద్దు చేసుకున్న తర్వాత నేను డబ్బు ఎలా పొందుతాను?
ప్రయాణం మొదలు కావడానికి ఎంత ముందుగా (ఎన్ని గంటలు) మీరు టికెట్ రద్దు చేసుకున్నారన్నదానిపై ఇది ఆధారపడి ఉంటుంది.
రైలు బయలుదేరడానికి 119 రోజులు-48 గంటల ముందు
ఇలాంటి పరిస్థితుల్లో, ప్రయాణీకులు రద్దు ఛార్జీలు మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని తిరిగి పొందుతారు. ప్రయాణం చేసే తరగతిని బట్టి ఈ ఛార్జీలు రూ.120-240 మధ్య ఉంటాయి.
రైలు బయలుదేరడానికి 12 గంటల ముందు
మీరు గనక 48 గంటల వ్యవధిని దాటినప్పటికీ, మీరు కాస్త ఎక్కువ మొత్తాన్ని తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ, బేస్ ఛార్జీల్లో 25 శాతం లేదా రద్దు ఛార్జీలు (ఏది ఎక్కువైతే అది) మినహాయించబడుతుంది.
రైలు తుది జాబితాను తయారు చేయడానికి 4 గంటల ముందు వరకు
ప్రయాణం మొదలుకావడానికి దాదాపు 4 గంటల ముందుగానే తుది జాబితా తయారుచేయబడుతుంది. ప్రయాణం చేయని ప్రయాణీకుల సీట్లను ఇతరులకు సర్దుబాటు చేయడానికి భారతీయ రైల్వేకు అదే చివరి అవకాశం. కాబట్టి, తుది జాబితా తయారు చేయడానికి ముందుగానీ, లేదా 12 గంటల వ్యవధి దాటిన తర్వాతైనా గానీ మీరు టికెట్లను రద్దు చేసుకుంటే, బేస్ ఫేర్‌లో 50 శాతం లేదా లేదా రద్దు ఛార్జీలు (ఏది ఎక్కువైతే అది) మినహాయించబడుతుంది.
డబ్బు తిరిగి చెల్లింపు అటోమెటిక్‌గా జరిగే ఇతర సందర్భాలేమిటి?
వెయిట్ లిస్టెడ్ టికెట్లే కాకుండా, పూర్తి టికెట్ ఛార్జీలను భారతీయ రైల్వే తిరిగి చెల్లించే ఇతర సమయాలు కూడా ఉన్నాయి.
రైలు రద్దైనప్పుడు: ఏదైనా కారణంతో మీ రైలు రద్దైతే, మీకు పూర్తి టికెట్ ఛార్జీలు తిరిగి చెల్లించబడతాయి.
రైలు ఆలస్యంగా నడుస్తున్నప్పుడు: రైలు గనక మీరు ఎక్కాల్సిన స్టేషన్‌కు 3 గంటల కన్నా ఎక్కువ ఆలస్యంగా వస్తున్నట్లైతే మీరు పూర్తి టికెట్ ఛార్జీని తిరిగి చెల్లించమని కోరవచ్చు. దీనికోసం మీరు స్టేషన్ మేనేజర్ కార్యాలయంలో టీడీఆర్‌ను సమర్పించాల్సి ఉంటుంది. మీరు గనక రైలు ఎక్కితే, ఆ టీడీఆర్ చెల్లుబాటు కాదు
రైలును మళ్లించినప్పుడు: మూడో అవకాశం రైలు మార్గాన్ని మళ్లించినప్పుడు, ఆ మార్గంలో మీరు వెళ్లాలని కోరుకోకపోతే లభిస్తుంది. అప్పుడుకూడా, 72 గంటల్లోగా స్టేషన్ మేనేజర్ కార్యాలయంలో మీరు టీడీఆర్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
పాక్షికంగా టికెట్ ఛార్జీలను పొందే ఇతర సందర్భాలేమిటి?
ఛార్జీల్లో పాక్షికంగా మీరు పొందగలిగే ఇతర సందర్భాలు కూడా ఉన్నాయి. అవి:
ఏసీ పనిచేయనప్పుడు (ఏసీ తరగతులు): మీరు గనక ఏసీ కోచ్‌ల్లో టికెట్ బుక్ చేసుకుని, ఏసీ సరిగ్గా పనిచేయనట్లు గుర్తిస్తే (లేదా ఏసీ పనిచేయకపోయినా) దాన్ని మీరు టీటీఈకి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. పరిశీలించిన తర్వాత ఏసీని రిపేర్ చేయిస్తారు. ఏసీ గనక పనిచేయకపోతే ఛార్జీల్లో (మీ తరగతికి, స్లీపర్ తరగతి మధ్య ఉన్న) వ్యత్యాసాన్ని టీటీఈ చెల్లిస్తారు.
సీట్లు దిగువ తరగతుల్లో కేటాయించినప్పుడు: మీకు కనక కన్‌ఫర్మ్‌డ్ టికెట్‌ను దిగువ తరగతిలో కేటాయిస్తే, మీరు బుక్ చేసుకున్న తరగతికి, ప్రస్తుతం మీరు బెర్త్ పొందిన తరగతికి మధ్య ఉన్న వ్యత్యాస ఛార్జీని పొందవచ్చు.
మీరు ఎదుర్కొన్న సందర్భాలు ఇందులో లేకపోవచ్చని మాకు తెలుసు, కాబట్టి మీ ప్రశ్నలు అడగవచ్చు లేదా ఆ సందర్భాలను మా దృష్టికి తీసుకురావచ్చు. మీకు సహాయం చేయడానికి మేమెప్పుడూ ఎదురుచూస్తుంటాం.
అవును, రిజర్వేషన్ కేన్సలేషన్ చార్జెస్ ఎక్కువగానే ఉంటాయి.