ఎత్తైన పచ్చిక మైదానాల్లో పొడవైన గడ్డి పూల సౌందర్యాన్ని సూర్యకాంతిలో తిలకించడం అత్యద్భుతంగా ఉంటుంది, మంచుతో అలంకరించబడిన పర్వతసానువుల నుంచి వీచే మలయమారుతం మనసుని రంజింపచేస్తుంది. ఎన్నో వర్ణాలను తనలో ఇముడ్చుకున్నఈ ప్రాంతం వర్ణ రంజిత చిత్రాలను బంధించేందుకు అత్యుత్తమ గమ్యస్థానం. ఎంత సమయం ఇక్కడ గడిపినా ఇంకా ఏదో ఒక అద్భుతం కంటికి చిక్కకుండానే మిగిలిపోతుంది.
• భారతదేశంలో అత్యంత అందమైన జాతీయ పార్కు
సముద్ర మట్టానికి 3,858 మీటర్ల ఎత్తులో ఉన్న వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. తూర్పు, పశ్చిమ హిమాలయాల పూల జాతులకు మధ్య ఒక వారధిగా ఇది నిలుస్తోంది. నందాదేవి జీవారణ్య రిజర్వులో భాగంగా ఉంది, గంగ్రీ నుంచి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కి పర్వతారోహణ చేసుకుంటూ వెళ్తే వరుసల్లో కనువిందు చేసే అడవి పూలు సువాసనలు వెదజల్లుతూంటాయి. అడవి జాతి గులాబీ పొదలు, అడవి స్ట్రాబెరీలు కనిపిస్తాయి.
• అపారమైన జీవవైవిధ్యాన్ని కనుగొనండి
దాదాపు 300 పుష్ఫజాతులు, అంతరించిపోతున్నఎన్నో రకాల పుష్ఫ, ఔషధ మొక్కల జాతలు ఇక్కడ కనిపిస్తాయి. మంచుతో కప్పబడిన హిమాలయాల్లో ఈ వ్యాలీ అనేక వర్ణాల్లో ప్రకాశించే అనంతమైన భూభాగంలా కనిపిస్తుంది. అంతరించిపోతున్న ఆసియన్ బ్లాక్ బేర్, రెడ్ ఫాక్స్, బ్లూ షీప్ మొదలైన జీవులను ఇక్కడ చూడొచ్చు.
• అందమైన హిమాలయ పర్వాతారోహణ చేయండి.
ఈ వ్యాలీకి చేరుకోవడం కాస్త శ్రమతో కూడుకున్న విషయమే కానీ దీని వీక్షణం ఎంతో ఉత్సాహాన్ని పెంచుతుంది. ఈ దారిలో పర్వతారోహణకు 4 నుంచి 5 రోజులు పడుతుంది. హరిద్వార్/రుషికేష్ నుంచి యాత్ర మొదలవుతుంది, దీని బేస్ క్యాంప్ గోవిందఘాట్ లో ఉంటుంది. అక్కడ నుంచి ఘన్గారియా మీదుగా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కి పర్వతారోహణ సాగుతుంది. అదే ప్రధానమైన క్యాంప్.
• అక్కడ ప్రకృతి అత్యుత్తమంగా ఉంటుంది!
అక్కడ అభయారణ్యంలోకి అడుగు పెడితే చాలు కొత్త ప్రపంచంలోని అడుగుపెట్టినట్టు ఉంటుంది, మిమ్మల్ని మీరు మర్చిపోతారు. రాళ్లతో అందంగా మలచిన బాటలు, అబ్బురపరిచే బండరాళ్లు, గుళకరాళ్లు, చిన్న చిన్న సెలయేళ్లు, ఒకదానివెంట ఒకటిగా ఉండే జలపాతాలు చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. గొప్ప హిమాలయ మరియు జనస్కార్ పర్వత శ్రేణులు ఈ వ్యాలీకి ఇరువైలా నిలబడి రక్షణ కల్పిస్తున్నట్టుగా కనిపిస్తాయి.ఆ దృశ్యాలు చూసి మీరు విస్మయానికి గురవుతారు.
• హిమకుండ్ సాహిబ్ ఆత్యాధ్మికంలో మునిగితేలండి –
వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కి పర్వతారోహణ మార్గం హిమకుండ్ సాహిబ్ గురుద్వార్ మీదగా కూడా ఉంది. ఒక రోజు కేటాయిస్తే ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని కూడా సందర్శించవచ్చు, ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే ఇక్కడ ప్రవేశానికి అవకాశం ఉంటుంది. హిమకుండ్ సాహిబ్ ను దర్శించకుండా, ఈ పరిసరాల్లో వైవిథ్యాన్ని అనుభూతి చెందకుండా వెళ్లిపోతే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ పర్వతారోహణ అసంపూర్తిగా ముగిసినట్టే. జులై నెల నుంచి ఈ లోయ వికసిస్తూ అద్భుతంగా ప్రకాశిస్తుంది, కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోవద్దు.
ప్రయాణ సలహాలు:
• అత్యుత్తమ సమయం – జులై నుంచి సెప్టెంబరు
• బేస్ క్యాంప్: బద్రీనాథ్ హై వే మీద గోవింద్ ఘాట్
• సమీపంలోని విమానాశ్రయం: జోలి గ్రాంట్ ఎయిర్ పోర్టు, డెహ్రాడూన్
• సమీపంలోని రైల్వేస్టేషన్: హరిద్వార్ జంక్షన్ రైల్వే స్టేషన్
• బేస్ క్యాంప్ ను చేరుకోవడం – దూరం: 294 కి.మీ, మార్గం: హరిద్వార్ – రుషికేష్ -దేవప్రయోగ -రుద్రప్రయోగ -కర్ణప్రయోగ -చమోలీ -జోషిమఠ్ -గోవిందఘాట్
• గోవింద్ ఘాట్ నుంచి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కి – ఘన్గారియా మీదరుగా 23 కిలోమీటర్ల మేర పర్వాతారోహణ చేయాలి, మీ పర్వతారోహణకు అది క్యాంప్ గ్రౌండ్ అవుతుంది.