ఫర్హా అర్ఫిన్, ప్రముఖ న్యుట్రిషనిస్ట్
ప్రయాణ సమయంలో తాము ఆరోగ్యకరమైనఆహారం తినలేకపోతున్నామని చాలా మంది ఫిర్యాదు చేస్తుంటారు.ఇటువంటి వారికి శుభవార్త ఏమిటంటే, కాస్త ప్లానింగ్ తో మీరు ప్రయాణ సమయంలో కూడా ఆరోగ్యకరమైన ఆహారం కడుపు నిండా తినొచ్చు. ఈ క్రింద ఇవ్వబడిన సూచనలు ప్రయాణ సమయంలో కూడా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
సులభంగా దొరికే పరిశుభ్రమైన స్నాక్స్
అనారోగ్యకరమైనఆహారాన్ని దూరంగా పెట్టాలంటే,ప్రోటీన్ అధికంగా గల, వెంట తీసుకెళ్లగలిగే స్నాక్స్ప్రయాణ సమయంలో ఉత్తమైనవి. అంటే మరమరాల మిక్చర్, వేపిన శనగలు,వేరుశనగలు, అటుకులు, పుదీనా చట్నీ లేదా సాస్ తో కూడిన కాక్రరా, పండ్లు, కూరగాయలతో పాటు హుమస్. ఉత్తమైన అంశం ఏమిటంటే, ఇప్పుడు మీరు రైలులో రైలుయాత్రస్ హైజినిక్ మెను ద్వారా కొన్ని తెలికపాటి ఆహార పదార్ధాలు పొందగలరు. ఇడ్లీ, పోహా, శాండ్విచ్, ఉప్మా వంటివి ఆర్డర్ చేసుకోవచ్చు. తేలికపాటి ఆహారంతోమీ ఆరోగ్యం విషయంలో రాజీపడకుండా ఆనందించొచ్చు.
గింజల మిశ్రమం, ప్రొటీన్ ఆహారం
డ్రై ఫ్రూట్స్, గింజల మిశ్రం అంటే బాదం, వాల్ నట్, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, నువ్వులు మొదలైనవి ప్రోటీన్ ఎక్కువగా కలిగి మిమ్మల్నని శక్తివంతంగా ఉంచుతాయి. వాటినిన జిప్ లాక్ పౌచ్ లో ప్యాక్ చేసుకుని మీ వెంట తీసుకువెళ్లాలి, వాటిలో మీరు ఎండు కిస్ మిస్ లు, బెర్రిలు, అంజీరా లేదాఇతర డ్రై ఫ్రూట్స్ కూడా కలుపుకోవచ్చు.
పండ్లు వెంట ఉంచుకోవాలి
ప్రయాణ సమయంలోఆహారం సులభంగా వెంటతీసుకెళ్లగలిగే ఉండాలి, మీరు కొన్ని రకాల సీజనల్ పండ్లు అంటే యాపిల్స్, బత్తాయి, ద్రాక్ష, పియర్స్ లేదా మీకు నచ్చే ఇతర పండ్లు మీతో తీసుకెళ్లాలి. అనారోగ్యకరమైన తీపి పదార్ధాలను తినాలన్న ఆలోచనను ఇది నియంత్రిస్తుంది.
తొందరగా, సులభంగా తినే స్నాక్స్
సులభంగా, తేలికగా తినగలిగేగ ఆహారాన్ని ఎంచుకోవాలి. అంటే శాండ్ విచ్, చీజ్ శాండివిచ్,పన్నీర్ రోల్, పీనట్ బటర్ శాండ్ విచ్, హోల్ వీట్ బ్రెడ్ మొదలైనవి. మీరు ఇటుటవంటి క్విక్ స్నాక్స్ ను రైలులో ప్రయాణించేటప్పుడు ఏ సమయంలోనైనా రైలుయాత్ర ద్వారా ఆర్డర్ చేయవచ్చు.
ఉడకబెట్టిన గుడ్లు
వీటిని ఉడకబెట్టడం సులభం,వీటిలో పూర్తిగాప్రొటిన్ ఉంటుంది, ఎమినో యాసిడ్స్ఉంటాయి, అవి రక్తపోటును అదుపులో ఉంచడంలో సాయపడతాయి. మన శక్తి స్థాయినిన పెంచుతాయి. గుడ్డును అలాగే తినొచ్చు లేదా ఎక్ రోల్, ఎగ్ శాండ్విచ్ లుగా చేసుకుని కూరగాయలు జతచేసుకుని తినొచ్చు.,
తాజా ఆహారం
ఒకవేళ ఏసీ కోచ్ లో ప్రయాణించకపోతే, ఏది పాడైపోయే ఆహారం, ఏది పాడుకాని ఆహారమో చెక్ చేసుకోవాలి, అటువంటప్పుడు పొడిగా ఉంటే ఆహార పదార్ధాలు అంటే కరెలా -చపాతీలు, స్టఫ్డ్ బెండకాలు చపాతి, డాల్ స్టఫ్డ్ రోటీ లేదా దాల్/బేసిన్ చిల్లా, మిస్సీ రోటీ, పెరుగు(తగినంనత ప్యాక్ లో సులభంగా దొరుకుతున్నాయి) తీసుకెళ్లాలి. లేదా ఇవన్నీ ప్యాకింగ్ చేసుకునే ఇబ్బందులు వద్దనుకుంటే, మీరు బయలుదేరే చోట రైలుయాత్ర హైజినిక్ మెను ఉంటే అర్డర్ చేసేయండి.
తగినంత నీరు తాగాలి
మంచినీరు మన శరీరానికి చాలాముఖ్యం, కాబట్టి వాటర్ బాటిల్ వెంట ఉంచుకోవడం మర్చిపోకండి. తగినంత నీరు తీసుకోకపోతే మీరు నీరసించిపోయి, ప్రయాణం గందరగోళమవుతుంది. దానికి అవకాశం ఇవ్వకండి.
Nice