అంతరాలను పూరిస్తున్న భారతదేశ ఐకానిక్ వంతెనలు

0
1113

భారతదేశం కొన్ని అత్యద్భుత వంతెనలకు సాక్షీభూతంగా నిలిచింది. నిర్మాణరంగంలో కచ్చితంగా అద్బుత కళాఖండాలు అనదగ్గ వంతెనలు కొన్ని భారతదేశంలో ఉన్నాయి. ఎన్నో ఏళ్ళ తరువాత కూడా అవి తమ పట్ల ఆరాధనను చెక్కు చెదరనీయకుండా నేటికీ నిలిచే ఉన్నాయి. వెనుకటి కాలంలో నిర్మించిన ఈ వంతెనలు ఆనాడే సాంకేతికంగా ఎంతో అధునాతనంగా ఉండినవి.

భారతదేశంలో కాలపరీక్షకు తట్టుకొని నిలిచిన కొన్ని వంతెనలను ఇప్పుడు చూద్దాం.

నైని వంతెన, అహ్మదాబాద్

Old Naini Bridge, Allahabad

పాత నైని వంతెన, అహ్మదాబాద్

చారిత్రాత్మక నైని వంతెన భారతీయ వెలుగు జిలుగుల ప్రయాణానికి సాక్షీభూతంగా నిలిచింది. 1865 ఆగస్టు 15న దీన్ని ప్రారంభించారు. న్యూఢిల్లీ – హౌరా మార్గంలో ముఖ్యమైన లింక్ గా ఇది తన సేవలను అందిస్తోంది. ఈ వంతెన యొక్క విశిష్ట లక్షణాల్లో ఒకటి దీని 13వ స్తంభం. అది ‘ఏనుగు పాదం’ ఆకారంలో ఉంటుంది.

New Naini Bridge, Allahabad

కొత్త నైని వంతెన, అలహాబాద్

యమునా నదిపై ఉన్న అత్యంత పాత, పొడవైన వంతెనల్లో ఇది ఒకటి. ఇది అటు రైలు, ఇటు రోడ్డువంతెనగా రెండు విధాలుగా ఉపయోగపడుతోంది. పై మార్గం రెండు లేన్ల రైల్వే మార్గం. దాని కింద రోడ్డు మార్గం ఉంది.

నర్మద సేతు, ఆంకాలేశ్వర్ – బారుచ్, గుజరాత్

Narmada Setu, Gujarat

135 ఏళ్ళుగా ప్రకృతితో సహజీవనం చేస్తున్న నర్మద సేతు అంకాలేశ్వర్ ను బారుచ్ తో అనుసంధానం చేస్తుంది. దీనికి అపార వ్యయం జరిగింది. అందుకే ఇలాంటి వంతెనను బంగారంతో కట్టవచ్చని కూడా అంటుంటారు. ఇది రెండు పట్టణాలను అనుసంధానిచేది మాత్రమే కాదు…అంతకు మించి ఇది ప్రజలకు పర్యాటక స్థలం కూడా. నర్మద తీర ప్రాంతాన్ని చూసి ఆనందించేందుకు ప్రజలు ఇక్కడ పోటెత్తుతారు.

పంబన్ సేతు, రామేశ్వరం

Pamban Setu, Rameshwaram

ఇది మొట్టమొదటి సముద్ర వంతెన మరియు ఈ రకం వాటిల్లో ఇదే పొడవైనది. ఈ వంతెన చారిత్రాత్మక రామేశ్వరంను ప్రధాన భూభాగంతో అనుసంధానం చేస్తుంది. 1913లో ఇది ప్రారంభించబడింది.143 స్తంభాలతో 2 కి.మీ. పొడవుతో ఉండే ఈ వంతెన ప్రధాన భూభాగాన్ని ద్వీపంతో అనుసంధానం చేస్తుంది.

రవీంద్ర సేతు, కోల్ కతా

Rabindra Setu, Kolakata

దీన్నే హౌరా వంతెనగా కూడా వ్యవహరిస్తుంటారు. 1943లో ఇది ప్రారంభించబడింది. ఇది పశ్చిమ బెంగాల్ లో హుగ్లీ నదిపై ఉన్న కాంటిలివర్ వంతెన. ప్రతి రోజూ ఇది 150,000 మంది పాదచారులు మరియు 100,000 వాహనాల రాకపోకలకు వీలు కల్పిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత రద్దీ అయిన  కాంటిలివర్ వంతెన ఇది.

సరాయ్ ఘాట్ సేతు, గువాహతి

Saraighat Setu, Assam

బ్రహ్మపుత్రపై 1962లో నిర్మించబడిన సరాయ్ ఘాట్ వంతెన మిగిలిన దేశాన్ని ఈశాన్య భూభాగంతో కలపడమే గాకుండా 7 ఈశాన్య రాష్ట్రాల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేస్తోంది. అస్సాం ప్రజలు చేసిన సుదీర్ఘ పోరాటం నేపథ్యంలో ఈ రైలు-రోడ్డు వంతెన పని చేయడం ప్రారంభమై 54 ఏళ్ళు పూర్తయింది. బ్రహ్మపుత్ర నదిపై నిర్మించబడిన ఈ మొదటి రైలు-రోడ్డు వంతెన నాటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ చే ప్రారంభించబడింది.

లక్ష్మణ్ జూలా, రుషికేశ్, ఉత్తరాఖండ్

Lakshman Jhula, Uttarakhand

జనుమ తాళ్లపై శ్రీరాముడి సోదరుడు లక్ష్మణుడు గంగానదిని దాటాడని చెప్పే రెండుప్రాంతాల మధ్య ఈ సస్పెండెడ్ ఇనుప వంతెన 1939లో నిర్మించబడింది. గంగానది అందమైన ప్రకృతి రమణీయతను ఆస్వాదించే అవకాశాన్ని ఈ వంతెన అందిస్తుంది. కొద్ది కి.మీ. దూరంలో ఉన్న బదరీనాథ్ మరియు కేదార్ నాథ్ పుణ్యక్షేత్రాల మధ్య ఉన్న పాతమార్గాల్లో లక్ష్మణ్ జూలా ఒకటి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here