మీకు చైన్ లాగడం గురించి తెలియని నిజాలు.

1
2698

రైళ్లలో ప్రయాణించేటప్పుడు ప్రతీ బోగీలోనూ అత్యవసర పరిస్థితుల్లో లాగేందుకు ఉద్దేశించిన చైన్‌ను చూసే ఉంటారు. ఏమైనప్పటికీ, మీరు చైన్‌ను లాగడం గురించి చేయాల్సిన మరియు చేయకూడని విషయాల గురించి తెలుసుకుని ఉండకపోవచ్చు. చైన్ లాగడం గురించి పూర్తి వివరాలను అర్థం చేసుకోవడానికి ఈ క్రింది విషయాలను చదవండి.

ఎవరైనా చైన్ లాగితే, రైలు ఎలా ఆగుతుంది?

Emergency-or-Alarm-chains-in-Train

రైలు యొక్క బ్రేక్ పైప్‌కు అలారం చైన్‌ అనుసంధానించబడి ఉంటుంది. ఈ బ్రేక్ పైప్‌ రైలు సజావుగా నడవడానికి అవసరమైన ఎయిర్ ప్రెజర్‌ను అందిస్తుంది. అత్యవసర చైన్‌ను లాగినప్పుడు, ఎయిర్‌పైప్‌లో నిక్షిప్తమైన ఉన్న గాలి, చిన్న మార్గం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. ఎయిర్‌ ప్రెజర్ తగ్గపోవడం వల్ల రైలు వేగం నిదానిస్తుంది. ఈ ఎయిర్ ప్రెజర్‌ను గమనించిన లోకో పైలెట్‌ నిదానంగా రైలును ఆపుతారు చిన్నపాటి పట్టాలపై రైలు ప్రయాణిస్తుంది కాబట్టి, ఒక్కసారిగా రైలును ఆపలేరు, అలా చేస్తే రైలు పట్టాలు తప్పుతుంది.

ఎవరైనా చైన్ లాగితే, రైలు ఎలా ఆగుతుంది?

రైలు యొక్క బ్రేక్ పైప్‌కు అలారం చైన్‌ అనుసంధానించబడి ఉంటుంది. ఈ బ్రేక్ పైప్‌ రైలు సజావుగా నడవడానికి అవసరమైన ఎయిర్ ప్రెజర్‌ను అందిస్తుంది. అత్యవసర చైన్‌ను లాగినప్పుడు, ఎయిర్‌పైప్‌లో నిక్షిప్తమైన ఉన్న గాలి, చిన్న మార్గం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. ఎయిర్‌ ప్రెజర్ తగ్గపోవడం వల్ల రైలు వేగం నిదానిస్తుంది. ఈ ఎయిర్ ప్రెజర్‌ను గమనించిన లోకో పైలెట్‌ నిదానంగా రైలును ఆపుతారు చిన్నపాటి పట్టాలపై రైలు ప్రయాణిస్తుంది కాబట్టి, ఒక్కసారిగా రైలును ఆపలేరు, అలా చేస్తే రైలు పట్టాలు తప్పుతుంది.

చైన్‌ను ఎవరు లాగారో ఆర్‌పీఎఫ్‌ ఎలా గుర్తిస్తుంది?

Chain-Pulling-Punishment

బోగీలకు అత్యవసర ఫ్లాషర్స్‌ బిగించబడి ఉంటాయి. చైన్‌ లాగగానే ఇవి యాక్టివేట్ అవుతాయి. గార్డ్‌, అసిస్టెంట్ డ్రైవర్‌ మరియు ఆర్‌పీఎఫ్ సిబ్బంది చైన్‌ లాగిన బోగీ దగ్గరకు వెళ్లి దాన్ని చైన్‌ను మళ్లీ మానవీయంగా సరి చేసే వరకూ లోకోమోటివ్ పైలెట్‌ కంట్రోల్‌లో ఓ లైట్ వెలుగుతూ ఆరుతూ ఉంటుంది. చైన్‌ను సరి చేసిన తర్వాత ఎయిర్ ప్రెజర్‌ మళ్లీ సాధారణ స్థితికి చేరుకుని రైలు కదలడానికి సిద్ధమవుతుంది. చైన్‌ను ఎవరు లాగారో తెలుసుకునేందుకు, ఆర్పీఎఫ్ సిబ్బంది బోగీలో ఉన్న ప్రయాణీకులను ప్రశ్నిస్తారు.

చైన్ లాగినందుకు శిక్ష ఏమిటి?

సరైన కారణం లేకుండా చైన్‌ లాగడమనేది భారతీయ రైల్వే చట్టంలోని సెక్షన్ 141 కింద శిక్షార్హమైన నేరం. ఈ చట్టం ప్రకారం, రైలుకు బాధ్యత వహిస్తున్న వ్యక్తులకు మరియు ప్రయాణీకులకు మధ్య సమాచారంలో సరైన కారణం లేకుండా జోక్యం చేసుకుంటే, ఆ వ్యక్తి శిక్షార్హుడు”. నేరం నిరూపితమైతే, ఆ వ్యక్తికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.1000 వరకూ జరిమానా విధించబడుతుంది.

చైన్‌ లాగడానికి ఆమోదయోగ్యమైన పరిస్థితులేమిటి?

Acceptable-Cases-for-Chain-Pulling

చైన్‌ లాగడానికి ఆమోదయోగ్యమైన కొన్ని పరిస్థితులను చూస్తే: కదిలే రైలు నుంచి సహ ప్రయాణికుడు పడిపోయినప్పుడు, రైల్లో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు, కుటుంబ సభ్యుడు స్టేషన్‌లో ఉండిపోయినప్పుడు, వృద్ధులు లేదా దివ్యాంగులతో రైలు ఎక్కడానికి స్టేషన్‌లో సమయం సరిపోనప్పుడు, అత్యవసర వైద్యసహాయం కోసం, దొంగతనాల్లాంటివి జరిగినప్పుడు భద్రతకోసం చైన్ లాగవచ్చు.

చైన్ లాగడం వల్ల రైలుకు ఏదైనా నష్టం జరుగుతుందా?

Accident-due-to-Chain-Pulling

రైలు అత్యంత వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు చైన్ లాగితే, రైలు పట్టాలు తప్పే ప్రమాదం ఉంది. మరింతగా, అకస్మాత్తుగా రైలును ఆపితే (చైన్ లాగడం ద్వారా) చైన్ రియాక్షన్‌ మొదలయ్యేలా చేయవచ్చు. మీరు ఎక్కిన రైలు ఆలస్యం కావడమే కాదు, అదే లైన్‌లో వెళ్లాల్సిన తదుపరి రైలు కూడా ఆలస్యం అవుతుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here