ఉత్తర బెంగాల్‌లో వర్షాకాలంలో చూడాల్సిన ప్రధానమైన ఆకర్షణీయ ప్రాంతాలు

0
1040

ఉత్తర బెంగాల్‌లో వర్షాకాలంలో తరచూ కొండచెరియలు విరిగి పడుతుంటాయి. కాబట్టి, వర్షాకాలంలో ఈ ప్రాంతాల్లో పర్యటించాలని ఎవరూ అనుకోరు. అయినప్పటికీ, రుతుపవనాల సమయంలో ఈ ప్రాంతాన్ని గనక మీరు దర్శిస్తే, ఈ ప్రాంతంతో తప్పక ప్రేమలో పడిపోతారు! రుతుపవనాల సమయంలో ఉత్తర బెంగాల్‌లో పర్యటించడానికి ప్రణాళిక వేసుకోండి మరియు ఈ ప్రాంతాలను తప్పక దర్శించండి:

Coronation Bridge

కొరొనేషన్ వంతెన : తీస్తా నదిపై ఉన్న ఈ వంతెన మీ చూపులను కట్టి పడేస్తుంది. వర్షాకాలంలో ఈ నది భారీ వరదతో ప్రవహిస్తుంది మరియు లోతు లేని చోట కూడా నీటి ప్రవాహం చాలా వేగంగా ఉంటుంది. ఈ వంతెనపై నుంచి ఈ నది అందాలను చూసి మీరు ప్రశంసిస్తారు. మరియు పక్కనే ఉన్న సేవకేశ్వరి ఆలయాన్ని తప్పక దర్శించండి.

Gajol Doba
గజోల్‌దోబ: ఇది తీస్తా బ్యారేజ్‌కు సమీపంలో ఉంది. తీస్తా నీటిని బ్యారేజ్ మళ్లించే ప్రాంతం (బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించడానికి ముందు) వర్షాకాలంలో చూడాల్సిన మరే అందమైన ప్రాంతం. కాలువల వైపు వెళ్లడం కూడా చాలా బాగుటుంది; కాలువకు మరో వైపు అడవి ఉంటుంది మీరు గనక అదృష్టవంతులైతే, కొన్ని వన్యప్రాణులు కూడా మీకు కనిపించవచ్చు.

Sunteylakhola
సమ్సింగ్ / సుంతలేఖోలా: సమ్సింగ్ లేదా సుంతలేఖోలాకు వర్షాకాలంలో వెళ్లితే అద్భుతమైన ప్రకృతి రమణీయతను చూసే అవకాశం ఉంటుంది. కానీ, మీరు వెళ్లేముందు అక్కడి వాతావరణం గురించి తెలుసుకోండి. కొండపై నుంచి దిగి రైలు ఎక్కే ముందు మీ చేతిలో ఓ రోజు అదనంగా ఉండేలా చూసుకోండి (ఎందుకంటే భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది)

Dudhia
దుధియా: మిరిక్‌-డార్జిలింగ్‌ రోడ్‌ మీదుగా డార్జిలింగ్‌కు వెళ్లే దారిలో, బలసోన్ నది పక్కన ఏర్పాటైన సైన్యం ఫైరింగ్ రేంజ్‌ దుధియా. నది ఒడ్డున ఉన్న రాళ్లపై కూర్చుని చుట్టూ ఉన్న కొండల అందాలను ఆస్వాదించవచ్చు లేదా దగ్గరలోఉన్న గోకుల్ వేసైడ్ ఇన్‌కు వెళ్లి ఓ టీ తాగవచ్చు.

చేరుకోవడం ఎలా?

Teesta river
దగ్గరలోని రైల్వే స్టేషన్ – న్యూ జలపాయ్‌గురి. ట్యాక్సీ లేదా షేర్ క్యాబ్‌లోనూ వెళ్లొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here