కచ్చిన్ లో వారసత్వ వంటకాలు

0
1262

చైనీస్, ఇటాలియన్, ఉత్తరాది వంటకాలు లాంటి ఎన్నో రకాల ఆహారాలతో పాటుగా కేరళ సంప్రదాయ వంటకాలు కొచ్చిన్ లో లభ్యమవుతాయి. రుచికరమైన వంటకాలను అందించే పాతతరం రెస్టారెంట్ల కోసం మేం కొచ్చిన్ నగరమంతా గాలించాం. నేటికి ఎన్నో దశాబ్దాలుగా కొచ్చిన్ యొక్క ఆహార సంస్కృతిలో భాగమైన కొన్ని రెస్టారెంట్ల వివరాలు ఇక్కడ ఇస్తున్నాం.

Bharath Coffee House

భారత్ కాఫీ హౌస్ః  ఇది ఎప్పుడు నెలకొల్పబడిందో కచ్చితమైన తేదీ ఏదీ లేనప్పటికీ, భారత్ కాఫీ హౌస్ రెస్టారెంట్ లోని లూయిస్ హాల్ లో లభ్యమయ్యే ఆధారాలను బట్టి ఇది మొదటి ప్రపంచయుద్ధ సమయంలో మొదలైందని భావించవచ్చు. ఇడ్లీ, దోసె మొదలుకొని చపాతీ / పూరీ వరకు దక్షిణ భారతదేశానికి చెందిన విస్తృత శ్రేణి వంటకాలను ఇది అందిస్తుంది. సమోసా వంటి ఉత్తర భారత రుచులను, కేరళకే చెందిన అడా వంటి వాటినీ ఇక్కడ రుచి చూడవచ్చు. ఇది ఎర్నాకుళం రైల్వే జంక్షన్ నుంచి 3 కి.మీ. దూరంలో ఉంది.

Hotel Kayikkas

హోటల్ కవిక్కాస్ : నగరంలో బాగా పాతకాలం నాటి మాంసాహారశాల ఇది. చికెన్ బిర్యానీకి బాగా పేరొందింది. చిన్న పట్టణాల్లో వీరికి అవుట్ లెట్స్ ఉన్నప్పటికీ ప్రధాన శాఖ మాత్రం మట్టన్ చెర్రీలో ఉంది. ఒక చిన్న అవుట్ లెట్ గా ప్రారంభమైన ఈ సంస్థ దేశ స్వాతంత్యానంతరం బాగా వృద్ధి చెందింది. ప్రజలను బాగా ఇక్కడికి రప్పించుకునే చికెన్ బిర్యానీ తయారీ రహస్యాలు మాత్రం ఎవరికీ తెలియవు. ఎర్నాకుళం జంక్షన్ రైల్వే స్టేషన్ – 11 కి.మీ.

Bharat Hotel

భారత్ హోటల్ (బీటీహెచ్): 1964 లో నెలకొల్పబడిన ఈ రెస్టారెంట్ ఈ నగరపు సాంస్కృతిక వారసత్వంగా మారింది. కొచ్చిన్ బ్యాక్ వాటర్స్ తీరంలో సుభాష్ పార్క్ లో ఇది నెలకొంది. ఈ రెస్టారెంట్ హై క్లాస్ శాకాహార వంటకాలను ఆహ్లాదకర వాతావరణంలో అందిస్తుంది. ఇతర శాకాహార వంటకాలకు తోడుగా కాక్ టెయిల్స్, టీ, బాంబే చాట్స్ ఎంతో రుచికరంగా ఉంటాయి. మలయాళం సినీ తారలు లేదా రాజకీయ నాయకులు ఇక్కడ కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎర్నాకుళం జంక్షన్ రైల్వే స్టేషన్ – 8 కి.మీ.

Hotel Colombo

హోటల్ కొలంబో: ఈ రెస్టారెంట్ పేరుకు శ్రీలంకతో సంబంధమేమిటో ఎవరికీ తెలియదు. 1952 లో దీన్ని సిలోన్ నుంచి వలస వచ్చిన వారు నిర్మించి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ‘నూతన తరం కోసం సంప్రదాయ రుచులు’ అనే బ్యానర్ మాత్రం ఇక్కడ దర్శనమిస్తుంది. అంటే ఆధునికత జోడించబడిన సంప్రదాయక మలయాళీ వంటకాలను మీరు ఇక్కడ రుచి చూడవచ్చు. ఫిష్ కర్రీ, షవర్మాస్, కబాబ్స్, ఆరేబియన్ ఫుడ్ లాంటివి ఇక్కడ తప్పక రుచి చూడాల్సిన వాటిలో కొన్ని. ఎర్నాకుళం జంక్షన్ రైల్వే స్టేషన్ – 2 కి.మీ.

Grand Hotel

గ్రాండ్ హోటల్ : 1963 లో నెలకొల్పబడిన ఈ రెస్టారెంట్ వివిధ రకాల శాకాహార, మాంసాహార వంటకాలను అందిస్తుంది. సంప్రదాయక కేరళ వంటకాలు, ఫిష్ కర్రీస్ మొదలుకొని సిరియన్, మొఘలాయి వంటకాలు లాంటివన్నీ ఇక్కడ లభిస్తాయి. కరిమీన్ పొల్లిచట్టు, క్రీమ్ కారామెల్, ఫిష్ బిర్యానీ, నడన్ సడ్యా లాంటివి ఇక్కడ తప్పక రుచి చూడాల్సిన వాటిలో కొన్ని. ఎర్నాకుళం జంక్షన్ రైల్వే స్టేషన్ – 700 మీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here