పర్యటనలకు ప్రణాళిక వేసుకున్నప్పుడు కేవలం కొన్ని రకాల రవాణా సదుపాయాలనే రైలు ప్రయాణంతో పోల్చుకోగలం. అద్భుతమైన భారతదేశ పర్యటనను చేయడానికి భారతీయ రైలు ప్రయాణాన్ని మించిన మరో రవాణా మార్గం లేదు. ఈ ప్రయాణంలో కొన్ని అసౌకర్యాలు ఉన్నప్పటికీ, దీనివల్ల కలిగే ఉల్లాసం, ఇబ్బందులను మైమరిచేలా చేస్తుంది. మన రైలు ప్రయాణంలో మనం చూడగలేది మరేదానితోనూ పోల్చలేం.
భారతీయ రైళ్లలో ప్రయాణం వల్ల కలిగే లాభాల జాబితా
నిజమైన భారత దేశాన్ని చూడడం: భారత దేశంలో రైలు ప్రయాణం మీ సంస్కృతికి, మీ ప్రజలకు మరింత దగ్గర చేస్తుంది. మీతో ప్రయాణించే ప్రతీ ఒక్కరికీ ఓ విభిన్నమైన కథ ఉంటుంది. మిమ్మల్ని ప్రజల మధ్యలో కూర్చోబెడుతుంది రైలు ప్రయాణం. అన్ని వర్గాల వారితోనూ మరియు వారి కథల్లో భాగమయ్యే అవకాశం కల్పిస్తుంది.
జలపాతాల పక్కన లేదా అడవుల్లో లేదా తరంగాల మధ్య మీరు ప్రయాణం చేసే అవకాశం: మీరు ఎప్పుడైనా సొరంగంలో నుంచి వేగంగా రైలు వెళ్తున్నప్పుడు కలిగే అనుభూతిని పొందారా, లేదా వర్షాకాలంలో దట్టమైన అడవిని చూస్తున్పప్పుడు లేదా జలపాతాలను చూస్తున్నప్పుడు.. ప్రతీ గుండె ఉప్పొంగుతుంది. రైలు ప్రయాణం సాహసయాత్రకు ఏమాత్రం తక్కువకాదు. ఏమంటారు..?
బాలీవుడ్ ప్రేమకథలు మీ కళ్లకు కనిపిస్తాయి: రైలు ప్రయాణాలు కేవలం మనకు ప్రయాణాలు మాత్రమే కాదు. కళ్లు కళ్లు కలుసుకోవడానికి, గుండె లయ తప్పడానికి , తొలి చూపులోనే ప్రేమలో పడడానికి రైళ్లే మంచి వేదికలు.
రకరకాల వంటలు: ఆలూ పూరీ నుంచి పరోటా వరకు, మామిడికాయ పచ్చడి నుంచి కాలానికి తగ్గట్లు దొరికే పండ్ల వరకూ, మన ఆహారానికి సరిపడే అన్నింటినీ పొందచ్చు. మనం రైళ్లలో మన ఇంటి భోజనాన్ని కోల్పోయే అవకాశమే లేదు, ఒక వేళ మీరు తెచ్చుకోవడం మర్చిపోతే, మీ తోటి ప్రయాణీకులు వారి అద్భుత భోజనాన్ని మీతో పంచుకోవడానికి ఏమాత్రం సంకోచించరు.
పరిగెత్తే రైల్లోకి ఎక్కడం: ఇది చాలా ప్రమాదం, అయినప్పటికీ, ప్రతీ భారతీయుడు జీవితంలో ఒక్కసారైనా ఈ అనుభవాన్ని పొందడం తర్వాత దాన్ని తలుచుకుని నవ్వుకోవడం పరిపాటే.
కావల్సినంత స్థలం : మీ సీట్లో కూర్చునీ అలసిపోయారా, కాసేపు నడవొచ్చు లేదా పై బెర్తు ఎక్కి పడుకోవచ్చు లేదంటే రైల్వే స్టేషన్‌లో దిగి కాసేపు తిరిగి రావచ్చు, రైలు ప్రయాణంలో మీరెప్పుడూ సౌకర్యంగానే ఉంటారు.
గురకపెట్టే వారితో నెట్టుకురావడం : సరిపడినంతగా నిద్రపోని వారికి ఆ కోటాను పూర్తి చేయడానికి రైలు ప్రయాణం చక్కగా ఉపయోగపడుతుంది. వారికి కావల్సిందల్లా పైబెర్తు మరియు ఓ దిండు మాత్రమే. రైలు కుదుపులు, చక్రాలు చేసే చప్పుళ్లు వారిని ఏ మాత్రం ఇబ్బంది పెట్టవు. వారి గురకలో వచ్చే మార్పులను తోటి ప్రయాణీకులు గమనించవచ్చు. ఇది కొన్నిసార్లు ఇబ్బందికరమే అయినా అది గుర్తుంచుకునే ఓ అనుభవం.
మట్టి పాత్ర చాయ్ కోసం : రైలు ప్రయాణంలో మట్టిపాత్రలో చాయ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడడం ఓ మంచి అనుభవం. ప్రతీ గుటకలో మట్టి సువాసనలను వెదజల్లుతూ మీ మాతృభూమికి మిమ్మల్ని మరింత దగ్గర చేసే ఓ అద్భుతం ఈ మట్టి పాత్ర చాయ్.
మీ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి: కిటికీ సీటు కోసం పిల్లలు దెబ్బలాడుకోవడం చూస్తే, కచ్చితంగా మీకు మీ చిన్నప్పుడు మీ అన్నదమ్ములతో పోట్లాడుకున్న సంగతులు, మీకిష్టమైన లూడో ఆట, పేకాట మరియు చదువుకున్న కార్టూన్ పుస్తకాలతో పాటు ఆనాటి వేసవి పర్యటనలు గుర్తొచ్చి మీ పెదవులపై చిరునవ్వు విరుస్తుంది. మీకు ఇంతకన్నా కావాల్సిందేమిటి?
కొన్ని సార్లు ఇంకా వెళ్తున్నట్లే ఉంటుంది: ఈ ప్రయాణం తరచూ ప్రశాంతంగా ఉంటుంది, మీ గమ్యస్థానం గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండదు.. అది మిమ్మల్ని మనోహరంగా, మంత్రముగ్దులయ్యేలా చేస్తుంది ; అంతేకాదు జీవితాంతం గుర్తుపెట్టుకునే జ్ఞాపకాలనూ అందిస్తుంది.