బ్రిటీషర్లు మనకు ఎన్నో అద్భుతమైన అవశేషాలను మిగిల్చారు. బ్రిటీష్ కాలంలో భారతదేశ రాజధానిగా వెలుగొందిన కోల్‌కతా,
ఇప్పటికీ బ్రిటీష్ కాలం నాటి కళకు, వాస్తుశిల్పానికి మరియు ఇంజనీరింగ్ నైపుణ్యానికి సాక్ష్యంగా నిలిచి ఉంది. బ్రిటిషర్లు మనకు వదిలి వెళ్లిన వాటి గుండా ప్రయాణం చేద్దాం పదండి.
హౌరా వంతెన: నట్లు, బోల్టులు లేని అత్యంత అరుదైన వంతెనల్లో ఇది ఒకటి. మొత్తం ఆకారం రివిట్లతో నిర్మించబడింది. 100,000 కు పైగా వాహనాలు ఈ వంతెనను దాటుతుండడం వల్ల ప్రపంచంలోనే అత్యంత రద్దీ అయిన వంతెనల్లో ఇదీ ఒకటిగా నిలిచింది. వంతెనపై మీకు ప్రత్యేకమైన ఫోటోలు తీసుకోవాలనుకుంటే అహిరితోలా ఘాట్ నుంచి ఫెర్రీలో వెళ్లండి. ఈ ప్రయాణానికి రూ.20 కూడా ఖర్చవదు.
సమీప రైల్వే స్టేషన్: హౌరా రైల్వే స్టేషన్ (350 మీ దూరం)
హోగ్ మార్కెట్ లేదా కొత్త మార్కెట్: ఈ కాంప్లెక్స్‌ను సర్ స్టువార్ట్ హోగ్ 1903లో నిర్మించారు ఇది ఒకప్పుడు సహేబేర్ బజార్‌గా
పిలవబడేది. ఇక్కడ పెర్‌ఫ్యూమ్స్, షూలు, కూరగాయలు మరియు పండ్లను కొనుక్కోవచ్చు. ఇందులోని ఓ ప్రాంతంలో కబేళా నిర్వహిస్తున్నారు.
సమీప మెట్రో స్టేషన్: ఎస్ప్లనేడ్ (300 మీ దూరం)
సెయింట్ పాల్స్ కేథెడ్రల్: గోతిక్ శైలి నిర్మాణానికి పేరుగాంచిన సెయింట్ పాల్స్ కేథెడ్రల్, బ్రిటీష్ సామ్రాజ్యంలోని ఇతర దేశాల్లో
నిర్మించిన తొలి కేథడ్రల్ చర్చి. దీని నిర్మాణం 1847లో పూర్తయ్యింది. ఈ చర్చ్‌లో అందంగా అలంకరించిన సెంట్రల్ హాల్, చెక్కతో చేయబడిన కుర్చీలు మరియు బల్లలు, ముద్రించిన అద్దాల కిటికీలు మరియు సమ్మిళతమైన చిత్రకళ మిమ్మల్నిఆకట్టుకుంటాయి.
సమీప మెట్రో స్టేషన్: మైదాన్ (1 కి.మీ దూరం)
విక్టోరియా మెమొరియల్: అప్పటి భారత వైస్రాయ్, లార్డ్ కర్జన్, విక్టోరియా రాణి మరణానికి స్మారకంగా 1901లో ఈ నిర్మాణాన్ని
ప్రారంభించారు. అందమైన గార్డెన్లతో, లాన్లు, సరస్సులతో, పై భాగంలో నైక్ విగ్రహం (గ్రీకు విజయ దేవత) తో ఉండే ఇది కోల్‌కతాలో
తప్పక సందర్శించాల్సిన ప్రాంతం. ఇందులో ఉండే మ్యూజియంలో ఎన్నో చారిత్రక అవశేషాలు, పెయింటింగ్స్, పుస్తకాలు, ఆయుధాలు ఉన్నాయి.
గార్డెన్ ప్రవేశ టికెట్ – రూ.10 ; మ్యూజియం ప్రవేశ టికెట్ – రూ.20
ప్రతీ సోమవారం మరియు ప్రభుత్వ సెలవు దినాల్లో మ్యూజియం మూసి ఉంటుంది.
విక్టోరియా మెమొరియల్ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకూ తెరిచి ఉంటుంది.
సమీప మెట్రో స్టేషన్: రవీంద్ర సదన్ (1 కి.మీ దూరం)
నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా: భారతదేశంలోనే ఇది అతి పెద్ద గ్రంథాలయం. 2.2 మిలియన్ల పుస్తకాలు ఇందులో ఉన్నాయి.
స్వాతంత్ర్యానికి పూర్వం ఇది బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ నివాసం. విక్టోరియా కాలం నాటి ఎన్నో నిజ ప్రతులు ఈ గ్రంథాలయంలో
ఉన్నాయి, భారతదేశంలోని అన్ని భాషలకు చెందిన పుస్తకాలు ఇక్కడ కనిపిస్తాయి. అద్భుతమైన గార్డెన్లు, పొడవైన కాలిబాటలతో ఉన్న ఈ గ్రంథాలయాన్ని చాలా మంది పర్యాటకులు చదువుకోవడం కోసం చూడడం కోసం దర్శిస్తుంటారు.
ఈ గ్రంథాలయం ఉదయం 9 నుంచి రాత్రి 8 వరకు , శని, ఆది, ప్రభుత్వ సెలవు దినాల్లో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6 వరకు తెరిచి ఉంటుంది.
సంద్శకుల పాస్‌లు ఉదయం 11- మధ్యాహ్నం 1 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 4 మధ్య సోమవారం నుంచి శుక్రవారం వరకూ ఇవ్వబడతాయి.
సమీప మెట్రో స్టేషన్: రవీంద్ర సదన్ (2.4 కి.మీ దూరం). స్టేషన్ బయట అలిపోర్ వెళ్లే బస్సులు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి.
కాబట్టి, కోల్‌కతాలోని ఈ బ్రిటీష్ కాలం నాటి అద్భుతాలను దర్శించండి. మీకు కచ్చితంగా ఇవి నచ్చుతాయి.