గర్భంతో ఉన్నప్పుడు రైలు ప్రయాణం ఎంతవరకూ సురక్షితం?

0
1252

గర్భంతో ఉన్నప్పుడు ఎక్కువ సేపు ఒకే చోట కూర్చుని ఉండడం ఇబ్బందికరం కాబట్టి ప్రయాణాలు మానుకోవాలి. అయినప్పటికీ, జీవితం అన్నిసార్లు మనం అనుకున్నట్లు ఉండదు. ఈనాటి ఉరుకుల పరుగుల జీవితంలో, తల్లి కాబోతున్న వారు ప్రయాణాలు మానుకునే అవకాశాలు లేవు. గర్భంతో ఉన్నప్పుడు రైలు ప్రయాణంపై మాకు ఎన్నో ప్రశ్నలు వెల్లువెత్తడంతో, మేం ఓ మంచి సూచికను తీసుకువచ్చాం. కాబట్టి, విశ్వాసపాత్రులైన రైలు యాత్రికులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వదలిచాం.

గర్భంతో ఉన్నప్పుడు రైలు ప్రయాణం ఎంతవరకూ సురక్షితం?
ఎలాంటి గర్భిణీకైనా రైలు ప్రయాణమే సురక్షితమైనది. రోడ్డు ప్రయాణాల్లో గతుకులు, అకస్మాత్తుగా వచ్చే మలుపులు, బ్రేకులు వేసినప్పుడు ముందుకు పడడం లాంటివి ఎదురవుతాయి. కొన్ని విమానయాన సంస్థలు ఓ దశ దాటిన గర్భిణీలను ప్రయాణానికి అనుమతించవు (ఆరోగ్య సమస్యల వల్ల). కాబట్టి, మృదువుగా కదిలే రైళ్లు తల్లికి, కడుపులో ఉన్న బిడ్డకు చాలా సురక్షితం. అయినప్పటికీ, ప్రయాణం చేయడానికి ముందు మీ వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి.

ఏ తరగతిని నేను ఎంచుకోవాలి?

Train travel during pregnancy
గర్భం దాల్చిన 6 నెలల తర్వాత, కుదుపులు లేదా అకస్మాత్తుగా వచ్చే కదలికలు తల్లికి మరియు పిండం ఆరోగ్యానికి క్షేమం కాదు. దీంతోపాటు, తల్లి సౌకర్యంగా కూర్చోవడానికి కావల్సినంత స్థలం కూడా ఉండాలి. కాబట్టి ఏసీ 3 లేదా 2 టైర్‌ కోచ్‌లు ఇలాంటి ప్రయాణాలకు చాలా అనువైనవి. అందుకే, గర్భణీ ప్రయాణానికి ముందుగానే ప్రణాళిక వేసుకోవడం అవసరం. కేవలం కింది బెర్తులను మాత్రమే ఎంపిక చేసుకోండి, దీనివల్ల కాబోయే తల్లి పైకి ఎక్కాల్సిన అవసరం ఉండదు.

ప్రయాణ సమయంలో నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
బరువైన సామాన్లను ఎత్తడం ఈ ప్రయాణాల్లో కష్టమైన పని. కానీ తల్లికాబోతున్న వారిని ఎలాంటి సామాన్లను మోయనివ్వకూడదు. చివరి నిమిషంలో హడావుడిని తప్పించుకోవడానికి, మీరు స్టేషన్‌కు వీలైనంత ముందుగానే చేరుకునేలా చూసుకోండి. తల్లి ప్రతీ అడుగూ జాగ్రత్తగా వేయాలి, రద్దీగా ఉండే స్టేషన్లలో ఇది మరీ ముఖ్యం. దీంతోపాటు, తల్లి ఎక్కువగా వంగకుండా చూసుకోవాలి. వంగడం వల్ల కడుపుపై ఒత్తిడి పెరుగుతుంది, ఇది బిడ్డకు క్షేమం కాదు.

ప్రయాణంలో నేను ఎలాంటి ఆహారాన్ని తినాలి?

Tips-to-travel-during-Pregnancy_3
ప్రయాణాల్లో కఠినమైన ఆహార నియమాలను పాటించడం తప్పనిసరి. రైల్వే స్టాళ్లు లేదా హాకర్స్ అమ్మే పదార్థాలు చూడడానికి బాగున్నా తినకండి. ఎల్లప్పుడూ పేరున్న పంపిణీదారు నుంచి ఆహారాన్ని బుక్ చేసుకోండి, మసాలా లేని, ఇంట్లో తయారు చేసిన పదార్థాలను కోరండి. మీకు ఆకలిగా అనిపిస్తే, కొన్ని పండ్లను తినండి (ముందుగానే కోసిపెట్టుకోవద్దు). మీ శరీరంలో సరైన పరిణామంలో నీటిని ఉంచుకోవడం కోసం ప్యాకేజ్డ్‌ మంచినీటి బాటిళ్లను కొనుగోలు చేసి త్రాగండి.

గర్భంతో ఉన్నప్పుడు నేను ఒంటరిగా ఎందుకు ప్రయాణం చేయకూడదు?
గర్భం చివరి నెలల్లో ఉన్పప్పుడు ఆరోగ్య సమస్యలు ఎప్పడైనా అకస్మాత్తుగా రావచ్చు. అలాంటప్పుడు మీకు తోడు తోడు అవసరం. సామాన్లను మోయడం దగ్గర నుంచి మిమ్మల్ని మరుగుదొడ్లకు తీసుకెళ్లడం వరకూ, మీరు ఎప్పుడూ ఒకరిపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రయాణాల్లో మీ బాధ్యతల్లా సరిపడినంత విశ్రాంతి తీసుకోవడం, మీ కడుపులోని బిడ్డపై దుష్ప్రభావం పడే పనులేవీ చేయకపోవడమే.

ఇతర సలహాలు

Tips-to-travel-during-Pregnancy_4

  • తల్లి సౌకర్యవంతమైన స్థితిలో కూర్చోవాలి.
  • దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు, ఒకే స్థితిలో ఎక్కువ సేపు కూర్చోకండి. సాధ్యమైనప్పుడల్లా పడుకోండి.
  • కాసేపటికోమారు రైలు బోగీలో నడుస్తూ ఉండండి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది.
  • అత్యవసరమైన, సిఫార్సు చేసిన మందులను తీసుకెళ్లండి. సులువుగా తీసుకునే సంచిలో వాటిని ఉంచుకోండి.

ప్రశాంతంగా ప్రయాణించండి
మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు, అన్ని ఒత్తిళ్లను వదిలిపెట్టేయండి. హాయిగా కూర్చుని మీ బిడ్డతో తొలి ప్రయాణాన్ని ఆనందించండి. ఆహ్లాదకరమైన పాటలను వింటూ విశ్రాంతి తీసుకోండి. మార్గమధ్యలో తినడానికి మీకు ఇష్టమైన చాకొలేట్స్‌ లేదా స్నాక్స్ తీసుకెళ్లండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here