ముంబైలో మిడ్ నైట్ సైక్లింగ్ గాధ

0
997

బయట ప్రపంచానికి కనిపించని ముంబైని చూడాలనుకుంటున్నారా? సముద్ర తీరం వెంబడి ప్రయాణించాలనుకుంటున్నారా, సముద్రం మీద నుంచి వీచే చల్లగాలికి మీ ముంగురులు ఎరిగిపడుతుంటే ఆస్వాదించాలనుకుంటున్నారా? అయితే మీరు తప్పకుండా మిడ్ నైట్ సైక్లింగ్ టూర్ కి వెళ్లాల్సిందే.

చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి
ముంబై వీధుల్లోని సంగతులు బయటపెట్టడానికి సాగే మీ అన్వేషణ యాత్ర మెరైన్ డ్రైవ్ నుంచి ప్రారంభమై కొలబా వద్ద ముగుస్తుంది. ఈ వారసత్వ యాత్ర గేట్ వే ఆఫ్ ఇండియా, నారీమన్ పాయింట్, హాజీ అలీ ఇత్తే అలీ వంటి ప్రముఖ సందర్శన ప్రాంతాలు మీదగా సాగుతుంది.
ముంబై నైట్ రైడర్స్

Midnight cycling
ఈ యాత్ర సాధారణంగా రాత్రి 11.30కి ప్రారంభమై మరుసటి రోజు తెల్లవారు జాము వరకు కొనసాగుతుంది. ఇది ప్రపంచ స్థాయిలో సైక్లింగ్ మీద జరుగుతున్న ప్రచారాన్ని ప్రోత్సహిస్తూ, గ్లోబ్ నలువైపుల నుంచి పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. ప్రతి రోజు అనేక గ్రూపులు ఈ మిడ్ నైట్ సైక్లింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. దీని కోసం రూ. 1,000 నుంచి 2,500 వరకు వసూలు చేస్తున్నారు. సైకిల్ రకం, మీరు ఎంచుకున్న యాత్ర మీద ఈ ధర ఆధారపడి ఉంటుంది. ఈ యాత్రలో ఎదురయ్యే సవాళ్లు అధిగమించడం ద్వారా మీరు బోలెడంత ఉత్సాహాన్ని పొందుతారు. ఇందులో పాల్గొనేవారు తీవ్రమైన శారీరక శ్రమకు సిద్ధంగా ఉండాలి. ఈ యాత్రలో భాగంగా రెండు వైపులా 25 కిలోమీటర్లకు పైగా సైకిల్ తొక్కాలి.
రైడర్లు నిర్ధిష్టమైన మందులు, శక్తినిచ్చే పానీయాలు, మంచినీరు వెంట ఉంచుకోవాలని, ధృడమైన స్పోర్ట్స్ షూ ధరించాలని ఇనస్ట్రక్టర్లు సూచిస్తారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే రైడ్ ప్రారంభమైన తర్వాత అందులో పాల్గొనేవారు వెనక్కి వెళ్లడానికి అవకాశం లేదు. ఇది కాస్త శ్రమతో కూడుకున్న వ్యవహారమే అయినా రాత్రి పూట నగర శోభను ప్రత్యక్షంగా తిలకించాలనుకునేవారికి గొప్ప అవకాశం. ముంబై యొక్క అసలైన ప్రాభవాన్ని తిలకించడానికి మనం ఈ చిన్న ఇబ్బందిని భరించలేమా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here