కేరళలోని వాయునాడ్ ప్రాంతం వైల్డ్ లైఫ్ సఫారీని ఆస్వాధించడానికి అత్యుత్తమ ప్రాంతం. జంతువుల్ని చూడటానికి ఉదయం పూట అనుకూలమైన సమయం. ఉదయం పూట సఫారీ పొందేందుకు ప్రయత్నించి, 8గంటలలోపు అడవికి చేరుకోవాలి. జంతువులు ఉదయం పూటే షికారుకు వస్తాయి. ఈ క్రింది జాబితాలోని ప్రాంతాల్లో మీకు పులుల్ని చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
థోలుపెట్టి
థోలుపట్టీ అభయారణ్య ప్రాంతాన్ని ఎగువ వాయునాడ్ అటవీప్రాంతంగా పిలుస్తారు. ఈ ప్రాంతం ఏనుగులు, పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు వేటకుక్కులు, అడవి దున్నలు, కోతులు, జింకలు, అడవి ఉడుతలు వంటి ఎన్నో జీవులకు ఆవాసం. థోలుపెట్టిలో ప్రధాన ఆకర్షణ ఏనుగులు, అడవి దున్నలు, పులులు. జుట్టుతో ఉండే అడవి దున్నల్ని మీరు థోలిపెట్టిలో కచ్చితంగా చూడగలరు. ఒకవేళల ఉదయం 8 గంటల కంటేట ముంద అడవికి చేరుకుంటే ఏనుగులు కూడా కనిపిస్తాయి. అదృష్టం కలిసొస్తే పులుల్ని కూడా చూడగలరు. ఏదైనా కేటాయించిన సమయంలో కేవలం 10 వాహనాలు (జీపులు, రిజిస్టర్డ్ డ్రైవర్లు మాత్రమే నడపాలి) మాత్రమే అడవిలోకి అనుమతిస్తారు.
సఫారీ సమయం: 6 ఏఎం – 8ఏఎం (ఉదయం), 3 పీఎం – 5.30 పీఎం(సాయంత్రం)
తప్పనిసరిగా చూడగలిగేవి: అడవి దున్నలు
గమనిక: భద్రతా కారణాల రీత్యా వ్యక్తిగత వాహనాలను అడవిలోకి అనుమతించరు
సమీప రైల్వే స్టేషన్: తలశేరి (60 కి.మీ. దూరం)
మాతుంగ
థోలుపట్టీకి అవతలవైపు ఉంటుంది ఈ మాతుంగ అభయారణ్యం. దీనిని దిగువ వాయునాడు అటవీ ప్రాంతం అంటారు. మీరు చూసే వాయునాడు ప్రాంతం ఏనుగుల ఫొటోలలో ఎక్కువ భాగం మాతుంగ దగ్గర తీసినవే అవుతాయి. కేరళ, కర్ణాటక చెక్ పోస్టు వద్ద ఒక పెద్ద సరస్సు ఉంటుంది. అక్కడ ఉదయం, సాయంత్రం వేళల్లో ఏనుగుల మందలు నీళ్లు తాగుతూ ఉత్సాహంగా కనిపిస్తాయి. కోతులు, చుక్కల జింకలు, నెమళ్లు కూడ ఇక్కడ కనిపిస్తున్నాయి.
సఫారీ సమయం: 6 ఏఎం – 9 ఏఎం (ఉదయం), 3 పీఎం – 6 పీఎం(సాయంత్రం)
తప్పనిసరిగా చూడతగ్గవి: ఏనుగులు (తటాకం సమీపంలో)
సమీప రైల్వే స్టేషన్: కోజీకోడ్ (31 కి.మీ. దూరం)
తిరునెల్లి
కేరళలో అతిపురాతన ఆలయాలు ఉన్న ప్రాంతాల్లో తిరునెల్లి ఒకటి, ఆ విధంగా ఆ ప్రాంతం సుప్రసిద్ధి చెందింది. ఒకవేళ మీకు ట్రెక్కింగ్ ఇష్టమైతే, తిరునెల్లి ఆలయానికి పక్షి పాతాళం అడవి గుండా నడుచుకుని వెళ్లవచ్చు, పెద్ద సంఖ్యలో పక్షులు, జంతువులు ఇక్కడ చూడొచ్చు.
సఫారీ సమయం: 7– 9ఏఎం (ఉదయం), 3 – 5 పీఎం(సాయంత్రం)
గమనిక: ఈ అడవి గుండా ప్రయాణించాలంటే ముందుగా అటవీ శాఖ అనుమతులు తీసుకోవాలి; ట్రైబుల్ గైడ్ సాయం కోరాలి. వాయునాడ్, తిరునెల్లి దారిలో ఒంటరిగా ఉండే ఏనుగుల్ని చూడొచ్చు. తప్పిపోయిన ఏనుగులు తిరునెల్లి ఆలయం సమీపంలోని అడవిలో ఉన్న ఆశ్రమంలో రక్షణ పొందుతాయి.
గమనిక: ఈ అడవి గుండా ప్రయాణించాలంటే ముందుగా అటవీ శాఖ అనుమతులు తీసుకోవాలి; ట్రైబుల్ గైడ్ సాయం కోరాలి. వాయునాడ్, తిరునెల్లి దారిలో ఒంటరిగా ఉండే ఏనుగుల్ని చూడొచ్చు. తప్పిపోయిన ఏనుగులు తిరునెల్లి ఆలయం సమీపంలోని అడవిలో ఉన్న ఆశ్రమంలో రక్షణ పొందుతాయి.
సమీప రైల్వే స్టేషన్: కోజీకోడ్ (332 కి.మీ. దూరం)
చూడదగిన ఇతరర అభయారణ్యాలు
నాగర్ హోల్, ముత్తుమంగల
బాండీపూర్