పోర్ట్‌ బ్లెయిర్‌, కథ మొదలయ్యే ప్రాంతం

0
44
Telugu Travel blog

అండమాన్ పర్యటనలో పోర్ట్‌బ్లెయిర్‌ మీ మొదటి గమ్యస్థానం. నన్ను నమ్మండి, ఇక్కడి బీచ్‌లను వాటి అందాలను చూసి మీరు ప్రేమలో పడిపోయినా, ఇది అండమాన్‌లోని దీవుల అందాల్లో సగం మాత్రమే. ఇక్కడి సెల్యులర్ జైలులో ప్రదర్శించే భారత స్వాతంత్ర్య సంగ్రామ ప్రదర్శనను తప్పకుండా చూడాలి – అనవసరమైన ఇబ్బందులు తప్పించుకోవడానికి మీ టికెట్‌ను ఆన్‌లైన్‌లో ముందుగానే బుక్‌ చేసుకోండి. పోర్ట్‌బ్లెయిర్‌లో రాజీవ్‌గాంధీ వాటర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ మరియు నార్త్ బే బీచ్‌లోని వాటర్ స్పోర్ట్స్‌ కూడా తప్పకుండా ఆస్వాదించాలి.

హావ్‌లాక్‌, కొత్త గోవా

Telugu Travel Blog

ఎంతో ప్రశాంతమైన, ఇప్పటికీ పెద్దగా తెలియని హావ్‌లాక్ దీవి నిదానంగానే అయినా క్రమంగా భారతీయులు మరియు విదేశీయు పర్యాటకులను ఆకర్శిస్తోంది. ఆసియాలోనే పరిశుభ్రమైన బీచ్‌ – రాధానగర్‌ బీచ్‌ను మీరు ఇక్కడ చూడొచ్చు. అంతులేని శుభ్రమైన ఇసుకతిన్నెలతో మరియు పారదర్శకంగా కనిపించే నీళ్లతో ఉండే రాధానగర్ బీచ్‌లో ఓ సాయంత్రం గడపితే తప్పకుండా మీరు ఉత్తేజభరితులవుతారు.

Radhanagar-Beach Havelock island

హావ్‌లాక్‌లోనే ఎలిఫెంట్‌ బీచ్‌, కాలాపత్తర్ బీచ్‌లు ఉన్నాయి. కాలాపత్తర్‌ బీచ్‌ ప్రశాంతమైన ఓ చిన్న గ్రామానికి సమీపంలో ఉంటుంది. ఇక్కడ పెద్దగా ఏమీ ఉండవు కాబట్టి, చాలామంది స్నోర్కెల్లింగ్ మరియు స్కూబా డైవింగ్‌ ఉండే ఎలిఫెంట్‌ బీచ్‌కే పరుగులు పెడతారు. హావ్‌లాక్ నా మెరుగైన ఎంపిక ఎందుకయ్యిందంటే, అక్కడ ఉండే స్నేహపూర్వకమైన స్థానికులు. మీరు మీ స్కూటీపై ఎక్కి అక్కడి పచ్చిక భూముల్లో, స్వచ్ఛమైన గాలిని మీ మొహాన మృదువుగా తాకుతుండగా హాయిగా తిరగవచ్చు. ఇవే హావ్‌లాక్‌ను మరో గోవాగా మార్చాయని చెప్పవచ్చు.

రాస్ దీవి, అచ్చంగా ఇంగ్లీష్‌ దీవి

Ross-Island

రాస్‌ దీవులకు ప్రయాణం నాటకీయంగా, అచ్చంగా ఫోటోలలో మనం చూసినట్లుగానే ఉంటుంది. నీలివర్ణపు ఆకాశంలో విసిరేసినట్లుండే మేఘాలు, ఒడ్డున తీరుగా నిలబడ్డ కొబ్బరి చెట్లతో, మీరు ఫోటోలు తీసుకోవడానికి ఫిల్టర్‌కూడా అవసరం లేనంత అందగా ఉంటుంది. ఇది ఫోటోలకు ఎంతో బాగా కనిపిస్తుంది. మీరు దీవిలో అడుగుపెట్టగానే మీకు వలస పాలన గుర్తుకువస్తుంది. కొత్తగా రంగులు వేసిన బంకర్‌ ఠీవిగా నిలబడి స్వాగతం పలుకుతుంది. దీవిలో మీరు తిరుగుతున్నంత సేపూ బ్రిటీష్‌ వారు తమ జీవితాన్ని పరిపూర్ణంగా గడపడానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చే వారే మీకు తెలుస్తుంది. బేకరీ, ఈత కొలను మరియు చర్చ్‌ యొక్క అవశేషాలు – గత కాలపు అందాలను మీకు చెబుతాయి.

బరత్‌నాగ్‌, సున్నపురాతి గుహ మరియు మడ అడవుల్లో నీటి పాయలు

Baratang

బరత్‌నాగ్‌ను సందర్శించడం హాయిగా ఉంటుంది. ఇక్కడి ప్రజలు తమ వ్యాపారాల్లో తీరిక లేకుండా, కొబ్బరి బొండాలు అమ్ముతూ, లేదా గ్రామంలో పర్యటనకు పిలుస్తూ కనిపిస్తారు. సాహసోపేతమైన స్పీడ్‌బోట్‌ రైడ్‌ మనల్ని సున్నపురాతి గుహలకు తీసుకెళ్తుంది. 30 నిమిషాలపాటు సాగే ఈ ప్రయాణంలో మడ అడవుల్లోని నీటి పాయల మీదుగా వెళ్లడం అద్భుతమమని చెప్పవచ్చు. చీకటిగా మరియు అందంగా ఉండే గుహలో నడుస్తుంటే మన అలసట పోయి తాజాదనం వచ్చేస్తుంది.

అంతులేని సాహసం

Sea-walking

అండమాన్‌కున్న మరో పేరే సాహసమని చెప్పొచ్చు. పోర్ట్‌బ్లెయిర్‌తో పాటు ఇతర దీవుల్లోనూ అంతులేని వాటర్‌ స్పోర్ట్స్‌ అందుబాటులో ఉన్నాయి. మీరేదైనా చెప్పండి, అక్కడ అది లభ్యమవుతుంది. తాబేళ్లతో ఈతకొట్టడం కావచ్చు, పగడాలను తాకడం కావచ్చు, చికాకుగా కనిపించే సముద్రపు పురుగులను పొడవడం కావచ్చు, లేదా సబ్‌మెరైన్‌ కిటికీలో నుంచి రంగురంగుల చేపలను చూడడం కావచ్చు – ఆకర్షణలకు ఇక్కడ అంతే ఉండదు. స్నోర్కెల్లింగ్‌ మరియు స్కూబా డైవింగ్‌ను శిక్షణ పొందిన మార్గదర్శకుల పర్యవేక్షణలో పోర్ట్‌బ్లెయిర్‌లోని జాల్లీ బాయ్‌లోనూ చేయొచ్చు. కాబట్టి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేముందు మీ పర్యటనను చివరిగా వాటర్‌స్పోర్ట్స్‌తో ముగించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here