ఖారిపాడియా: 20వ శతాబ్దిలో జగన్నాథుడి జన్మస్థలం

0
865

ఖారిపాడియా ఒడిషా రహస్య ఖజానా. జగన్నాథుడి ‘దారు’ను ఇక్కడ గుర్తించడంతో, ఇది పర్యాటక కేంద్రంగా ప్రఖ్యాతి చెందింది. జగన్నాథుడి విగ్రహం చెక్కేందుకు ఉపయోగించే ఈ ‘దారు’ లేదా వేప చెట్టు సాధారణ వేపచెట్టు కాదు. అసాధారణ మహత్తులున్నదిగా దానిని పరిగణిస్తారు. నవ కళేబర (నూతన శరీరం) ఉత్సవం కోసం ఒడిషా అంతా ఎంపిక చేసిన 10 చెట్లలో గత ఏడాది ఇక్కడ గుర్తించింది కూడా ఉంది.

Daru symbols

నగర కోలాహల వాతావరణానికి దూరంగా ఉండే ఈ గ్రామం ఇప్పుడు యాత్రికులకు ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. పాలికా నదికి చేరువలో, గ్రామ శివారులో, దారును గుర్తించిన ప్రాంతం వద్ద ఇక్కడ కూడా ఒక జగన్నాథుడి ఆలయం ఉంది. బలభద్ర మరియు సుభద్ర జిల్లా లోనే మరో రెండు ఇతర ‘దారు’లను కూడా గుర్తించారు.

Gorekhnath Temple - Kharipadia

ఖారిపాడియా మరియు మా సరళ ఆలయం నుంచి 35కి.మీ. దూరంలో మీరు గోరఖ్ నాథ్ ఆలయాన్ని కూడా మీరు దర్శించవచ్చు. ఇక్కడ పురాతన మర్రి చెట్టు కింద కూర్చున్న భంగిమలో కొలువుదీరిన శివుడి ఆలయం ఉంది.

Sarala temple - Kharipadia

గోరఖ్ నాథ్ నుంచి కేవలం 6 కి.మీ. దూరంలోనే సరళ మాత ఆలయం కూడా ఉంది. అందమైన రహదారులు, ప్రశాంత వాతావరణం ఈ అలయానికి మరెంతో అందాన్ని జోడిస్తాయి. ఇది ‘వాక్ దేవి’ (చదువుల తల్లి) ఆలయం. ఎంతో పాతది. గత ఏడాది బలభద్ర దారు కోసం ఎంపికైన వేప చెట్టు ఈ ఆలయం ఆవరణలోనే ఉంది.

ఎలా చేరుకోవాలి: ఖారిపాడియా అనేది కటక్ మరియు భువనేశ్వర్ ల నుంచి ఎంతగానో అనుసంధానమైంది. ఈ గ్రామానికి సమీపంలోని రైల్వే స్టేషన్ శ్రీ రఘునాథ్ పూర్ స్టేషన్. 

ఒకప్పుడు ఎవరికీ పట్టని ఈ చిన్నగ్రామం ఇప్పుడు జగన్నాథ భక్తులకు ఆరాధన క్షేత్రంగా మారింది. ఇక్కడి భక్తి వాతావరణం అంతా కలుషితం కాకముందే, ఖారిపాడియాకు వెళ్ళేందుకు ప్లాన్ చేసుకోండి!

 

Originally written by Lopamudra Sahoo. Read here.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here