భారతదేశంలో తప్పనిసరిగా సందర్శించాల్సిన 5 తేయాకు తోటలు

0
1779

అత్యంత నాణ్యమైన టీ ఉత్పత్తికి భారతదేశం ఎంతగానో పేరొందింది. అందుకే ఇటీవలి కాలంలో తేయాకు పర్యటన బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. తేయాకు తోటల చుట్టూ ఉండే వాతావరణం ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది. వాటిని చూడడం మీకు మధురానుభూతిని అందిస్తుంది!

నవంబర్ – మార్చి నెలలో తేయాకు పర్యాటకం తారస్థాయికి చేరుకుంటుంది. తప్పక చూడాల్సిన అందమైన తేయాకు తోటల వివరాలు మీకు అందిస్తున్నాం.

Darjeeling Tea Tourism

డార్జిలింగ్, పశ్చిమ బెంగాల్ : డార్జిలింగ్ చేరుకునేందుకు న్యూ జల్పాయ్ గురి నుంచి డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేలో ప్రయాణించండి. భారతదేశ మొత్తం తేయాకు ఉత్పత్తిలో 25 శాతానికి పైగా తేయాకు డార్జిలింగ్ టీ ఎస్టేట్స్ నుంచే వస్తుంది. హ్యాపీ వ్యాలీ టీ ఎస్టేట్ మరియు ది గ్లెన్ బర్న్ టీ ఎస్టేట్ తప్పక చూడాల్సినవి.

Jorhat Tea Estate

జొర్హాత్, అస్సాం: అస్సాం లోని బ్రహ్మపుత్ర వ్యాలీలో నెలకొన్న జొర్హాత్ ను తరచుగా ‘ప్రపంచపు తేయాకు రాజధాని’గా వ్యవహరిస్తుంటారు. ఇది జొర్హాత్ రైల్వే స్టేషన్ కు కొద్దిదూరం

Munnar Tea Estate

మున్నార్, కేరళ : కేరళ లోని ప్రఖ్యాత హిల్ స్టేషన్ లోకి మీరు ప్రవేశించగానే మైళ్ళ పొడవునా విస్తరించి ఉండే తేయాకు తోటలు మీకు స్వాగతం పలుకుతాయి. అలువా రైల్వే స్టేషన్ నుంచి కొద్ది దూరంలోనే ఈ తేయాకు తోటలు ఉన్నాయి. తేయాకు సేకరణ మరియు ప్రాసెస్ లను చూసేందుకు నల్లతన్ని ఎస్టేట్ మరియు కుందాలె టీ ప్లాంటేషన్ లను మీరు సందర్శించవచ్చు. లోనే ఉంటుంది. అడ్డాబారె టీ ఎస్టేట్ పక్కనే ఉండే వైల్డ్ మహెసీర్ కూడా తప్పక చూడాల్సిన తేయాకు పర్యాటక కేంద్రాల్లో ఒకటి.

Conoor Tea Estate

కొనూర్, తమిళనాడు: గాఢమైన, పరిమళభరిత తేయాకు రకానికి పేరొందిన కొనూర్ చేరుకునేందుకు కోయంబత్తూరు నుంచి నీలగిరి మౌంటెన్ రైల్వేలో ప్రయాణించాలి. ఇక్కడ సందర్శించాల్సిన స్థలాల్లో హై ఫీల్డ్ టీ ఫ్యాక్టరీ, ట్రాంక్విలి టీ లాంజ్ మరియు సింగార టీ ఎస్టేట్ ఉన్నాయి.

Palampur Tea Estate

పాలంపూర్, హిమాచల్ ప్రదేశ్ : ఉత్తర భారతదేశ తేయాకు రాజధానిగా ఇది పేరొందింది. ఈ ప్రాంతంలోని అతి పెద్ద టీ ప్లాంటేషన్స్ దౌలాధర్ పర్వతాల ఒడిలో ఉన్నాయి. ఇక్కడి టీ ప్లాంటేషన్స్ పైన్ వృక్షాలతో కూడిన అందమైన ల్యాండ్ స్కేప్ లతో, తేయాకు తోటల వాలులతో ఉంటాయి. కాంగ్రా చేరుకునేందుకు పఠాన్ కోట్ నుంచి కాంగ్రా వ్యాలీ రైల్వేస్ లో ప్రయాణించాలి. రైల్వే స్టేషన్ నుంచి కొద్ది దూరంలోనే టీ ఎస్టేట్స్ ఉంటాయి.

వాలులో ఉండే తేయాకు తోటలతో కూడిన ఈ పర్వతాలు మరియు చిన్న చిన్న సెలయేరులు జీవితంలోని ఒత్తిళ్ళ నుంచి ఎంతో ఉపశమనాన్ని అందిస్తాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here