భారతీయ రైల్వేలకు ప్రపంచంలో అత్యంత పొడవైన నెట్ వర్క్ ఉంది. ఇవి అందమైన ప్రకృతి దృశ్యాల నుంచి భయంకరమైన అనుభవాల వరకు ప్రయాణికులు అందిస్తాయి. దెయ్యాలు సంచరిస్తాయని విశ్వసించే కొన్ని రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఆ 5 రైల్వే స్టేషన్స్ గురించి తెలుసుకుందాం.
బరోగ్ స్టేషన్ (బీఓఎఫ్), సిమ్లా
టెన్నెల్ నం.33 లేదా బరోగ్ టెన్నెల్ కు సమీపంలో ఉన్న ఈ స్టేషన్ లో అతీత శక్తులు సంచరించటాన్ని ప్రజలు చూసారు. టెన్నెల్ ని నిర్మించిన బ్రిటీష్ ఇంజనీర్ కొలొనల్ బరోగ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన్ని టన్నెల్ సమీపంలోనే ఖననం చేసారు. కొద్ది కాలానికే టెన్నెల్ లోపల ఆయన ఆత్మ సంచరిస్తున్నట్టు స్థానికులు భావిస్తున్నారు.
బేగన్ కొడోర్ స్టేషన్ , పశ్చిమ బెంగాల్
అసాధారణ వేళల్లో ఆడ దెయ్యం ఈ స్టేషన్ లో సంచరించటాన్ని చూసామని చాలామంది ప్రయాణికులు ఫిర్యాదు చేయటంతో ఈ స్టేషన్ 42 సంవత్సరాలు మూతపడింది. దెయ్యాన్ని చూసిన వారు కొద్ది కాలానికే మరణిస్తున్నారని ప్రజలు నమ్మారు. ప్రయాణికులు ఈ స్టేషన్ లో దిగటం మానేశారు. ఉద్యోగులు కూడా అక్కడ నుంచి వెళ్లిపోయారు. 2009లో రైల్వే స్టేషన్ ని తిరిగి ప్రారంభించారు కానీ ప్రయాణికుల మనస్సులో భయం మాత్రం లోతుగా పాతుకుపోయింది.
నైని స్టేషన్ (ఎన్ వైఎన్), ఉత్తర్ ప్రదేశ్
నైని జైలులో చాలామంది స్వాతంత్ర్య సమరయోధుల్ని వేధింపులకు గురిచేసి వారికి మరణశిక్షలు విధించారు. ఈ జైలు రైల్వే స్టేషన్ కి సమీపంలో ఉంది. వీరి ఆత్మలు స్టేషన్ లో, పట్టాల వద్ద రాత్రివేళ సంచరిస్తాయని ప్రజల నమ్మకం.
చిత్తూరు స్టేషన్(సీటీఓ), ఆంధ్రప్రదేశ్
2013 అక్టోబర్ లో తోటి ఆర్ పీఎఫ్ సిబ్బంది మరియు టీటీఈలు కలిసి చేసిన దాడిలో మరణించిన హరి సింగ్ అనే సీఆర్ పీఎఫ్ అధికారి ఆత్మ ఈ స్టేషన్ లో సంచరిస్తుందని ప్రజల నమ్మకం. అతను చిత్తూరు స్టేషన్ లో దిగాడు కానీ గాయాల వల్ల మరణించాడు.
లూధియానా స్టేషన్ (ఎల్ డీహెచ్), పంజాబ్
రిజర్వేషన్ కౌంటర్ వద్ద ఉండే చిన్న గదిలో 2004లో సుభాష్ అనే అధికారి మరణించాడు. ఈ గదిలో ఆయన ఆత్మ సంచరిస్తోందని ప్రజల నమ్మకం. ఈ గదిలో కూర్చున్న వారు ఏదో మానవాతీత శక్తి సంచరించిన అనుభవాన్ని పొందుతారని ప్రజలు అంటారు.
Originally written by Yashpal Sharma. Read here.