కోల్‌కతాలోని మార్కెట్లు

0
1315

మాల్స్‌, షాపింగ్ కాంప్లెక్స్‌లు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ, కోల్‌కతాలోని స్థానికులు ఇప్పటికీ ఎంతో ఇష్టపడేది మాత్రం పురాతమైన మార్కెట్లనే. కోల్‌కతాలో ప్రత్యేకమైన ఈ మార్కెట్లకు వెళ్దాం పదండి.

దక్షిణాపన్ షాపింగ్ సెంటర్‌

Dakshinapan
భారత దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ఎన్నో రకాల చేనేత దుస్తులు, వస్త్రాలు మరియు హస్తకళా వస్తువులు దక్షిణాపన్ షాంపిగ్ సెంటర్‌లో దొరుకుతాయి. చెప్పులు, ఆభరణాలు, తోలు వస్తువులు, అద్భుతంగా చెక్కిన చెక్క సామాగ్రి మరియు కేన్ ఫర్నిచర్‌లో ఎన్నో రకాల వెరైటీలు ఇక్కడ లభిస్తాయి. ఇక్కడికి దగ్గర్లోనే ఉన్న మధుసూదన్ మంచలో తరచూ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.

చిరునామా: 2, గరియాహాట్ రోడ్డు, ఢకురియా
దగ్గర్లోని ముఖ్యప్రదేశం: ఢకూరియా ఫ్లైఓవర్, మధుసూదన్ మంచ
తెరిచే వేళలు: మంగళవారం – శనివారం ఉదయం 11 గం. నుంచి రాత్రి 7:30 గం. వరకు | సోమవారం మధ్యాహ్నం 2 గం. నుంచి రాత్రి 7:30 గం. వరకు | ఆదివారం సెలవు
దగ్గర్లోని మెట్రో స్టేషన్: రబీంద్ర సరోవర్ (3కి.మీ దూరం)
దగ్గర్లోని రైల్వే స్టేషన్: ఢాకురియా రైల్వే స్టేషన్ (2కి.మీ దూరం)

గరియాహాట్ మార్కెట్

Gariahat
చెప్పులు, సాధారణ ఆభరణాలు, సంచులు మరియు పింగాణీ వస్తువులతో పాటు, దాదాపు 70 శాతం వరకూ ఇక్కడ దొరికేవి వస్త్రాలే. చాలా బ్రాండెడ్, ఖరీదైన నగల దుకాణాలు కూడా ఇక్కడ ఉన్నాయి.

చిరునామా: రాస్‌బిహారీ అవెన్యూ, బాలీగంజ్ గార్డెన్స్‌
దగ్గర్లోని ముఖ్యప్రదేశం: ముక్తీ వరల్డ్ మాల్‌
తెరిచే వేళలు: సోమవారం – శనివారం ఉదయం 11 గం. నుంచి రాత్రి 9 గం. వరకు | ఆదివారం సెలవు
దగ్గర్లోని మెట్రో స్టేషన్: కాళీ ఘాట్‌ (2.2కి.మీ దూరం)
దగ్గర్లోని రైల్వే స్టేషన్: బాలీగంజ్‌ జంక్షన్‌ (2కి.మీ దూరం)

కొత్త మార్కెట్ (హాగ్స్‌ మార్కెట్)

New Market
వస్త్రాలు, బ్యాగ్‌లు, తోలు వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, అనుకరణ నగలు లాంటి వాటిల్లో నాణ్యమైన వస్తువులను ఇక్కడ పొందవచ్చు. కాలింపాంగ్ చీజ్‌ మరియు బండేల్ చీజ్‌ ప్రత్యేకించి ఇక్కడ మాత్రమే అమ్ముతారు. రద్దీగా ఉండే ప్రాంతాలకు పర్యాటకులను తీసుకువెళ్లడానికి ఇక్కడ కూలీలు ఉంటారు, కానీ బ్యాడ్జ్‌లు లేని నకిలీలతో జాగ్రత్త.

చిరునామా: లిండ్సే స్ట్రీట్, న్యూ మార్కెట్ ఏరియా, ధర్మతాల
దగ్గర్లోని ముఖ్యప్రదేశం: ఇండియన్ మ్యూజియం, సప్పైర్ సూట్స్
తెరిచే వేళలు: సోమవారం – శనివారం ఉదయం 11 గం. నుంచి రాత్రి 8:30 గం. వరకు | ఆదివారం సెలవు
దగ్గర్లోని మెట్రో స్టేషన్: ఎస్పలాండే (1 కి.మీ దూరం)

కాలేజ్ స్ట్రీట్ మార్కెట్‌

College Street
ఈ మార్కెట్లో 1.5 కి.మీ మేర బుక్‌ స్టాళ్లు మరియు ప్రముఖ ముద్రణా సంస్థల కార్యాలయాలతో ఉంటుంది. అన్ని రకాల పుస్తకాలు, కొత్తవి మరియు పాతవి ఇక్కడ దొరుకుతాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పాత పుస్తకాలు అమ్మే మార్కెట్. ఇక్కడి దగ్గర్లోనే సంప్రదాయ స్వచ్ఛమైన పట్టు నుంచి ఖద్దరు చీరలతో పాటు, బెంగాలీ తంత్‌ చీరలూ అమ్ముతారు.

చిరునామా: బోబజార్ ప్రాంతంలోని గణేశ్ చంద్ర అవెన్యూ క్రాసింగ్ నుంచి మహాత్మాగాంధీ రోడ్డు క్రాసింగ్ వరకూ కాలేజ్ స్ట్రీట్‌
దగ్గర్లోని ముఖ్యప్రదేశం: ఇండియన్ కాఫీ హౌస్, ప్రెసిడెన్సీ యూనివర్సిటీ
తెరిచే వేళలు: సోమవారం – శనివారం ఉదయం 10 గం. నుంచి రాత్రి 8 గం. వరకు | ఆదివారం సెలవు
దగ్గర్లోని మెట్రో స్టేషన్: మహాత్మాగాంధీ రోడ్ (1 కి.మీ దూరం)
దగ్గర్లోని రైల్వే స్టేషన్: సెల్డా (1.5కి.మీ దూరం)

బుర్రా బజార్

Bara Bazar
ఇది టోకుగా వస్తువులు కొనే ప్రదేశమైనప్పటికీ, చాలా మంది ఔత్సాహికులు కోల్‌కతాలోని అత్యంత అరుదైన వస్తువుల కోసం బుర్రా బజార్‌ను సందర్శిస్తుంటారు. ఇక్కడి రాకుండా వివాహాల షాపింగ్ పూర్తికాదు. ముఖ్యమైన విషయం ఏంటంటే – ఎంత ఎక్కువ కొంటే, అంత తక్కువ ఖరీదు పడుతుంది.

చిరునామా: బుర్రా బజార్
దగ్గర్లోని ముఖ్యప్రదేశం: మహాత్మాగాంధీ రోడ్
తెరిచే వేళలు: సోమవారం – శనివారం ఉదయం 10:30 గం. నుంచి రాత్రి 8 గం. వరకు | ఆదివారం సెలవు
దగ్గర్లోని మెట్రో స్టేషన్: మహాత్మాగాంధీ రోడ్ (1.1 కి.మీ దూరం)
దగ్గర్లోని రైల్వే స్టేషన్: హౌరా జంక్షన్ (1.7కి.మీ దూరం)

కోల్‌కతాలోని మాల్స్
ఎయిర్ కండిషనింగ్, రద్దీ వాతావరణం మరియు వరుసగా ఉండే బ్రాండెడ్‌ దుకాణాలతో కూడిన అద్భుతమైన మాల్స్‌లో షాపింగ్ చేయాలని నేటని తరం కోరుకుంటుంది. కోల్‌కతాలోని ప్రముఖ మాల్స్:

సిటీ సెంటర్ మాల్, సాల్ట్ లేక్
సౌత్ సిటీ మాల్, జాదవ్‌పూర్
సిటీ సెంటర్2 మాల్, రాజార్హాట్‌
మని స్కేర్, ఈఎం బైపాస్
అవని రివర్‌సైడ్ మాల్, హౌరా

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here