ఒడిషా లోని వన్య ప్రాణి కేంద్రాలు

0
932

ఒడిషా ఎప్పుడూ మరుగున పడిన ప్రకృతి సౌందర్యానికి ఆలవాలంగా ఉంటూ వచ్చింది. ప్రకృతి ఆరాధకులకు అది స్వర్గధామం. ఈ వేసవి సెలవులలో వెళ్ళేందుకు తక్కువగా ప్రాచుర్యంలో ఉన్న కొన్ని అందమైన వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల జాబితా ఇది.

Wildlife destinations of Odisha

  • సత్కోసియా గార్జ్ శాంచురీ : అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్న మొక్కలు, జంతువులు పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నరెండు రకాల మొసళ్ళు – ముగ్గర్ మరియు గరియాల్ –ఇక్కడ ఉన్నాయి. అవేగాకుండా ఏనుగులు, చిరుతలు, హార్న్ బిల్స్, ఎలుగుబంట్లను కూడా ఇక్కడ చూడవచ్చు.

Wildlife destinations of Odisha

  • బితర్ కనిక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం: భారతదేశ రెండో అతిపెద్ద మడ అడవిలో ఇది భాగం. తరచూ దీన్ని క్రొకడైల్ కంట్రీ అని కూడా అంటుంటారు. సాల్ట్ వేర్ క్రొకడైల్, తెల్ల మొసళ్ళు మొదలుకొని నాగుపాములు, కొండచిలువల వరకు పలు రకాల వన్యప్రాణులను ఇక్కడ చూడవచ్చు.

Wildlife destinations of Odisha

  • సిమ్లిపాల్ నేషనల్ పార్క్: 2009 కూడా యునెస్కో వరల్డ్ నెట్ వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్ లో భాగమైన సిమ్లిపాల్ నేషనల్ పార్క్ ప్రకృతి కలలరాజ్యం. తప్పక చూడాల్సిన ప్రాంతం. రాయల్ బెంగాల్ టైగర్, ఏనుగులు, చిరుతలు, సాంబార్, బార్కింగ్ డీర్, నెమళ్ళు లాంటి వాటిని ఇక్కడ చూడవచ్చు.

Wildlife destinations of Odisha

  • గహిర్ మాత మెరైన్ శాంచురీ: ఒడిషా లోని ఏకైక మెరైన్ శాంచురీ ఇది. ఆలివర్ రైడ్లీ తాబేళ్ళు అత్యధిక సంఖ్యలో గుడ్లు పెట్టే ప్రాంతం. గహిర్ మాత తీరంలో గుడ్లు పెట్టేందుకు ఈ తాబేళ్ళు పసిఫిక్ మహా సముద్రం నుంచి ఎంతో దూరం ప్రయాణించి వస్తాయి.

Wildlife destinations of Odisha

  • డెబ్రిగఢ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం: ఇక్కడి చారిత్రక వన్య ప్రాణి సంరక్షణ కేంద్రాలలో ఒకటిగా దీన్ని పరిగణిస్తారు. రాష్ట్ర ప్రఖ్యాత స్వాతంత్ర్య సమర యోధుడు ఒకరు ఇక్కడి దట్టమైన అడవుల్లో ఆశ్రయం తీసుకున్నట్లుగా విశ్వసిస్తారు. పులులు, చిరుతలు, హైనాలు, కుందేళ్ళను ఇక్కడ చూడవచ్చు. అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్న నాలుగు కొమ్ముల జింకలను కూడా చూడవచ్చు.

మరింకా ఆలస్యం ఎందుకు? మీ బ్యాగ్ ప్యాక్ చేసుకోండి. ప్రకృతి అన్వేషణకు బయలుదేరండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here