సంప్రదాయేతర దేవతలతో 8 ఆలయాలు

1
1361

మతం ప్రభావం అధికంగా ఉండే దేశం భారతదేశం. అత్యున్నత శక్తులను వివిధ రూపాలలో ఆరాధిస్తుంటాం. భారతదేశవ్యాప్తంగా లక్షలాది సంప్రదాయక ఆలయాలు ఉండగా, సంప్రదాయానికి భిన్నంగా ఉండే ఆలయాలు కూడా కొన్ని ఉన్నాయి.

Ravana-Temple-in-Ravangram

1. మధ్యప్రదేశ్ లోని రావణ్ గ్రామ్ లో రావణ ఆలయం: రామాయణంలో సీతామాతాను అపహరించిన చెడు వ్యక్తిగా రావణుడు చిత్రీకరించబడ్డాడు. కానీ, విదిష జిల్లా లోని రావణ్ గ్రామ్ అనే చిన్న గ్రామంలో మాత్రం రావణుడిని పూజిస్తారు. విశ్రమించిన భంగిమలో 10 అడుగుల ఎత్తులో ఈ విగ్రహం ఉంది.

Hadimba-Temple-in-Manali

2. హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిలో హడింబ ఆలయం: ఈ ఆలయంలో కొలువుదీరి ఉండేది భీముడి భార్య, ఘటోత్కచుడి తల్లి అయిన హడింబ. ఇక్కడే ఆమె ధ్యానం చేసి ఆత్మజ్ఞానం పొందిందని స్థానికులు విశ్వసిస్తారు. ఆలయంలో విగ్రహాలేవీ లేవు. రెండు పాదముద్రలను భక్తులు పూజిస్తారు.

Peruviruthy-Malanada-Temple-in-Poruvazhy

3. కేరళ లోని పొరువజిలో పెరువృతి మలండ ఆలయం: ఈ ఆలయంలో కొలువుదీరి ఉండేది ధుర్యోధనుడు. కేరళ కళాచాతుర్యానికి ఇది పేరొందింది. ఆలయంలో సంప్రదాయకరీతిలో విగ్రహమేదీ లేదు. ‘మండపం’ గా వ్యవహరించే ఎత్తయిన గద్దె మాత్రమే ఉంటుంది. ప్రజల క్షేమం కోసం ఆయన శివుడిని పూజించినందున, ఆయనను స్థానికులు పవిత్ర ఆత్మగా వ్యవహరిస్తారు.

Bullet-Baba-Temple-in-Jodhpur

4. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో బులెట్ బాబా ఆలయం: భక్తులు ఈ ఆలయంలో 350సిసి రాయల్ ఎన్ ఫీల్డ్ బులెట్ ను పూజిస్తారు. ఆ మోటార్ సైకిల్ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓం బన్నాది. పోలీసులు దాన్ని ప్రమాదస్థలి నుంచి తరలించారు. తిరిగి అది ప్రమాదస్థలి వద్దనే కనిపించింది. ఇలా మూడుసార్లు జరిగింది.

5. ఉత్తర ప్రదేశ్ లోని హర్దోయ్ రోడ్ లోని కంస ఆలయం: హిందూ పురాణాల ప్రకారం కంసుడు చెడుకు ప్రతీక. సొంత సోదరి, బావమరిదిని జైల్లో బంధిస్తాడు. తన జీవితాన్ని కాపాడుకునేందుకు వారికి పుట్టిన బిడ్డలనందరినీ హతమారుస్తాడు. కానీ, ఆయనను దేవుడిగా పూజించే ఆలయం హర్దోయ్ లో ఉంది. కంసుడు అక్కడ కొన్నేళ్ళ పాటు ధ్యానం చేశాడని స్థానికులు విశ్వసిస్తారు.

Nagaraja-Temple-in-Mannarasala

6. కేరళలోని మన్నా రసాలలో నాగరాజుకు ఆలయం: దేశవ్యాప్తంగా పాముల రాజు లేదా నాగరాజుకు ఎన్నో ఆలయాలు ఉన్నప్పటికీ, దేశంలోకెల్లా ఇదే అతిపెద్దది. సంతానం కోరుకునే మహిళలకు ఇదెంతో ముఖ్యమైన ఆలయం. ఆలయం ఆవరణలోనే 30000 కు పైగా రాతి పాము ప్రతిమలు ఉన్నాయి.

Dog-Temple-in-Channapatna

7. కర్నాటక లోని చన్నపట్నలో కుక్కకు ఆలయం: సంప్రదాయానికి భిన్నంగా ఉన్న ఈ ఆలయం 2009లో నెలకొల్పబడింది. కుక్కలు చూపించే విశ్వాసానికి ప్రతీకగా దీన్ని ఏర్పాటు చేశారు. రెండు కుక్కల ముఖాలు దేవతలుగా ఆలయంలో ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఎలాంటి చెడు సంఘటన జరగకుండా అవి కాపాడుతాయని స్థానికులు విశ్వసిస్తుంటారు.

Bharat-Mata-Temple-in-Haridwar

8. ఉత్తర ఖండ్ లోని హరిద్వార్ లో భారతమాత ఆలయం: జాతిని ఒక మూర్తిగా తీర్చిదిద్దిన ఈ ఆలయం 1983లో స్వామి సత్యమిత్రానంద్ గిరిచే నెలకొల్పబడింది. 8 అంతస్తుల ఈ ఆలయంలో కాషాయ రంగు చీరలో, ఒక చేతిలో భారతీయ జెండా పట్టుకుని ఉన్న భారతమాత విగ్రహం ఉంది.

 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here