సంప్రదాయబద్ధమైన మైసూర్ పాక్ కోసం వెతుకులాట

0
1243

మైసూర్ అనగానే అందమైన పట్టుచీరలు, మైసూర్ రాజప్రాసాదం, పేరొందిన చందనం సబ్బు ఇలా ఎన్నో గుర్తుకొస్తాయి. కాకపోతే, కేవలం భోజన ప్రియులకు మాత్రమే మైసూర్ పాక్ గురించి తెలుస్తుంది. రాజఠీవి గల ఈ నగరానికి, ఈ వంటకం ప్రతీకగా నిలుస్తుంది.

రుచికరం వెనుకున్న చరిత్ర

Making Mysore Pak
మాదప్ప అనే వ్యక్తి మొదటిసారిగా మైసూర్ రాజభవనంలో, మైసూర్ పాక్ ని తయారుచేసారు. అతను శనగపిండి, నెయ్యి కలిపి ప్రయోగాత్మకంగా, ఒక కొత్త విధమైన చిక్కటి మిశ్రమాన్ని తయారుచేసాడు. మిశ్రమం కాసేపటకి గడ్డకట్టి కేక్ లా తయరైంది. అతను దాన్ని మైసూర్ మహారాజాల్లో పేరొందిన కృష్ణ రాజ వొడయార్ కి బహుకరించారు. రాజు చాలా ప్రసన్నుడై దానికి రాచరికపు స్వీటు స్థానాన్ని కల్పించారు. మాదప్ప మరిన్ని పదార్ధాలను జోడించి దానికి మైసూర్ పాక అని పేరు పెట్టారు (పాక అంటే కన్నడంలో తీపి మిశ్రమం). ఆ తర్వాత, మైసూర్ పాక, మైసూర్ పాక్ లేదా మైసూర్ పా గా ప్రసిద్ధి చెందింది.

నగరాలు మరియు మిఠాయిలు
పాకని రుచి చూడాలంటే చెన్నై సరైన ప్రాంతం. తీపి పదార్ధాలకి పెట్టింది పేరైన శ్రీ కృష్ణ స్వీట్స్, చెన్నై వ్యాప్తంగా విస్తరించి ఉంది. అసలైన మైసూర్ పాక్ కి నమ్మకంగా నిలుస్తోంది. కానీ పాత తరం వాళ్లు ఇప్పటకీ శ్రీ కృష్ణ స్వీట్స్ వద్ద దొరికే మైసూర్ పాక్ సవరించి చేసిందని, సంప్రదాయబద్ధమైనది కాదని నమ్ముతున్నారు.

సంప్రదాయబద్ధమైన మైసూర్ పాక్ కోసం వెతుకులాట

Shri Krishna Sweets
మైసూర్ పాక్ అమ్మే స్వీటు షాపులు చెన్నైలో చాలా ఉన్నాయి, కానీ సంప్రదాయబద్ధమైన స్వీటుని మైసూర్ వీధుల్లోనే తయారుచేస్తారనే నమ్మకం ఉంది. బోంబే టిఫనీస్, గురు స్వీట్స్ లలో(రెండూ మైసూర్ రాజభవనం దగ్గర్లో ఉన్నాయి) ఈ రుచికరమైన స్వీటు దొరుకుతుందని ప్రతీతి. ఈ స్వీటుని తయారుచేసిన మాదప్ప, ప్రస్తుతం గురు స్వీట్స్ యజమానులకి ముత్తాత అవుతారు. కాబట్టి, సంప్రదాయబద్ధమైన మైసూర్ పాక్ ని రుచి చూసేందుకు ఇదే అత్యుత్తమమైనది.

గురు స్వీటు షాపు

Guru Sweet Mart
గురు స్వీట్స్, సయ్యాజీ రావు రోడ్డు (మైసూర్ రాజభవనం వెనుక గేటు నుంచి, నడుచుకుని వెళ్లగల దూరంలో ఉంటుంది)లో ఉంది. గాలి ఆడేంత విశాలంగా ఉండదు. ప్రవేశ మార్గం లేదా లాబీ వంటిది ఉండదు. మనం ఫుట్ పాత్ మీద నిల్చుని గాజు జాడీ మీద పదార్ధాలని చూపించాలి. ప్రస్తుత యజమానుల్లో ఒకరైన నటరాజ్, తన ముత్తాతే ఈ స్వీటుని తయారుచేసారని నమ్మకంగా చెప్తున్నారు. వారు ఇప్పటికీ, దీన్ని సంప్రదాయ పద్ధతిలోనే తయారుచేస్తున్నారు. పంచదార, పసుపు తప్పితే మిగిలిన పదార్ధాలన్నీ సొంతంగా తయారుచేసుకుంటున్నారు. మైసూర్ పాక్ కాకుండా, ఇక్కడ మిల్క్ బర్ఫీ కూడా రుచిగా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here