వేళ్ళను నాకేలా చేసే కోల్ కతా లోని ఆరు చారిత్రక భోజనశాలలు

0
634

సిటీ ఆఫ్ జాయ్ గా పేరొందిన కోల్ కతాను సిటీ ఆఫ్ ఫుడ్ గా కూడా చెప్పవచ్చు. విలక్షణమైన మరియు రుచికరమైన నోరూరించే తినుబండారాలు రుచుల ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. మీరు కోల్ కతాను సందర్శిస్తున్నారా లేదా అక్కడికి వెళ్ళేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా? అక్కడ మీరు తప్పక సందర్శించాల్సిన కొన్నింటిని మీకు పరిచయం చేస్తాం.

blog-post-for_-heritage-eateries-in-kolkata_5

పుటిరామ్ లో బ్రేక్ ఫాస్ట్ : కాలేజ్ స్రీట్ (సూర్య స్ట్రీట్ ) సమీపంలో లో సుమారు 150 ఏళ్ళ చరత్ర కలిగిన ఈ స్వీట్ షాప్ కచౌరి, పొటాటో కర్రీ, చోలార్ దాల్ వంటి సంప్రదాయక బెంగాలీ బ్రేక్ ఫాస్ట్ లకు పేరొందింది. ఉదయం పూట 9 గంటల లోపే అయిపోయే జిలేబీ ఇక్కడ తప్పక రుచి చూడాల్సిన వాటిలో ఒకటి. ఎంజి రోడ్ మెట్రో స్టేషన్ నుంచి కొద్ది దూరంలోనే ఇది ఉంటుంది.

blog-post-for_-heritage-eateries-in-kolkata-_4

పారామౌంట్ షర్బత్స్ : కాలేజ్ స్క్వేర్ కు ఎదురుగా, 1918 లో స్థాపించబడిన పారామౌంట్ నోరూరించే పానీయాలకు పెట్టింది పేరు. ఏళ్ళుగా ఎంతోమంది రాజకీయ నాయకులు, స్వాతంత్ర్య సమరయోధులు, బంగారు శకం నాటి సినీతారలు, ఇంకా మరెంతో మంది ప్రముఖులు పారామౌంట్ ను సందర్శించారు. కోక-మలై, దబ్-షర్బత్, మ్యాంగో మలై, రోజ్ సిరప్, టామరిండ్ సిరప్ వంటి పానీయాలు బాగా పేరొందాయి.

యంగ్ బెంగాల్ హోటల్ లో బెంగాలీ లంచ్ : 87 ఏళ్ళ నాటి ఈ పాతతరపు హోటల్ సంప్రదాయక బెంగాలీ ఆహారాన్ని అందిస్తుంది. కిద్దర్ పూర్ లో నెలకొన్న ఈ హోటల్ లో అన్నం, చేపకూరలు, శాకాహార వంటకాలతో వడ్డించే భోజనం తప్పక తినాల్సిందే.

blog-post-for_-heritage-eateries-in-kolkata_1

అమినియా లో రుచికరమైన బిర్యానీ: నగరం నడిబొడ్డున నెలకొన్న అమినియా అక్కడ లభ్యమయ్యే మొఘల్ వంటకాలకు పేరొందింది. చికెన్ రెజాలా లేదా చికెన్ చాప్ తో ఒక ప్లేట్ బిర్యానీకి ఆర్డర్ ఇవ్వండి. ఇక మీరు తినడం పూర్తయ్యాక వేళ్లు నాకడం ఖాయం. భోజనం తరువాత ఫిర్ని ని రుచి చూడడం మరువొద్దు.

blog-post-for_-heritage-eateries-in-kolkata_3

మిత్రా కెఫె లో స్నాక్స్ : శోభాబజార్ మెట్రో స్టేషన్ ఎదురుగా నెలకొన్న ఈ కెఫె లో కొబిరాజీస్ (మటన్, చికెన్, ఫిష్) తప్పక రుచి చూడాల్సినవి. కొబిరాజీ అనేది ఎగ్ సిల్వర్ కోటింగ్ తో బాగా ఫ్రై చేయబడిన మీట్ స్లాబ్. కొబిరాజీ గాకుండా ఫిష్ డైమండ్ ఫ్రై, ఫౌల్ కట్లెట్, డైమర్ డెవిల్ (ప్రత్యేక ఫిల్లింగ్ తో కూడి బాగా ఫ్రై చేయబడిన గుడ్డు) మరియు బ్రెయిన్ చాప్ లను తినడం మరువవద్దు.

blog-post-for_-heritage-eateries-in-kolkata_2

గోల్ బరిలో కోశ మటన్ : ఈ పేరు వింటేనే చాలు…నోట్లో నీళ్లూరుతాయి. మటన్ కోశ మరియు రోటీ రుచిలో ఎన్నో రెట్లు మిన్నగా ఉంటాయి. ఇదేమంత పెద్ద ఫ్యాన్సీ షాప్ కాదు. కేవలం ఒక్క గది మాత్రమే. ఇది శ్యామ్ బజార్ మెట్రో స్టేషన్ ఎదురుగా నెలకొంది. గోల్ బరి మూడు తరాలుగా ఆరోరా కుటుంబంచే నిర్వహించబడుతోంది. కోశ్ మాంగ్షో (మటన్)ను రుచికరం చేసేందుకు వాళ్లు ఏమి వాడుతారనేది నేటికీ అంతుబట్టని రహస్యంగానే ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here