కోయంబత్తూరు లో 6 చారిత్రక వారసత్వ హోటళ్ళు

0
635

తమిళనాడు యొక్క పాలనాపరమైన మరియు టెక్స్ టైల్ రాజధానిగా పేరొందిన కోయంబత్తూరులో వంటకాలు పర్యాటకులను నిరాశపరిచేవిగా ఉండవు. కోయంబత్తూరులో ఉండేవి అధికంగా చెయిన్ రెస్టారెంట్లే అయినప్పటికీ, ఎన్నో హెరిటేజ్ ఈటరీస్ కూడా ఇక్కడ తమదైన ముద్రను వేశాయి.

Geetha Cafe

గీతా కెఫె : కోయంబత్తూరు రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండే ఈ 80 ఏళ్ళ కెఫె బ్రేక్ ఫాస్ట్ ను ఆనందించేందుకు అత్యుత్తమ ప్రాంతం. ఇడ్లీ, వడ, పొంగల్, సాదా, రోస్ట్, మసాలా దోశ ఈ రెస్టారెంట్ లో సహేతుక రేట్లకే లభిస్తాయి. గీతా కెఫె లో తయారు చేసే వంటకాల్లో సోడా, పామ్ ఆయిల్, ఉల్లిపాయ లేదా అల్లం ఉపయోగించరు.

Adyar Ananda Bhavan

అడయార్ ఆనందభవన్ : దీని రసమలై కి ఈ స్వీట్ షాప్ ఎంతో పేరొందింది. ఇక్కడ అందించే చాట్స్ కూడా నోరూరించేలా ఉంటాయి. ఏటా ఈ షాప్ 12 మిలియన్ డాలర్ల విలువైన మిఠాయిలు విక్రయిస్తుంటుంది.

CS Meals Hotel

సిఎస్ మీల్స్ హోటల్ : ఇది ఒక బ్రాహ్మణ రెస్టారెంట్. సంప్రదాయక దక్షిణ భారతదేశ వంటకాలను 1939 నుంచి అందిస్తోంది. ఈ రెస్టారెంట్ లో లభించే ఫాస్ట్ ఫుడ్ కూడా బాగా ప్రజాదరణ పొందింది. ఈ రెస్టా రెంట్ పోలీస్ కమిషనర్ కార్యాలయం సమీపంలో ఉంది.

Kovai Biryani

కోవై బిర్యాని హోటల్ : 1985 లో ప్రారంభమైన ఈ రెస్టారెంట్ కికని స్కూల్ అండర్ బ్రిడ్జ్ వద్ద గాంధీపురం ప్రాంతంలోని రామ్ నగర్ లో ఉంది. ఇక్కడ లభించే చికెన్ లేదా మటన్ లేదా దమ్ బిర్యానీ ఎంతో పేరు పొందింది. కొంగు, హైదరాబాదీ, చెట్టినాడు మరియు దిండుగల్ బిర్యానీ లాంటి ఇతర వంటకాలు సైతం ఇక్కడ లభిస్తాయి. లివర్ ఫ్రై, నట్టు కొజి కర్రీ (నాటు కోడి కూర) వంటి వంటకాలు బాగా పేరొందాయి.

Sree Annapoorna Sree Gowrishankar Hotels

శ్రీ అన్నపూర్ణ శ్రీ గౌరీశంకర్ హోటల్ : ఇది 48 ఏళ్ళ నాటి దక్షిణ భారతదేశ రెస్టారెంట్ చెయిన్. కోయంబత్తూరు లో 16 ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ అందించే ఇడ్లీ, సాంబార్ వడ, మసాలా దోశ తిరుగులేని రుచితో ఉంటాయి. ఈ రెస్టారెంట్ లో బాగా ప్రసిద్ధి చెందింది డ్రాగన్ పనీర్. క్రిస్పీ పనీర్, నోరూరించే గ్రేవీ ఇందులో ఉంటాయి.

Andhra Ruchulu

ఆంధ్రా రుచులు: కోయంబత్తూరులో గణపతి వద్ద నెలకొని ఉన్న ఈ రెస్టారెంట్ అసలైన ఆంధ్రా భోజనానికి మాత్రమే గాకుండా గోంగూర చికెన్, నాటు కోడి ఫ్రై, మీన్పొలిచతు, మటన్ వేపుడు, ఫింగర్ ఫిష్, ఇతర రొయ్యల వంటకాలకు కూడా బాగా పేరొందాయి. ఇద్దరి భోజనానికి అయ్యే ఖర్చు రూ.600 వరకు ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here