భారతదేశం విస్తృత స్థాయిలో మరియు వృద్ధి చెందుతున్న విమానాల నెట్ వర్క్ ను కలిగి ఉన్నప్పటికీ, ఇప్పటికీ రవాణాకు రైళ్లే ప్రాధాన్యపూరిత ఎంపికగా ఉన్నాయి. రైలులో మీకు కిటికీ పక్క సీటు దొరికితే, మీరు అందమైన సరస్సును చూసి ఆనందించవచ్చు. రైల్లో నుంచి చూడగల కొన్ని సరస్సుల వివరాలుః
వడ్డేపల్లి చెరువు, వరంగల్, తెలంగాణ
కాజీపేట జంక్షన్ నుంచి వరంగల్ మార్గంలో మీరు ఎడమవైపున వడ్డేపల్లి చెరువు చూడవచ్చు. ఈ చెరువు వద్ద సూర్యాస్తమయం అద్భుతంగా కనిపిస్తుంది. మీరు గనుక సాయంత్రం వేళల్లో ఈ చెరువును రైల్లోంచి గనుక దాటుతూ ఉంటే, పర్ ఫెక్ట్ షాట్ కోసం మీ కెమెరాలను సిద్ధం చేసుకోండి.
మార్గం: సికింద్రాబాద్ – విశాఖపట్నం
ఉత్తమ సమయం: సాయంత్రం
టికెట్ వెల: రూ.60
చిలుకా సరస్సు, గంజాం, ఒడిషా
మీరు గనుక చెన్నై నుంచి హౌరా వైపు పయనిస్తుంటే, ఎంతో పెద్దగా కనిపించే చిలుకా సరస్సును చూడవచ్చు. రైలు కాలికోట్ అనే చిన్న స్టేషన్ దాటిన తరువాత, ఓ చిన్న మలుపు తిరిగి కాలిజి వైపు వెళ్ళగానే ఊపిరి బిగబట్టి చూసే రీతిలో చిలుకా సరస్సు దర్శనమిస్తుంది.
మార్గం: చెన్నై – హౌరా
చక్కటి సమయం: చీకటి పడని సాయంకాలం
టికెట్ వెల: రూ.50
పాక్ జలసంధి, పంబన్ ఐలాండ్, తమిళనాడు
రామేశ్వరం – పంబన్ ద్వీపం లోని రామేశ్వరాన్ని భారత ప్రధాన భూభాగంతో కలిపే పంబన్ వంతెన 2 కి.మీ. పొడవు ఉంటుంది. ఇక్కడ భద్రత కారణాల రీత్యా రైలు చాలా నెమ్మదిగా వెళ్తుంది. సముద్ర ప్రయాణాన్ని ఆనందించే అనుభూతిని ప్రయాణికులకు అందిస్తుంది.
మార్గం: చెన్నై – రామేశ్వరం
చక్కటి సమయం: పగటిపూట
టికెట్ వెల: రూ.150
దూద్ సాగర్ జలపాతం, మడగావ్, గోవా
బెలగామ్ మరియు మడగావ్ మధ్యలో ప్రయాణిస్తున్నప్పుడు రైలు కోట లాంటి క్యాస్టెల్ రాక్ స్టేషన్ లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ కుడివైపు నుంచి మీరు మంత్రముగ్దులను చేసే దూద్ సాగర్ జలపాతం దృశ్యాన్ని చూడవచ్చు. మీరు గనుక వర్షాకాలం (జూన్ – జూలై) లో ప్రయాణిస్తున్నట్లయితే చక్కటి బొనాంజా దొరికినట్లే.
మార్గం: బెలగామ్ – మడగావ్
చక్కటి సమయం: పగటిపూట
టికెట్ వెల: రూ.150
గంగ, వారణాసి, ఉత్తర ప్రదేశ్
మొఘల్ సరాయి నుంచి మీరు గనుక వారణాసి వైపు ప్రయాణిస్తుంటే మీరు డుఫెరిన్ వంతెన (మాలవీయ వంతెనగా పేరు మార్చబడింది) ను దాటుతారు. 2 కి.మీ. పొడవైన వంతెన మీదకు రైలు ఎక్కగానే వారణాసి, దాని పవిత్ర ఘాట్లు దర్శనమిస్తాయి.
మార్గం: ఢిల్లీ – పాట్నా
చక్కటి సమయం: ఉదయం
టికెట్ వెల: రూ.150