చెన్నై మెట్రో: ఇంకా లక్ష్యాన్ని చేరుకోలేదు

0
703

చెన్నై మెట్రో ఆరంభం నాటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. మెట్రో ఎంతో మెరుగ్గా నిర్వహించబడింది మరియు స్టేషన్స్ ఎంతో శుభ్రంగా కనిపిస్తాయి. దీనికి అందరూ ఎంతో ప్రాధాన్యతనిస్తారని భావించడమైంది కానీ ప్రస్తుత పరిస్థితి మాత్రం వేరొక పరిస్థితిని చూపిస్తోంది.

ఆశాజనకంగా ప్రారంభం

Chennai Metro Gates
ఆరంభంలో, చెన్నై మెట్రో కేవలం 7 స్టేషన్స్ కి మాత్రమే పరిమితమైంది కానీ ఎన్నో ప్రాంతాల్ని కవర్ చేయాలనేదే అసలు ప్రణాళిక. ఎయిర్-కండిషన్డ్ రైళ్లు, టోకెన్స్, స్మార్ట్ కార్డ్ లు చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. మెట్రో రైళ్లల్లో ప్రయాణించటమంటే చెన్నై ప్రజలకు ఒక ప్రత్యేకమైన అనుభవంగా మారింది.

ప్రోత్సాహం కరవు

Chennai Metro running

ఈ ఉత్సాహం త్వరలోనే తగ్గిపోయింది. ప్రజలు బస్సులు, స్థానిక రైళ్లు, ఎంఆర్ టిఎస్ లకు ప్రాధాన్యతనివ్వటంతో మెట్రో స్టేషన్స్ నిర్మానుష్యంగా తయారయ్యాయి. చెన్నై మెట్రోకి ప్రజలు ప్రాధాన్యతనివ్వకపోవటానికి రెండు ప్రధాన కారణాలుగా నిలిచాయి:

  • ఇతర ప్రజా రవాణాతో పోలిస్తే ఇది ఎక్కువ ఖర్చుతో కూడినది.
  • కేవలం ఏడు స్టేషన్స్ ని మాత్రమే కలుపుతుంది. సమగ్రమైన ప్రజా రవాణాగా పిలవటానికి ఈ పరిధి సరిపోదు.

వ్యయభరితమైన ప్రతిపాదన

Chennai Metro running
ఇతర ప్రత్యామ్నాయ రవాణా విధానాలు, చెన్నై మెట్రోకి మధ్య ఉన్న ధరల తేడా వల్లే ప్రజలు దీన్ని ప్రజా రవాణాగా ఆమోదించటం లేదు. బస్సులు, షేర్డ్ ఆటోలు ప్రయాణించటానికి సిద్ధంగా ఉంటున్నాయి.

పరిమితమైన పరిశోధన
ధరలు తగ్గినా కూడా, అన్ని ప్రాంతాల్ని కలిపే సదుపాయం లేకపోవటం కూడా మరొక సమస్య. మెట్రో తన సేవల్ని మరిన్ని మార్గాల్లో విస్తరించి, తక్కువ ధరలకే లభ్యమైతే, ఇది ఖచ్చితంగా ఒక విజేతగా మారుతుంది.

వైభవోపేతమైన సమయం

Chennai Metro & floods
2015లో చెన్నైలో వరదలు సంభవించినప్పుడు నదిపై ఉన్న మెట్రో ఎలివేటెడ్ ట్రాక్స్ సాఫీగా ప్రయాణించి నది ఒడ్డున ఉన్న ప్రజలకి సహాయపడటానికి ఉపయోగపడింది. గత ఏడాదిలో చెన్నై మెట్రో సాధించిన అతి పెద్ద విజయం ఇది.
ప్రయాణికులు ప్రాధాన్యతనిచ్చే రవాణా వ్యవస్థగా మారటానికి ముందు ఇది ఎంతో సాధించాల్సి ఉంది.

 

Originally written by Gomathi Shankar. Read here

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here