షెట్టిహళ్లి చర్చ్‌: నీటి నుంచి దర్శనం

0
809

హసన్‌లోని అద్భుతమైన ప్రదేశంలో ఉన్న రోజరీ చర్చ్‌ గురించి కొంతమందికే తెలుసు, హసన్‌ లోని షెట్టిహళ్లి నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హేమావతి నది ఒడ్డున ఉండే ఈ చర్చి ప్రత్యేకత ఏమింటంటే, వర్షాకాలంలో ఈ చర్చ్‌ నీటిలో మునిగిపోతుంది.

రోసరీ చర్చ్ చరిత్ర

Shettihali Church
షెట్టిహళ్లి చర్చ్‌ను 1860లో ఫ్రెంచ్ మిషనరీలు నిర్మించాయి. చాలాకాలం క్రితం చర్చ్‌కు సమీపంలో ఓ గ్రామం ఉండేదంటారు. 1960లో గోరూర్ ఆనకట్టను నిర్మించడంతో హేమావతి రిజర్వాయర్‌లోకి వరద వచ్చిపడేలా చేసింది. తరచూ వరదలు వస్తుడడంతో చర్చ్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో జనావాసాలు లేకుండా పోయాయి. అప్పటి నుంచి, ప్రతీ వర్షాకాలంలో ఈ చర్చి మునిగిపోయి , కొద్దిగా మాత్రమే కనిపిస్తూ అద్భుతమైన దృశ్యం సాక్షాత్కారమవుతుంది.

ఆసక్తికర విషయాలు

Shettihali Church Interior

  • రోసరీ చర్చ్ నిర్మాణంలో మోర్టార్‌ మరియు ఇటుకలతో పాటు, బెల్లం మరియు గుడ్లతో చేసిన మిశ్రమాన్ని ఉపయోగించారు.
  • వర్షాకాలంలో చర్చ్ పూర్తిగా నీట మునుగుతుంది, నీళ్లు తగ్గిన తర్వాత పూర్తిగా అత్యద్భుతంగా దర్శనమిస్తుంది.
  • చాలా ప్రాంతీయ సినిమాలు మరియు సీరియళ్లు ఇక్కడ తీశారు.
  • చర్చ్‌ శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ చక్కగా నిలబడి కనువిందు చేస్తుంది.

క్యాంప్ చేయడం & వసతి సౌకర్యం

Submerged Church Hasan
ప్రకృతి ప్రేమికులు నది ఒడ్డున క్యాంప్ చేయవచ్చు. దగ్గరలో ఉన్న రప్పా ఐలాండ్ రిసార్ట్‌లో మంచి వసతి సౌకర్యాలున్నాయి.

సందర్శించడానికి మేలైన సమయం
ఈ ప్రత్యేకమైన చర్చ్‌ను ఏడాదిలో ఎప్పుడు దర్సించుకున్నా అద్భుతంగానే ఉంటుంది. వర్షాకాలం ముగిసిన తర్వాత, నీళ్లు తగ్గిన తర్వాత, చర్చ్‌ మొత్తాన్ని చూడొచ్చు. అయినప్పటికీ, మునిగిన చర్చ్‌ సరికొత్తగా కనిపిస్తుంది.

దగ్గరలోని ఆకర్షణీయ ప్రాంతాలు

Belur & Halebid
బేలూరు & హాలేబీడు: కర్ణాటకలోని చారిత్రక పట్టణాలైన ఇవి గుళ్లకు మరియు శిల్పసంపదకు పేరుగాంచాయి.

Shravanabelagola statue
శ్రావణ బెలగోలా: శ్రావణ బెలగోలాలో గోమఠేశ్వర బాహుబలి విగ్రహం ఉంటుంది. జైన మతస్థులకు ఈ పట్టణం అత్యంత ప్రముఖమైన ఆధ్యాత్మిక క్షేత్రం.

ఎలా చేరుకోవాలి?
షెట్టిహళ్లి బెంగళూరుకు 205 కి.మీ దూరంలో, హసన్‌కు 22 కి.మీ. దూరంలో, మైసూర్‌కు 123 కి.మీ దూరంలో ఉంటుంది.
రైలు ద్వారా: యశ్వంత్‌పూర్ రైల్వే స్టేషన్ నుంచి షెట్టిహళ్లికి తరచూ రైళ్లుంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here