రైలు కిటికీ లో నుంచే వన్యప్రాణులను చూసే అవకాశం

0
949

మీరు కిటికీ పక్కన కూర్చున్నపుడు, బయట కొద్ది దూరంలో ఒక ఏనుగు కనిపిస్తే ఎలా ఉంటుంది? వన్యప్రాణి ప్రేమికులకెవరికైనా అది ఒక కల లాంటిదే. మీరు గనుక కొన్ని మార్గాల్లో ప్రయాణిస్తుంటే ఈ కల నిజం అయ్యే అవకాశం ఉంటుంది. వన్యప్రాణులను చూసేందుకు అవకాశం ఉండే కొన్ని ప్రయాణ మార్గాలివి.

దోరస్ వోయేజ్, పశ్చిమ బెంగాల్

Siliguri Alipurduar route

ఈ మనోహర మార్గంలో రకరకాల చెట్లు, జంతువులను చూడవచ్చు. సిలిగురి నుంచి అలీపూర్ దౌర్ కు చేసే 3 నుంచి 4 గంటల ప్రయాణం ఇందుకు వీలు కల్పిస్తుంది. ఈ రైలు మహానంద వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, బుక్సా టైగర్ రిజర్వ్, చప్రామరి అడవి అనే మూడు పెద్ద వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల గుండా ప్రయాణిస్తుంది. రైలు అటవీ ప్రాంతంలోకి ప్రవేశించగానే, ఏనుగులు, జింకలు, కోతులు, పక్షులను చూసే అవకాశం లభిస్తుంది. మీరు గనుక అదృష్టవంతులైతే, మీ కిటికీ లోనుంచి చిరుతను కూడా చూడవచ్చు.

మార్గం: సిలిగురి నుంచి అలీపూర్ దౌర్

టికెట్ : రూ.140

కర్నాటకలో….వన్యప్రాణులను దగ్గరగా…

Hospet Tinaighat route

సౌత్ వెస్ట్రన్ రైల్వే లో టినాయ్ ఘాట్ లో దార్వాడ్, బెలగావి, ఉత్తర కన్నడ జిల్లాల్లో హోస్పేట్ మీదుగా ప్రయాణిస్తుంటే, మీరు భీమ్ గడ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మీదుగా వెళ్తారు. అరుదైన చెట్లను, జంతువులను ఈ మార్గంలో చూడవచ్చు. పట్టాల పక్కనే అడవి బర్రెలు, ఏనుగులు కనిపిస్తాయి. అటవీ ప్రాంతాల్లో రైలు చప్పుడుతో సమ్మిళితమయ్యే పక్షుల ధ్వనులను వినవచ్చు.

మార్గం: హోస్పేట్ – టినాయ్ ఘాట్

టికెట్ : రూ.140

ఎలిఫెంట్ ట్రయల్ , ఉత్తరాఖండ్

Chilla - Motichur

ప్రకృతి వర ప్రసాదం ఉత్తరాఖండ్. ఎత్తయిన కొండలు, చుట్టుపక్కల అంతా పచ్చదనంతో ఇది పర్యాటకులకు వారు కలలు గనే గమ్యస్థానం. ఈ అందమైన రాష్ట్రంలో వన్యప్రాణులకు నెలవైన ప్రాంతాలెన్నో ఉన్నాయి. మీరు గనుక చిల్లా-మోతిచుర్ మార్గంలో గనుక ప్రయాణిస్తుంటే, వాటి సహజ పరిసరాల్లో అటవీ ప్రాణులను చూసేందుకు మీరు రైలు దిగాల్సిన అవసరం కూడా లేదు. రైలు డెహ్రాడున్ – సుభాష్ నగర్, రుషికేశ్ – బీబీవాలా –నంబర్దర్ ఫామ్ – హరిద్వార్ – మోతిచూర్లకు రాజాజీ నేషనల్ పార్క్ దట్టమైన అడవుల గుండా వెళ్తుంది. పట్టాల వెంట ఇక్కడ ఏనుగులను చూడవచ్చు. చిరుతలను కూడా చూసినట్లు కొందరు ప్రయాణికులు చెబుతారు.

మార్గం : చిల్లా – మోతిచూర్

టికెట్ : రూ.140-175

మృగరాజును చూడాలనుకుంటే…గుజరాత్

Sasan Gir lion

మీరు గనుక వెరావల్ నుంచి ససాన్ గిర్ కు ప్రయాణిస్తుంటే, సాయంకాలపు వేళల్లో మృగరాజును చూసే అవకాశం కలగవచ్చు. ససాన్ గిర్ – చిత్రవాడ్ ల మధ్య 14 కి.మీ. ప్రాంతంలో సింహాలు తరచుగా కనిపిస్తాయి. ఈ ప్రాంతం అంతా కూడా ఆసియాటిక్ సింహాలు ఉండే గిర్ నేషనల్ పార్క్ లో భాగం. ఇలాంటి అవకాశాలను మీరు చేజార్చుకోగలరా ?

మార్గం : ససాన్ గిర్ – చిత్రవాడ్

టికెట్ : రూ.100

ఈ మార్గాల గురించి తెలుసుకున్నారు కదా..మరి ఈ మార్గాల్లో ఎప్పుడు ప్రయాణిస్తారు?

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here