చెన్నైలో తప్పకుండా చూడాల్సిన బ్రిటీష్ కాలం నాటి 5 అందాలు

0
1180

చెన్నైలో చాలా వలసపాలకుల భవనాలు, గుర్తులు ఉన్నాయి. మీరు వాస్తుశిల్పం మరియు చరిత్రను తెలుసుకోవాలంటే, చెన్నై ఈ ప్రాంతాల ద్వారా మీకు ఘన స్వాగతం పలుకుతోంది.
ప్రభుత్వ మ్యూజియం, ఎగ్మోర్‌

Government Museum

ఇది భారతదేశంలోనే రెండో పురాతమైన మ్యూజియం, 6 భవంతులు, 46 గ్యాలరీలతో ఈ మ్యూజియం ఉంటుంది. భూగర్భ శాస్త్రం, పురావస్తు శాస్త్రం, జంతు శాస్త్రం, మానవ శాస్త్రం, నాణాల సేకరణ శాస్త్రం, వృక్షశాస్త్రం మరియు శిల్పశాస్త్ర్రాలకు చెందిన విషయాలను ఇక్కడ చూడొచ్చు.

పర్యాటకులకు సూచనలు
తెరిచే సమయం – ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 వరకు ( శుక్రవారం, జాతీయ సెలవు దినాలు మినహా)
ప్రవేశ రుసుం – భారతీయులకు రూ. 15 మరియు విదేశీయులకు 5 అమెరికన్ డాలర్లు
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకూ ఉచిత గైడ్ అందుబాటులో ఉంటారు
దగ్గరలోని రైల్వే స్టేషన్ : చెన్నైఎగ్మోర్ (500 మీ దూరం)

శాన్‌ థోమ్ బసిలికా

San Thome Basilica

16వ శతాబ్ధంలో సెయింట్ థామస్‌ సమాధిపై నిర్మించబడ్డ ఈ కట్టడాన్ని 1893లో బ్రిటీష్ పాలకులు నూతన -గోథిక్ సంప్రదాయంలో పునర్ నిర్మించారు, శాన్ థోమ్ బసిలికా యాత్రికులకు చారిత్రక ఆధ్యాత్మిక అనుభవాన్ని కలిగిస్తుంది.

పర్యాటకులకు సూచనలు
తెరిచే సమయం – ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు
ప్రవేశ రుసుం లేదు
దగ్గరలోని మెట్రో స్టేషన్ : తిరుమయిలై ఎంఆర్‌టీఎస్ స్టేషన్ (1.4 కి.మీ దూరం)

సెయింట్ జార్జ్‌ కోట

Fort St George

మద్రాస్ ప్రావిన్స్‌ను బ్రిటీష్ వారు ఈ భవనం నుంచే పాలించారు, ప్రస్తుతం ఈ భవనంలో తమిళనాడు శాసనసభ కొనసాగుతోంది. 1644 నుంచి ఈ భవనం నుంచే శతాబ్ధాల పాటు బ్రిటీష్ పాలన సాగింది మరియు తమిళనాడులోని అత్యంత ముఖ్యమైన భవనాల్లో ఇది కూడా ఒకటి.

పర్యాటకులకు సూచనలు
తెరిచే సమయం – ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ( శుక్రవారం, జాతీయ సెలవు దినాలు మినహా)
కోటలోపలే కోటమ్యూజియం ఉంటుంది. ఇతర ప్రాంతాల్లోకి పర్యాటకులకు అనుమతి లేదు
దగ్గరలోని రైల్వే స్టేషన్ : చెన్నైఫోర్ట్‌ (2 కి.మీ దూరం)

రిప్పన్ భవనం

Ripon Building

ప్రస్తుత చెన్నై నగర పాలక సంస్థ పరిపాలనా భవనం. ఈ భవనం పూర్తిగా తెల్లగా, నూతన-శాస్త్రీయ నిర్మాణ శైలిలో ఉంటుంది. ఇది గోథిక్, ఐయోనిక్ మరియు కోరింథియన్ శైలిల మిశ్రమ నిర్మాణం.

పర్యాటకులకు సూచనలు
ఇది ప్రభుత్వ కార్యాలయం కాబట్టి పర్యాటకులకు ప్రవేశం లేదు
దగ్గరలోని మెట్రో స్టేషన్ : చెన్నై సెంట్రల్‌ (1 కి.మీ దూరం)

చెన్నై సెంట్రల్‌

Chennai Central

ఇది భారత దేశంలోనే అత్యంత ముఖ్యమైన రైల్వే జంక్షన్ మరియు బ్రిటీష్ వాస్తు నిర్మాణాలకు అద్భుతమైన సాక్ష్యం. 142 ఏళ్ల చరిత్రగల ఈ భవనాన్ని ఆర్కిటెక్ట్ జార్గ్ హార్డింగ్ డిజైన్ చేశారు.

పర్యాటకులకు సూచనలు
పర్యాటక ప్రాంతం కాదు కాని చెన్నైలోని అత్యంత ముఖ్యమైన కట్టడాల్లో ఒకటి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here