అంతగా వినని 8 భారతదేశ కోటలు

0
1534

అవి ఎన్నో యుద్ధాలకు సాక్ష్యంగా నిలిచాయి. వాటిపై నియంత్రణకు రక్తం ఏరులై పారింది. అయినా అవి నేడు ఒంటిగా నిలిచి ఆ కథలు మీకు తెలియజేందుకు నిలిచి ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొన్ని గొప్ప కోటలను భారతదేశం కలిగి ఉంది. వీటిలో కొన్ని బాగా ప్రఖ్యాతి చెందితే, మరి కొన్ని తమ ఠీవిని కోల్పోకుండా ఒంటిగా నిలిచి ఉన్నాయి. రాజస్థాన్ లో మీరు చూసిన కోటలే దేశంలో గొప్పవి అనుకుంటున్నారా…కాస్తంత ఆగండి. ఇక్కడ మేము మీకు అంతగా ప్రాచుర్యంలోకి రాని కొన్ని గొప్ప కోటల వివరాలు అందిస్తున్నాం.

Basgo Fort

బాస్గో కోట, లడఖ్ : నేడు ఇది బుద్ధిస్ట్ మోనస్టరీగా బాగా పేరొందింది. లేహ్ నుంచి 40 కి.మీ. దూరంలో బాస్గో ఉంది. 1680 లలో ఇక్కడ నామ్ గ్యాల్ పాలకులు ఒక కోటను నిర్మించారు. అది ఉన్నత దశలో ఉన్నపుడు రాజకీయాలకు, సంస్కృతికి కేంద్రంగా ఉండింది. ఒక ప్రాచీన నగరపు శిథిలాలను చూస్తున్నట్లుగా ఇది ఒక కొండ పై నెలకొంది.

Rabdentse Fort

రాబ్ డెంటస్ కోట, సిక్కిం: సిక్కిం రాజ్యానికి 15 – 19 శతాబ్దాల మధ్య ఇది రెండో రాజధానిగా విలసిల్లింది. ప్రధానంగా ఇది పొరుగు రాజ్యాల నుంచి రక్షణ కల్పించేందుకు నిర్మించబడింది. గూర్ఖాల చే ఈ కోట నాశనమైంది. రాజభవనం, కోట, కొన్ని నిర్మాణాల శిథిలాలు ఈ కాంప్లెక్స్ లో ఉన్నాయి. ఈ కోట వద్ద నుంచి కాంచన్ జంగ పర్వత శ్రేణుల మనోహర దృశ్యాలను చూడవచ్చు. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చే ఈ కోట జాతీయ ప్రాధాన్యం కలదిగా ప్రకటించబడింది.

Tughlaqabad Fort

తుగ్లకాబాద్ కోట, ఢిల్లీ: ఢిల్లీలో 6 కి.మీ. పొడవునా విస్తరించి ఉన్న ఈ కోట 1321లో గియాస్-ఉద్ –దిన్ తుగ్లక్ చే నిర్మించబడింది. చెప్పుకోదగ్గ కొండరాళ్ళ నిర్మాణంతో ఇది తుగ్లక్ రాజవంశ సంక్లిష్ట ఆర్కిటెక్చర్ విలువలతో ఉంది. 600 అడుగుల పొడవైన కాజ్ వే తుగ్లక్ సమాధి వద్దకు మనల్ని తీసుకెళ్తుంది.

Diu Fort

డియు కోట, డామన్ డియు : 2009లో డియు కోట, పోర్చుగీసు వలస పాలన అద్భుతాల్లో ఒకటిగా ప్రకటించబడింది. మొఘల్ చక్రవర్తి హుమాయున్ నుంచి నగరాన్ని కాపాడుకునేందుకు నిర్మించిన ఈ కోట ఈ ద్వీపంలో పోర్చుగీసు పాలనలో బాగా వృద్ధి చెందింది. హిందూ మహాసముద్రపు ద్వీపంలో నిర్మించబడిన ఈ కోటలో నుంచి సముద్రాన్ని చూడడం ఒక చక్కటి అనుభూతి. కోట ఆవరణలోనే చూడదగ్గ కట్టడాలెన్నో ఉన్నాయి. 17వ శతాబ్ది నాటి సెయింట్ పౌల్స్ చర్చి మరియు సెయింట్ థామస్ చర్చి ఇక్కడ చూడవచ్చు. వెనెటియన్ గోతిక్ శైలికి చెందిన బంగళాలను కూడా కోట జపాటా గేట్ వద్ద చూడవచ్చు. ఇక్కడ గంగేశ్వర్ మహదేవ్ ఆలయం కూడా ఉంది. ఐదుమంది పాండవ సోదరులు దీన్ని నిర్మించినట్లుగా చెబుతారు.

Sidhudurg Fort

సిధుదుర్గ్ కోట, మహారాష్ట్ర: ఈ కోటను ఛత్రపతి శివాజీ 1656లో ఈ ప్రాంతంలో మరాఠా సామ్రాజ్య ప్రయోజనాలను కాపాడేందుకు నిర్మించాడు. కొంకణ్ ప్రాంతం నుంచి అరేబియా సముద్రాన్ని చూస్తున్నట్లుగా ఇది ఉంటుంది. 4000 దిబ్బల ఇనుమును పోతలో, పునాది రాళ్ళలో వినియోగించినట్లుగా చెబుతారు. ఈ కోట నిర్మాణం తీరుతెన్నులలో మరాఠాల చాతుర్యం చూడవచ్చు. కోట ప్రధాన ద్వారాన్ని ఇతరులెవరూ చొరబడేందుకు వీలు లేకుండా నిర్మించారు. ఒకప్పటి ఖిల్లేదార్ ల కుటుంబం ఇప్పటికీ కోటలో నివసిస్తుందని చెబుతారు. బహు కోట, జమ్మూ కాశ్మీర్ : ఈ 18 వ శతాబ్ది కోటను రాజ్ పుత్ రాజు బహు లోచన్ నిర్మించాడు. ఈ కోట 325 మీటర్ల ఎత్తున, పాత జమ్మూ నగరానికి అభిముఖంగా, తావి నదికి ఎడమవైపున ఉంది. ఇక్కడి నుంచి జమ్మూ నగరాన్ని చక్కగా చూడవచ్చు. ఈ కాంప్లెక్స్ లోనే బావె వాలి మాతా ఆలయం ఉంది. ఆదివారం, మంగళవారం నాడు ఎంతో మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఆలయం ఆవరణలో పెద్ద సంఖ్యలో రేసుస్ కోతులు ఉంటాయి. ఇంత భారీ సంఖ్యలో ఈ కోతులు ఒకే చోట రాష్ట్రంలో మరెక్కడా లేవు.

Bahu Fort

మండు కోట, మధ్యప్రదేశ్ : చిన్న పట్టణమైన మండు చరిత్రలో మాత్రం అమిత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కొండపై ఉన్న ఈ కోట 10వ శతాబ్దానికి చెందింది. పార్మర్స్ దీన్ని నిర్మించారు. వ్యూహాత్మకంగా ఇది ఉన్న ప్రాంతం రీత్యా ఇది బాగా ప్రాధాన్యం సంతరించుకుంది.  శాలమైన మాల్వా పీఠభూమి ఒక వైపున, మరో వైపున నర్మద నది ఉన్నాయి. ఇక్కడ ఎన్నో యుద్ధాలు జరిగాయి. చేరువలోనే రూప్ మతి పెవిలియన్, నీల్ కాంత్ ప్యాలస్, జహాజ్ మహల్, హోశంగ్ సమాధి, అష్రాఫి మహల్, బాజ్ బహదూర్ ప్యాలస్ ఉన్నాయి.

Mandu Fort

రంతాంబోరె కోట, రాజస్థాన్: మీనా గిరిజనులచే 944 లో నిర్మించబడిన ఈ కోట చౌహాన్ వంశపు రాజు హమీర్ దేవ్ ధైర్యసాహసాల గాధలెన్నో తెలియచెబుతుంది. రతంబోరె నేషనల్ పార్క్ లోనే నెలకొని ఉన్న ఈ అన్ని వైపులా అడవులచే చుట్టబడి ఉంది. కోటలో జైన్, గణేశ ఆలయాలు, జోగి మహల్, పడం తలావో, రాజ్ బాగ్ తలావో ఉన్నాయి. రంతాంబోరె టైగర్ రిజర్వ్ ను ఇక్కడి నుంచి చక్కగా చూడవచ్చు.

Ranthambore Fort

భారతదేశ సుసంపన్న చరిత్రకు, వీర పుత్రుల సాహసాలకు, జానపద కథలకు పుట్టిళ్ళుగా ఉండే ఈ కోటలను తప్పక చూడాల్సిందే. వాటిని చూడండి. చరిత్ర ను స్వయంగా అనుభూతి చెందండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here