నోరూరించే ఐదు తమిళనాడు రుచులు

0
642

భోజన ప్రియులకు సరైన గమ్యం తమిళనాడు, ఎందుకంటే ఇక్కడ ప్రతి ప్రాంతం ఒక్కో వంటకానికి ప్రసిద్ధి. మేం కచ్చితంగా చెప్పగలం ఒకవేళ మీరు వీటి గురించి విన్నప్పటికీ, అన్నింటిని రుచి చూసి ఉండరు.

Nagercoil Chips

నాగర్ కోయల్ చిప్స్: నాగర్ కోయల్ పనసకాయల చిప్స్ కి ప్రసిద్ధి. అక్కడికి వెళ్లి వాటిని తినకుండా వస్తే ఆ పర్యటన అసంపూర్తిగా ముగిసినట్టే. స్థానికులు చక్కివాతలుగా పిల్చుకునే ఈ చిప్ప్ అత్యంత రుచికరంగా ఉంటాయి, ఒక్కసారి రుచి చూస్తే మీరు వదిలిపెట్టరు. నాగర్ కోయల్ వీధులన్నీ కూడా కొబ్బరి నూనెలో చిప్ప్ వేపుతున్న వాసనలతో ఘుమఘుమలాడిపోతుంటాయి. పనసకాయ చిప్స్ తో పాటు అరటికాయ చిప్స్ కి కూడా ఈ పట్టణం ప్రసిద్ధి చెందింది. స్థానికంగా వీటిన నెంద్రమ్ చిప్స్ అంటారు. దీని రుచి ప్రత్యేకమైనది, కాస్త ఉప్పదనంతో కూడిన విభిన్నమైన రుచితో ఉండే ఈ అరటికాయ చిప్స్ ను మీరు మరెక్కడా తినలేరు.

Tirunelveli halwa

తిరునల్వేలి హల్వా: నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత మెత్తటి స్వభావం, చూడచక్కని రూపం తిరునల్వేలి హల్వా ప్రత్యేకత. మృదుత్వాన్ని పోల్చుతూ మాట్లాడేటప్పుడు ఈ హల్వాను వర్ణనకు ఉపయోగిస్తారు. తిరునల్వేలిలో రెండు సుప్రసిద్ధ దుకాణాలు ఉన్నాయి. అవి ఇరుట్టు కడై, శాంతి స్వీట్స్. ఈ రెండు షాపులు తిరునల్వేలి హల్వాకు పెట్టింది పేరు.

Tuticorin Macaroon
టుటికారన్ మకరూన్: మకరూన్ ను గుడ్లు, పంచదార, జీడిపప్పుతో చేస్తారు. తియ్యదనంతో కూడి అధిక కెలొరీలు అందించే ఆహార పదార్థం ఇది. శంఖు ఆకారంలోని ఈ ముక్కల్ని నోట్లో వేసుకోగానే చక్కెర కరిగిపోతుంది. ప్యాకెట్ కొని ఒకటి నోట్లో వేసుకుంటే, ఇక ఆ తర్వాత మీరు ఆపకుండా వాటినే తింటుంటారు, కావాలంటే ఈ విషయంలో నేను మీతో పందెం కట్టడానికి కూడా సిద్ధమే.

Kutralam Parotta
కుట్రాలం పరోటా: ఉత్తర భారతదేశ పరోటాలతో పోల్చితే తమిళనాడు పరోటాలు చాలా భిన్నంగా ఉంటాయి. తమిళనాడులోని కుట్రాలం పరోటాలు అత్యంత రుచికరంగా ఉంటాయి. తమిళనాడు, కేరళ సరిహద్దుల్లోని ఓ చిన్న షాప్ ఈ పరోటాలకు ప్రసిద్ధి. దీనిని బోర్డర్ షాప్ గా పిలుస్తారు. పరోటా ప్రేమికులు తప్పనిసరిగా ఈ షాప్ కి వెళ్లాల్సిందే.

 

Read original article here.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here