2019 జనవరిలో అన్ని మార్గాలు ఉత్తర్ ప్రదేశ్ లో ప్రయాగ్ రాజ్ (అలహాబాద్)కి దారితీస్తాయి. ఈ పవిత్రమైన పట్టణంలో 2019 జనవరి 15-మార్చి 4 వరకు త్రివేణి సంగంలో నిర్వహించబడే కుంభ మేళాలో ఇది పండగ సమయం. కుంభ మేళాలో రద్దీ గురించి మనలో ప్రతీ ఒక్కరు చిన్నతనం నుండి వింటున్నాం. మీరు మీ దారి తప్పిపోయేంత రద్దీ ఉంటుంది. ఈ ఏడాది అలహాబాద్ ఆంధ్రా కుంభ మేళాని (ప్రతీ 6 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది) నిర్వహిస్తుంది. కాబట్టి లక్షలాది మంది హిందూ భక్తులు ఈ ప్రత్యేకమైన మేళాకి ప్రయాణం కావడాన్ని ఆశించవచ్చు. ప్రపంచపు అతి పెద్ద ఆధ్యాత్మిక యాత్రికుల సమూహంగా కుంభ మేళా రికార్డ్ నెలకొల్పింది. రాబోయే కుంభ మేళా ఈ సంప్రదాయాన్ని నిలబెడుతుందని ఆశించడమైంది. లక్షలాదిమంది భక్తుల సమూహం మాత్రమే కుంభ మేళాలో ఏకైక విలక్షణమని మీరు భావిస్తే, ఈక్రింద ఇచ్చిన వాస్తవాలతో మీరు ఆశ్చర్యానికి లోనవుతారు. మరి వాటిని చదవండి.
1. పురాణ గాథ
కుంభ అంటే అమృత పాత్ర అని అర్థం. సముద్ర మధనం సమయంలో, అమృతంతో నిండిన కుంభాన్ని దేవ,దానవులు గుర్తించారు. వారిరువురు దాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నించారు. బ్రహ్మ సలహా మేరకు అమృతం పాత్ర పుచ్చుకొని దేవతల్లో ఒకరు పరిగెత్తారు. దానవులు వెంటాడి కుంభం పుచ్చుకోవడానికి ప్రయత్నించారు. ఘర్షణ ఏర్పడింది మరియు అమృతం నాలుగు ప్రదేశాల్లో ఒలికింది: అలహాబాద్, ఇండోర్, నాసిక్ మరియు హరిద్వార్. ఈ నాలుగు నేడు కుంభ మేళాకు పవిత్రమైన స్థలాలుగా మారాయి.
దుర్వాస మహర్షి కోపంతో దేవుళ్లని శపించాడు. ఇది దేవుళ్ల శక్తిని బలహీనం చేసింది రాక్షసులు భూమి పై గందరగోళం సృష్టించడం ప్రారంభించారు. దీంతో అమరత్వానికి గాను అమృతాన్ని చిలకవల్సిందిగా బ్రహ్మ దేవదానవులకు సలహా ఇచ్చాడు. వారు అదే విధంగా చేసారు కానీ అమృతాన్ని దేవుళ్లే తమ వద్ద ఉంచుకుంటారని ఈ ప్రక్రియకు మధ్యలో దానవులు గ్రహించారు. దీంతో వారు దేముళ్లని 12 రోజులు వెంటాడారు మరియు ఈ సమయంలో అమృతం చుక్కలు నాలుగు ప్రదేశాల్లో ఒలికింది. ఈ అమృతం నదుల్ని అమృతంగా మార్చిందని అంటారు. ప్రయాగ్ రాజ్ లో గంగ,యమున, సరస్వతి పవిత్ర సంగమం అటువంటి స్థలాల్లో ఒకటిగా ఉంది.
2.మొదటి చారిత్రక వివరణ
కుంభ మేళా మొదటి చారిత్రక వివరాలు భారతదేశాన్ని హర్షవర్థనుడు రాజు పాలించిన సమయంలో సందర్శించిన ప్రముఖ చైనా యాత్రికుడు హ్యుయాన్ త్సాంగ్ గ్రంథాల్లో గుర్తించబడింది. హర్షవర్థన్ చక్రవర్తి నిర్వహించిన వందలాది భక్తులు ప్రయాగలో ఉన్న రెండు నదుల సంగమంలో పవిత్రమైన స్నానం చేసే ఆచారం గురించి హ్యుయాన్ త్సాంగ్ తన గ్రంథంలో రాసారు.
3. మీరు కుంభలో ఎప్పుడు ఉండాలి
పవిత్రమైన నదుల నీరు అమృతంగా మారే సమయంలో కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో కుంభ మేళా జరుగుతుంది. కాబట్టి కుంభ మేళా (అర్థ లేదా మహా కుంభ మేళా) తేదీల్ని నిర్ణయించడానికి ముందు సూర్య,చంద్రులు,గురు గ్రహాల స్థానాల్ని అంచనా వేస్తారు. సాధారణంగా కుంభ మేళా మాఘ మాసంలో గ్రహాలు పరిపూర్ణమైన స్థానంలో ఉన్నప్పుడు అలహాబాద్ లో జరుగుతుంది. ఈ సమయంలో నదిలో చేసే పవిత్రమైన స్నానం భక్తుల దోషాల్ని తొలగిస్తుందని భావిస్తారు. ఈ ఏడాది అత్యంత పవిత్రమైన తేదీలు జనవరి 14,27, ఫిబ్రవరి 6,15,17,21,25.
4. బాధ కంటే నమ్మకానికి ప్రాధాన్యత
నదులు గడ్డకట్టే సమయంలో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో శీతాకాలంలోనే కుంభ మేళా జరుగుతుంది. తెల్లవారుజామున నదుల్లో మునక వేయడానికి ఎంతో ఆత్మవిశ్వాసం ఉండాలి. లక్షలాదిమంది భక్తులు ఈ బాధని ఓర్చుకుని ఎంతో నమ్మకంతో స్నానాలు చేస్తారు. మొదటి స్నానం మకర సంక్రాంతి రోజున, చివరిది 2019 (వచ్చే నెల పౌర్ణమి రోజు) మార్చి 4న జరుగుతుంది. స్నానాల తేదీల మధ్య పౌర్ణమి రోజులు , చంద్రుడు కనిపించని రోజులు, వసంత పంచమి ఉన్నాయి.
5: నాగ సాధువులు చేరుకునే సమయం
కుంభ మేళా మీకు జీవితంలో అన్ని విలాసాలు, ఆనందాలు, భౌతిక విషయాల్ని విసర్జించిన నాగ సాధువుల్ని చూసే ఉత్తమమైన అవకాశం ఇస్తుంది. వారు శివుడికి పరమ భక్తులు. కుంభ మేళా సమయంలో మినహా ఎన్నడూ బయట కనిపించరు. ఈ పండుగ సమయంలో వారు అలహాబాద్ కు మరియు ఇతర కుంభ మేళా ప్రదేశాలకు గుంపులుగా చేరుతారు. ఆయుధాలతో (కర్రలు, కత్తులు వంటివి) తమ యుద్ధ నైపుణ్యాల్ని ప్రదర్శిస్తారు. తమకి బాధ కలిగించుకోవడం వారికి మంచి కాలక్షేపం. మీకు ఆసక్తి ఉంటే వారి సిద్ధాంతాలు, అభిప్రాయాలు మరియు దార్శనికతల్ని గురించి అడగవచ్చు, వారు ఎంతో ఆనందంగా వాటి గురించి మీకు చర్చిస్తారు. అటువంటి శాఖల్లో కల్పవాసీలు (రోజుకు మూడుసార్లు స్నానం చేసేవారు) మరియు ఊర్థ్వవహుర్స్ (శరీరాన్ని వివిధ కాఠిన్యాలకు గురి చేయడంలో నమ్మకం గలవారు)
6. అతి పెద్ద సమూహం
లోగడ జరిగిన రికార్డ్స్ బద్దలవుతాయని కుంభ మేళా జరిగిన ప్రతీసారి భావిస్తారు. ఇంతకు ముందు చెప్పినట్లు ఈ మేళా భూమి పై జరిగే అతి పెద్ద శాంతియుతమైన మనుష్యుల సమూహం. 2013లో అలహాబాద్ లో జరిగిన మేళాలో అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరై రికార్డ్ నెలకొల్పింది. 2013లో జరిగిన కుంభ మేళా సంభ్రమం కలిగించే విధంగా 120 మిలియన్ ల భక్తులు హాజరయ్యారు. అలహాబాద్ తన రికార్డ్ ని ఈ ఏడాది మరింత అధిగమిస్తుందా? కేవలం కాలమే సమాధానం చెబుతుంది.
7. విలక్షణమైన హనుమాన్ ఆలయం చూసే అవకాశం
అలహాబాద్ లో జరిగే కుంభ మేళాకు ఉన్న ఆకర్షణల్లో హనుమాన్ ఆలయాన్ని చూసే అవకాశం ఒకటి. ఇది ఒక విలక్షణమైన ఆలయం. సంవత్సరంలో చాలా సమయం గంగా నది క్రింద మునిగి ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం, హనుమంతుని పాదాలు తాకడానికి గంగా నది తన నీటి స్థాయిని పెంచడం వల్ల ఆలయం నీటిలో మునిగింది. కానీ కుంభ మేళా సమయంలో ఆలయం నీటి నుండి బయటకు వస్తుంది. ఆనుకుని ఉన్న భంగిమలో హనుమంతుడి భారీ విగ్రహాన్ని ఈ విలక్షణమైన ఆలయం లోపల చూడవచ్చు.
8. డబ్బుతో భారీ వ్యవహారం
నిరుద్యోగం ఇప్పటికీ సమస్యగా ఉన్న దేశంలో కుంభ మేళా చాలామంది ప్రజలకు తాత్కాలికంగా సంపాదనకు మార్గం కలిగిస్తోంది. 2013లో జరిగిన కుంభ మేళాలో ఒక అంచనా ప్రకారం సుమారు 65,000 ఉద్యోగాలు కల్పించబడ్డాయి మరియు రూ. 12,000 కోట్ల ఆదాయం సంపాదించబడింది. ఇది చాలామందికి ఆనందకరమైన వార్త.
మీరు ఈ విలక్షణమైన ఆధ్మాత్మిక కార్యక్రమానికి హాజరవడానికి ప్రణాళిక చేస్తున్నారా? బాగుంది, ఇబ్బందులు లేని యాత్ర కోసం మీరు ప్రణాళిక చేయడంలో సహాయపడటానికి రైల్ యాత్రికి అన్ని సేవలు ఉన్నాయి. మా సేవల్ని చూడండి.