గణపతి బప్పా మోరియా! ఈ నినాదం మహారాష్ట్రలోని చాలామంది గుండెల్లో సంబరాన్ని నింపుతుంది. గణపతి పూజలోని సంప్రదాయాలను మనస్పూర్తిగా అభినందించాలంటే మీరు నగరంలోని చారిత్రక పూజా మండపాలను దర్శించుకోవాలి. ముంబైలోని పురాతన పూజామండపాలను మీ ముందుకు తెచ్చాం.
కేశవ్‌జి నాయక్ చావల్, గిర్‌గావ్ – 125 సంవత్సరాలు
ఇది నగరంలోని తొలి సామూహిక గణపతి పూజ, 1893 లో ప్రారంభమయ్యింది. ఈ మండపం చిన్న విగ్రహంతో పర్యావరణహిత సంబరాలకు ప్రతీతి. లౌడ్ స్పీకర్లు లేకుండా, డప్పుల మోత లేకుండా సంప్రదాయబద్ధంగా ఇక్కడ పూజ జరుగుతుంది. గత నాలుగు తరాలుగా ఒకే శిల్పి కుటుంబం ఇక్కడి విగ్రహాన్ని రూపొందిస్తోంది. నిర్వహణ కమిటీ క్రమం తప్పకుండా భజనను, చిన్నారులకు పోటీలను నిర్వహిస్తుంది. ఈ మండపాన్ని ఎక్కువమంది సాయంత్రం 5 నుంచి 11 గంటల మధ్య దర్శించుకుంటారు.
దగ్గర్లోని రైల్వే స్టేషన్: చార్ని రోడ్
చించ్‌పోక్లిచా చింతామణి, చించ్‌పోక్లి – 98 సంవత్సరాలు
చించ్‌పోక్లిచా చింతామణి (చించ్‌పోక్లి సామూహిక ఉత్సవ మండలి) 1920లో ఏర్పాటు చేయబడింది. ముంబైలోని రెండో పురాతన మండపం. ఈ పూజా కమిటీ రక్తదానం, కంటిదానం క్యాంపులను, పేదలకు సహాయంలాంటి ఎన్నో సామాజిక కార్యక్రమాలను చేపడుతోంది. ముంబైలోని ఎంతో విశ్వసించదగిన మరియు క్రమశిక్షణకు మారుపేరైన మండళ్లలో ఇదీ ఒకటి.
దగ్గర్లోని రైల్వే స్టేషన్: చించ్‌పోక్లి
ముంబైచా రాజా, గణేశ్ గల్లి – 90 సంవత్సరాలు
పేరు చావల్ చుట్టుపక్కల ఉండే యువకులంతా కలిసి “లాల్‌బాగ్ సామూహిక ఉత్సవ మండలి”ని 1928లో ప్రారంభించారు. సామాన్యులందర్నీ ఒక్కతాటిపైకి తెచ్చి వారిలో స్వాతంత్ర్య పోరాట కాంక్షను రగిలించడానికి లోకమాన్య తిలక్ గణేశ్ పండుగను ప్రారంభించారు. ఇదే ఆశయంలో 1945లో లాల్‌బాగ్ సామూహిక ఉత్సవ మండలి విగ్రహం ఏడు గుర్రాలపై స్వారీ చేస్తున్న సుభాష్ చంద్రబోస్ రూపంలోని గణేశ్ విగ్రహాన్ని ప్రతిష్టించింది.
దగ్గర్లోని రైల్వే స్టేషన్: చించ్‌పోక్లి
లాల్‌బాగ్‌చా రాజా, లాల్‌బాగ్ – 84 సంవత్సరాలు
ముంబైలోని ప్రముఖమైన సామూహిక గణపతి మండపాల్లో ఒకటి, అత్యధిక భక్తులను ఆకర్షించేది లాల్‌బాగ్‌చా రాజా. ప్రజల దర్శనం కోసం విగ్రహాన్ని 11 రోజుల పాటు ఉంచుతారు, ఆ తర్వాత శుభదినమైన అనంత చతుర్దశి నాడు నిమజ్జనం చేస్తారు. ఇక్కడ రెండు వరుసలు – నవసాచి వరుస, ముఖ దర్శనాచి వరుస ఉంటాయి. నవసాచి వరుస కోరికలు కోరుకునే భక్తుల కోసం. ఈ వరుసలో భక్తులు వేదికపైకి వెళ్లి, లాల్‌బాగ్‌చా రాజా పాదాలను తాకొచ్చు. మరో వరుస ముఖ దర్శనం కోసం మాత్రమే అంటే, వేదికపైకి ఎక్కకుండా విగ్రహాన్ని మాత్రం దర్శించుకునే అవకాశం ఉంటుంది.
దగ్గర్లోని రైల్వే స్టేషన్: కర్రీ రోడ్
Very nice