మన వారసత్వం మానవ జాతి యొక్క సంపదను పంచుకున్న వైనం. అలాంటి విలువైన ఆస్తులు మన ఉమ్మడి ప్రయత్నాలను కోరుకుంటున్నాయి. భారతదేశం ఇలాంటి సుసంపన్న వారసత్వాలను ఎన్నింటినో కలిగి ఉంది. గత సంస్కృతులు, వారసత్వ కట్టడాలతో మన సుసంపన్న అనుసంధానతకు తోడుగా, భారతదేశ వారసత్వ రైల్వే మన జాతి మరియు దాని చరిత్ర గురించి ఎన్నో విశేషాలను వెల్లడిస్తుంది. ఇవి మన దేశ గ్లామర్ కోషియెంట్ కు జోడించబడ్డాయి మరియు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి రైల్వే సమయం మరో సారి అలాంటి దృశ్యాలను పునర్ సృష్టించాలని కోరుకుంటున్నది.
భారతీయ రైల్వేకు చెందిన యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాలు రెండు ఉన్నాయి. అవేమిటంటే ఛత్రపతి శివాజీ టర్మినస్ మరియు మౌంటెన్ రైల్వేస్ ఆఫ్ ఇండియా. మౌంటెన్ రైల్వేస్ ఆఫ్ ఇండియా అనేది ఒక్కటి కాదు. దేశంలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న మూడు విభిన్న రైల్వే లైన్లు.
ఛత్రపతి శివాజీ టర్మినస్ – ఇది భారతీయ రైల్వేకు కేవలం ఐకానిక్ ల్యాండ్ మార్క్ మాత్రమే కాదు నగరంలో అత్యంత గుర్తింపు పొందిన కట్టడం కూడా. అద్భుతమైన ఆర్కిటెక్చరల్ చరిత్రతో ఇది 2004 జూలై 2న యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేరింది. ఆర్కిటెక్ట్ ఫ్రెడరిక్ స్టీవెన్స్ చే డిజైన్ చేయబడిన ఈ భవనం ఎన్నో స్థానిక ప్రభావాలకు లోనైంది మరియు దీని నిర్మాణానికి సుమారుగా 10 ఏళ్ళ సమయం పట్టింది. ప్రతీ నిమిషం వేల సంఖ్యలో ప్రయాణికులు ఇందులోకి వస్తూ పోతూ ఉంటారు. ఎంతో మంది ప్రముఖులు దీన్ని సందర్శించారు. ఎన్నో పాటలు, సినిమాలు ఇక్కడ చిత్రీకరించబడ్డాయి. 2008లో పెను విషాదానికి సాక్షీభూతంగా నిలిచిన ఈ 127 ఏళ్ళ ఛత్రపతి శివాజీ టర్మినస్ ఆర్కిటెక్చరల్ అద్భుతంగానే గాకుండా ముంబై నగరానికి ప్రతీకగా కూడా నిలుస్తోంది.
మౌంటెన్ రైల్వేస్
ది డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే – ది డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే (డిహెచ్ఆర్) ప్రపంచంలోని అతి పురాతన మౌంటెన్ రైల్వేస్ లో ఒకటి. అద్భుతమైన మరియు వినూత్న రైల్వే ఇంజినీరింగ్ ను కలిగిఉంది. హిమాలయ పర్వత పాదాలను 2000 మీటర్ల ఎత్తులో ఉన్న డార్జిలింగ్ పట్టణంతో కలుపుతుంది. బాలీవుడ్ మరుపురాని పాటలెన్నో ఇక్కడ చిత్రీకరించబడ్డాయి. ఈ టాయ్ ట్రైన్ భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. 1881లో ఈ రైలు తన కార్యకలాపాలు ప్రారంభించింది. సుందర పర్వత ప్రాంతాల్లో ప్రభావపూరిత రైలు అనుసంధానికి ఇది పరిష్కార మార్గం చూపింది. ప్రపంచపు మూడో అతిపెద్ద శిఖరమైన మౌంట్ కాంచన్ జంగ (8598 మీ.) తో సహా హిమాలయ మంచు శిఖరాలను చూసేందుకు వీలు కల్పించే ప్రయాణాన్ని ఇది జాయ్ రైడర్లకు అందిస్తొంది. 1999లో ఇది ప్రపంచ వారసత్వ ప్రాంతాల జాబితాలోకి చేరింది.
నీలగిరి మౌంటెన్ రైల్వే – బహుశా ఇది దేశంలో రాక్ అండ్ పినియన్ విధానంలో నిర్మించిన మొదటి మౌంటెన్ ర్వైల్వే కావచ్చు. 106 ఏళ్ళుగా ఇది ఇప్పటికీ తన సేవలను అందిస్తోంది. మెట్టుపాలాయం నుంచి ఉదకమండలం వరకు ఉన్న ఈ ర్వైల్వే లైన్ 1908లో ప్రారంభమైంది. నీలగిరి మౌంటెన్ రైల్వే లో ప్రయాణం వన్యప్రాణులతో పాటుగా చక్కటి మనోహర ప్రకృతి దృశ్యాలను చూసే అవకాశాన్ని అందిస్తుంది. ఈ టాయ్ ట్రైన్ 208 వంపులతో, 16 సొరంగాల గుండా, 250 వంతెనల మీదుగా మొత్తం 26 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. ఈ వారసత్వ ప్రయాణం ఎన్నో, హఠాత్ ట్విస్టులను, మలుపులను కలిగి ఉంటుంది!
కాల్క – షిమ్లా హిమాలయన్ ర్వైల్వే – ఆశ్చర్య చకితులను చేసే సుందర ప్రకృతి దృశ్యాలతో హిమాచల్ యొక్క పెద్ద పెద్ద పర్వతాలను, అడవులను దాటుకుంటూ ప్రఖ్యాతిగాంచిన కాల్క – షిమ్లా టాయ్ ట్రైన్ ప్రయాణం సాగుతుంది. 1903లో బ్రిటిషర్లచే నిర్మించబడిన ఈ రైలు మార్గం వారి వేసవి రాజధాని షిమ్లాను చేరుకునేందుకు తోడ్పడుతుంది. పర్వత ప్రాంతాల, పరిసర గ్రామాల మనోహర సీనరీలకు ఇదెంతగానో పేరొందింది. ఒకప్పుడు ఈ మార్గంలో 107 సొరంగాలు ఉండేవి. ఇప్పడు 102 మాత్రమే ఉన్నాయి. చివరి టన్నెల్ 103నెంబర్ ది ఈ పట్టణానికి ప్రఖ్యాత ల్యాండ్ మార్క్ గా ఉండింది. ఈ మార్గంలో అతి పొడవైన టన్నెల్ ఎన్నో కథలు, గాధలతో ముడిపడి ఉన్న బారోగ్ టన్నెల్.
– హెరిటేజ్ జాబితాలో లేకపోయినా – ఒక వారసత్వమే!
1. నెరల్ – మతెరన్ ర్వైల్వే – దట్టమైన చెట్లు, కలుషితం కాని గాలి మధ్య పర్వత పై భాగాన ఉన్న మతెరన్ కు రెండు గంటల పాటు టాయ్ ట్రైన్ లో సాగే ప్రయాణం ఎంతగానో ఆకట్టుకుంటుంది. నగరానికి ఇదో ప్రధాన ఆకర్షణ. ఆశ్చర్య చకితులను చేసే పర్వత సొరంగాల గుండా, దట్టమైన అడవుల మధ్య నుంచి ప్రయాణం సాగుతుంది. మతెరన్ మహారాష్ట్ర రాయగడ్ జిల్లా పశ్చిమ కనుమల్లో నెలకొన్న ఒక హిల్ స్టేషన్. దేశంలోని అతి చిన్న హిల్ స్టేషన్లలో ఇది కూడా ఒకటి.
2. కాంగ్రా వ్యాలీ ర్వైల్వే – కొన్ని రైలు ప్రయాణాలను జీవితంలో మరచిపోలేం. అలాంటి వాటిలో ఇది ఒకటి. ఈ మార్గానికి 87 ఏళ్ళ చరిత్ర ఉంది. ఈ రైలు ప్రయాణం పఠాన్ కోట్ నుంచి ప్రారంభమవుతుంది. హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా వ్యాలీలో 164 కి.మీ. దూరంలో ఉన్న జోగిందర్ నగర్ లో ముగుస్తుంది. భారత దేశంలో నిర్మించబడిన చివరి నేరో గేజ్ మార్గాల్లో ఒకటైన ఈ మార్గంలో రైలు దట్టమైన పైన్ అడవుల గుండా సాగుతుంది.