డామన్ & డయ్యూలో తప్పకుండా సందర్శించాల్సిన 6బీచ్‌లు

0
1200

భారతదేశంలో బీచ్‌లంటే కేవలం ఇసుక మరియు సముద్రం మాత్రమే కాదు. కొన్నిసార్లు, చాట్ అమ్మేవాళ్లు, బొమ్మలు మరియు చెరుకు రసం అమ్మేవాళ్లు కూడా. మరికొన్ని సార్లు, తేటగా కనిపించే నీళ్లు మరియు పామ్‌ చెట్లు, మరికొంతమందికి సాహసక్రీడలు. కానీ మీరు సహజమైన వాటి కోసం చూస్తున్నట్లైతే, డామన్ & డయ్యూ బీచ్‌లకు మీరు వెళ్లాల్సిందే.

డామన్‌లోని అద్భుతమైన బీచ్‌లు

దేవ్‌కా బీచ్‌

Telugu Travel Blog

సుదూరమైన తీరప్రాంతంతో, కుటుంబంతో సరదాగా గడపడానికి ఈ డామన్ బీచ్‌ ఎంతో అనువైనది. దేవ్‌కా బీచ్‌లో కొన్ని చోట్ల రాళ్లు ఉంటాయి కాబట్టి, ఇక్కడ ఈతకొట్టడం నిషేధం. ఇక్కడున్న అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ పిల్లలకు చాలా నచ్చుతుంది. సముద్రాన్ని చూస్తూ టీ తాగడం లేదా వేయించిన చేపను తినే అవకాశం కల్పిస్తూ, దేవ్‌కా బీచ్‌ సరదాగా గడిపేలా చేస్తుంది.

కీలక విషయం: ఈ బీచ్‌లో బంగారు వర్ణపు ఇసుక ఉండదు, నల్లని మట్టితో బీచ్ నిండి ఉంటుంది.

జంపోరే బీచ్‌

Summer trip

దేవ్‌కా బీచ్‌కు పూర్తి భిన్నంగా, జంపోరే బీచ్ తన దైన అందాన్ని కలిగి ఉంటుంది. డామన్‌కు దక్షిణం వైపు చివరగా ఉండే ఈ బీచ్‌, ప్రశాంతతను కోరుకునే వారికి అనువుగా ఉంటుంది. ఇక్కడ, ఎలాంటి అమ్యూజ్‌మెంట్ పార్కులు, గట్టిగా అరుస్తూ పిలిచే ఫుడ్ స్టాల్స్‌ ఉండవు. వీటికి భిన్నంగా మీరు గనక విశ్రాంతి కోరుకుంటున్నా, అరేబియా సముద్రంలోని నీళ్లలో ఈత కొట్టాలనుకున్నా లేదా కాసారినస్ చెట్ల నీడలో సేద తీరాలనుకున్నా, జంపోరే బీచ్‌ మీకు బాగా అనువుగా ఉంటుంది.

సూచన: బీచ్‌లో సూర్యాస్తమయం అద్భుతంగా కనిపిస్తుంది, మీ పర్యటనను దానికి తగ్గట్లుగా రూపొందించుకొండి.

 డయ్యూలో అద్భుతమైన బీచ్‌లు

నగోవా బీచ్‌

Nagoa Beach

ఈ చిన్న మత్స్యకార గ్రామం అద్భుతమైన డయ్యూ బీచ్‌  అనుభవాన్ని మీకు అందిస్తుంది. గుర్రపు ఆకారంలో ఉండే ఈ నగోవా బీచ్‌ పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది మరియు బనానా బోట్ రైడ్, పారా సైలింగ్, జెట్‌ స్కీయింగ్‌, సర్ఫింగ్‌ లాంటి సాహసక్రీడలతో పర్యాటకులు ఉల్లాసంగా గడపేందుకు కావల్సినన్ని ఆకర్షణలు ఇక్కడ ఉన్నాయి. కొబ్బరి బొండాలు మరియు మొక్కజొన్న పొత్తులు అమ్మవారితో ఉండే ఈ నగోవా బీచ్ డయ్యూలో చాలా ప్రఖ్యాతిగాంచిన ప్రాతం.

సూచన: నగోవా అంటే కొత్త గోవా. వలస పాలకుల పరిపాలనలో గోవాకు చెందిన చాలా కుటుంబాలు ఈ బీచ్‌ సమీపానికి వచ్చి స్థిరపడ్డాయి.

చక్రతీర్థ బీచ్‌

Chakratirth-Beach

డయ్యూకు దాదాపు మధ్యలో ఉండే, చక్రతీర్థ బీచ్‌ ఏకాంతాన్ని కోరుకునే వారికి అనువుగా ఉంటుంది. ప్రశాంతంగా మరియు ఏర్పాటులోనే విభిన్నంగా, తీరమంతా రాళ్లు తేలి ఉండే, ఈ డయ్యూ బీచ్‌ ఫోటోలు తీసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. డయ్యూలో సన్‌సెట్ పాయింట్ ఈ బీచ్‌లోనే ఉంది, మీరు ఇక్కడికి వస్తే సూర్యాస్తమయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాలేరు.

సూచన: బీచ్‌కు సమీపంలో ఉండే శ్రీకృష్ణ దేవాలయం కారణంగా దీనికి చక్రతీర్థ్‌ అన్న పేరు వచ్చింది. ఈ ఆలయానికి పురణాలతో చాలా సంబంధం ఉంది.

 ఘోఘలా బీచ్‌

Ghoghla-Beach

డయ్యూకు 15 కి.మీ దూరంలో ఉండే ఘోఘలా బీచ్‌, డయ్యూలో తప్పకుండా చూడాల్సిన ప్రాంతం. ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ఎన్నో ఏర్పాట్లున్నాయి. నగోవా బీచ్‌లా జనం రద్దీ ఎక్కువగా ఉండదు, మీరు ఇక్కడ కూడా కొన్ని వాటర్‌ స్పోర్ట్స్‌ ప్రయత్నించవచ్చు. మీరు స్విమ్మింగ్ డ్రస్‌ వేసుకుని మీ పిల్లలతో కాసేపు సరదాగా గడపడానికి ఘోఘాల బీచ్‌చాలా అనువుగా ఉంటుంది. అంతేకాదు, మీరు అదృష్ట వంతులైతే కొన్ని డాల్ఫిన్స్‌ను కూడా ఇక్కడ చూడవచ్చు.

సూచన: ప్రీవెడ్డింగ్ ఫోటోషూట్‌ కోసం ఈ బీచ్ చాలా ప్రాముఖ్యతను పొందింది.

జలంధర్‌ బీచ్‌

Jallandhar-Beach

పామ్ చెట్ల వరుసతో కనిపించే జలంధర్‌ బీచ్‌, బొమ్మల్లో గీసిన చిత్రంలా ఉంటుంది. జనం రద్దీ ఎక్కువగా లేకుండా, నిర్మలంగా మరియు సహజసిద్ధంగా ఉండే ఈ బీచ్‌లో, పామ్ చెట్ల ఆకుల నీడల మధ్య కనిపించే వెలుగును చూస్తూ సరదాగా గడపొచ్చు.

సూచన: పురాణాల్లో ఉండే రాక్షసుడు జలంధర్‌ పేరిట దగ్గర్లో ఉండే ఆలయం ఆధారంగా దీనికి ఆ పేరు వచ్చింది. ఈ రాక్షుడుని శ్రీకృష్ణ భగవానుడు హతమార్చాడు. 

మరి, మీరు గనక తాజాగా, ఉప్పదనంతో కూడిన డామన్‌ & డయ్యూ బీచ్‌ల గాలిని పీల్చాలనుకుంటున్నారా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here