చండీగఢ్ లో చూడచక్కటి ప్రదేశాల్లో శివాలిక్ కొండ బ్యాక్ డ్రాప్ గా ఉండే సుక్నా లేక్ ఒకటి. నగర రణగొణ ధ్వనులకు దూరంగా ప్రశాంత వాతావరణంలో సేద దీరేందుకు పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ ఒక బోటు అద్దెకు తీసుకోవచ్చు, సేదదీరొచ్చు. నీలి ఆకాశం కింద బోటులో విహరించవచ్చు.
బ్యాక్ రోడ్ లో వెళ్ళడం
గోల్ఫ్ కోర్సు కు సమాంతరంగా ఉన్న రోడ్ పై సరస్సు కు వెనుకవైపుగా 3.5 కి.మీ. దూరం వెళ్ళాలి. నగర వాతావరణానికి పూర్తి భిన్నంగా ఉండే ప్రశాంత వాతావరణంలోకి మీరు చేరుకుంటారు. సరస్సు వెనుక భాగంలో, కూర్చున్న భంగిమలో ఉన్న బుద్ధ విగ్రహం ఉంది. దీన్ని గార్డెన్ ఆఫ్ సైలెన్స్ అని అంటారు. నిశ్శబ్దాన్ని ఆనందించే వారు దీన్ని తప్పక చూడాల్సిందే.
నిశ్శబ్ద ప్రశాంతత
సుక్నా లేక్ ప్రధాన భాగం అంతా కూడా పిల్లల జాయ్ రైడ్స్, తినుబండారాల దుకాణాలతో సందడిగా ఉంటుంది. ఈ వెనుకవైపు మార్గం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. తెల్లవారుజామునే ఈ మార్గంలో నడవడం మీకు హిల్ స్టేషన్ లో ఉన్న అనుభూతిని అందిస్తుంది. అద్భుత కళాత్మకత ఉట్టిపడే బుద్ధ విగ్రహం చూడడం ఓ గొప్ప అనుభూతిని ఇస్తుంది. రాత్రి వేళ ఇది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సైబీరియన్ డక్, కొంగలు వంటి వలస పక్షులను శీతాకాలంలో చూడవచ్చు.
పచ్చటి అడవుల్లో…
సరస్సుకు ఈశాన్యంలో అటవీ ప్రాంతం ఉంది. సుక్నా వైల్డ్ లైఫ్ శాంచురీ గా దీన్ని వ్యవహరిస్తారు. సాంబార్, కుందేలు, ముంగిస తదితర జంతువులను ఇక్కడ చూడవచ్చు. సుమారు 150కి పైగా రకాల పక్షులను ఇక్కడ చూడవచ్చు. ఈ ప్రాంతాన్ని చూడాలనుకునే వారు ముందుగా కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ , యూటీ, చండీగఢ్ నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలి.
సుక్నాలో ఇతర ఆకర్షణలు
- రాక్ గార్డెన్
- ఓపెన్ హ్యాండ్ మాన్యుమెంట్
- చండీగఢ్ గోల్ఫ్ క్లబ్
Originally written by Saniya Pasricha. Read here.