కిబ్బెర్ : స్పిటి లోయ వజ్రం

0
1177

మలుపులు తిరుగుతూ ఉండే రహదారులు, పచ్చదనం, అందమైన ప్రకృతి దృశ్యాలతో స్పిటి లోయ మీకు స్వాగతం పలుకుతుంది. సముద్ర మట్టానికి వేలాది అడుగుల ఎత్తున (12,500 అడుగులు) ఉండే ఈ ప్రాంతం పర్వత సరస్సులు, బౌద్దారామాలతో పర్వత శిఖరం పైభాగాన నెలకొని ఉంటుంది. మీ సెలవులను సాహసోపేతం, థ్రిల్లింగ్ గా మార్చేందుకు మరింకా ఇంకా ఏం కావాలి?

కాజా

Road to Spiti Valley

ఎన్ హెచ్ -22లో ప్రయాణిస్తుంటే, కాబ్ కూడలి మరియు నాకో గ్రామం తరువాత, కాజా చేరుకుంటాం. ఈ పట్టణం ఇప్పుడు పూర్తిగా కమర్షియల్ అయినప్పటికీ, నేటికీ తన ఆకర్షణను నిలబెట్టుకుంది. ఆకర్షణీయమైన దుకాణాలు, ఇళ్ళు ఇక్కడి అందాలను రెట్టింపు చేస్తాయి. కీ మోనాస్టరీ, కిబ్బెర్ గ్రామాలు తప్పక సందర్శించాలి.

కీ మోనాస్టరీ

Key Monastery

కాజా చూసిన తరువాత, ఇక మీరు చేయాల్సింది కాజాలో హెచ్ ఆర్ టీసీ బస్ ఎక్కి అక్కడికి 14 కి.మీ.దూరంలోని కీ మోనాస్టరీ కి చేరుకోవడం. కొండ శిఖరంపై నెలకొన్న 1000 ఏళ్ళ ఈ మోనాస్టరీకి చేరుకునేందుకు అరగంటకు మించి పట్టదు. రోడ్డు మిమ్మల్ని మోనాస్టరీ గేట్ వరకూ తీసుకెళ్తుంది. ఇక్కడి నుంచి కాంక్రీటు మెట్లు మిమ్మల్ని మోనాస్టరీ వరండాలోకి తీసుకెళ్తాయి.

కిబ్బెర్ – ప్రపంచ అత్యంత ఎత్తయిన గ్రామం

Kibber village

కీ మోనాస్టరీ చూసిన తరువాత అక్కడి నుంచి కిబ్బెర్ కు 15 నిమిషాల ప్రయాణం. ఇది 4,270 మీటర్ల ఎత్తున నెలకొంది. రహదారులతో బయటి ప్రపంచంతో బాగా అనుసంధానమైంది.

కిబ్బెర్ గ్రామం అంతా కూడా అందమైన దృశ్యాలతో ఉంటుంది. ఈ చిన్ని గ్రామంలోని సామాజిక జీవనాన్ని మీరు ఎంతో  నందించగలుగుతారు. ఉదయం లేవగానే రైతులు పొలం దున్నడం చూడవచ్చు. స్థానికంగా దొరికే ఎండుపండ్లను తిని ఆనందించవచ్చు. ఈ గ్రామం పక్కనే ఉండే స్పిటి లోయ సూర్యాస్తమయం సమయంలో బంగారు వర్ణంలో ప్రకాశిస్తుంటుంది. స్పటి అంటే ‘మధ్యలో ఉన్న భూమి’ అని అర్థం. ఈ లోయ భారతదేశం మరియు టిబెట్ లకు మధ్యలో ఉంటుంది. అందుకే కిబ్బెర్ తో సహా స్పిటి లోయలోని గ్రామాలన్నీ కూడా విలక్షణమైన టిబెట్ బుద్ధిజంను తమ సంస్కృతి మరియు జీవనశైలిలో భాగంగా చేసకున్నాయి. స్థానికంగా జరిగే బుద్ధిస్ట్ పండుగల్లో స్థానికులు ఎంతో ఉత్సాహంతో పాల్గొంటారు. సామరస్యం, సాంస్కృతిక మార్పిడిలకు ఈ పండుగలు చక్కటి వేదికలుగా ఉంటాయి. రంగు రంగుల దుస్తులతో ప్రజలు ఫాగిల్ మరియు గొచి లాంటి పండుగ లలో పాల్గొంటారు. ఇతర ప్రఖ్యాత పండుగల్లో లాదార్చా,పౌరి, శేషు లాంటివి ఉంటాయి. జూలై, ఆగస్టు నెలలను వేడుకల మాసాలుగా వ్యవహరిస్తుంటారు. చివరి మూడు పండుగలు ఈ రెండు నెలల్లోనే వస్తాయి. చాలా వరకు ఈ వేడుకలను కిబ్బెర్ గ్రామంలో వాలు ప్రాంతాల్లో నిర్వహించుకుంటారు. కుల్లు, లాహౌల్, కిన్నౌర్, రాంపూర్ తదితర ప్రాంతాల నుంచి వర్తకులు ఇక్కడికి వస్తుంటారు.

Kibber Village

మీరు మరెప్పుడైనా హిమాచల్ ప్రదేశ్ వెళ్తే వీటిని చూడడం మరువవద్దు.

 

Originally written by Yashpal Sharma. Read here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here