భారతదేశంలో 10 రకాల వినోదభరిత ప్రయాణికులు

1
1789
Indian train experience

రైలు ప్రయాణం అంటే బాలీవుడ్ సినిమా చూడటం కంటే ఏమాత్రం తక్కువ కాదు, సినిమాలో ఉన్నవన్నీ దాదాపుగా ఇక్కడా ఉంటాయి- వినోదం, హాస్యం, డ్రామా, కొన్ని సందర్భాల్లో యాక్షన్ కూడా. మనం రైళ్లలో ప్రయాణించేటప్పుడు చాలా విచిత్రమైన వ్యక్తులు కలుస్తుంటారు, వాళ్లు మన ప్రయాణాన్ని సుఖవంతం చేస్తారు లేదా అప్పుడప్పుడు ఇబ్బందులకు గురిచేస్తారు. ట్రైన్ లో మీకు ఎదురయ్యే వారి జాబితాను చూద్దాం, వాళ్లు కచ్చితంగా మీకు ఏదోఒక సమయంలో ఎక్కడో ఒకచట తారసపడే ఉంటారు.

• డబ్బా వాలాలు – వాళ్ల డబ్బాల నిండా తినుబండారాలే ఉంటాయి. కొంత మంది ప్రతి గంటకు ఏదోఒకటి తింటూనే ఉంటారు. వాళ్లు ఇంటి నుంచి వండి తీసుకొచ్చిన ఆహార పదార్ధాల వాసనలు, మనకి చిరాకు కలిగేలా పరపరా నములుతూ చేసే శబ్దాలు మక్కు పుటల్ని, చెవుల్ని తాకుతూనే ఉంటాయి. అమ్ముకోవడానివచ్చే వాళ్లందరి దగ్గరగా కొనాల్సిందగా పిల్లలు పట్టుబడతాయి. దీంతో వాళ్లకు వ్యాపారం బాగానే ఉంటుంది.

Delicious food on train

కిశోర్ కుమార్ లు – మనందరికీ సంగీతం అంటే ఇష్టం. కానీ వీళ్లకు మాత్రం బాగా ఇష్టం. వాళ్లు తమ ఫోన్లలో సంగీతం వినిపించడం ఒక్కటే కాదు, ఏ మాత్రం మొహమాటం లేకుండా గట్టిగా పాటలు పాడేస్తారు, దాంతో మిగతా ప్రయాణికులు కూడా వారి పాటల్ని అస్వాదించాల్సిందే.

Music on train

• సిబిఐ మనుషులు –  మీరు ట్రైన్ ఎక్కిన తర్వాత మీ పక్క సీట్లలో మంచిగా కనిపించే వ్యక్తులు కూర్చుని ఉంటారు. ‘‘హలో’’ అంటూ సంభాషణ మొదలు పెట్టి ‘‘ఎక్కడికి వెళ్తున్నారు’’ లాంటి ప్రశ్నలు వేస్తూ నెమ్మదిగా మీ వ్యక్తిగత విషయాలు అడుగుతారు. భారతీయ రైళ్లలో అటువంటి వాళ్లు కనీసం ఒక్కరైనా తగులుతారు. ప్రయాణం చేసే సమయంలో వాళ్లు అనేక మందితో మాట్లాడతారు.

Co passenger on train

• హాయిగా నిద్రపోయేవారు – ఇటువంటి వాళ్లు తమ లోయర్ బెర్తులను, అప్పర్ బెర్తుల వారితో మార్చుకుంటారు. పగలు, రాత్రి, సాయంత్రం ఎప్పుడు చూసినా పడుకునే ఉంటారు. కొట్లాడుకునే కుటుంబాలు, అరుపులు అరిచే పిల్లలు లేదా దూకుడుగా సాగే అంత్యక్షరి రౌండ్లలు, ఇవేవీ కూడా ఆ హాయిగా నిద్రపోయేవాళ్లను ఏ మాత్రం డిస్టర్బ్ చేయలేవు.

snory glory

• విపరీతంగా లగేజీ తీసుకెళ్లే వాళ్లు – కొంత మంది తాము ఏదో కొత్తగా జీవితాన్ని ప్రారంభిస్తున్నట్టుగా భారీగా లగేజీ తీసుకెళ్తారు. ఆ చుట్టు పక్కల ఉన్న ప్రతి అంగుళం ఖాళీ స్థలాన్ని తమ సామాన్లతో నింపేస్తారు. ఒక్కోసారి ఇంట్లోనుంచి బయటకు గెంటేస్తే, కొత్తగా జీవితం ప్రారంభించేవాళ్లలా కనిపిస్తారు.

Luggage Over dosers

• ఒకరికి ఒకరు – ఇటువంటి వాళ్లను మనం ఏ రైలు ప్రయాణంలోనూ మిస్ కాము. వాళ్లు చుట్టు ఉన్న ఎవరినీ పట్టించుకోరు, ఒకరికి ఒకరు అతుక్కుపోతారు. ‘‘నీకు ఏమైనా కావాలా?’’ అంటూ ఆ సెషన్లకు అంతం ఉండదు. ఒక రైలు ప్రయాణం ఒక రొమాంటిక్ ఎఫైర్ లాంటిదే, అవునా?

Romance on train

• ‘‘ఈ సీటు మాకు ఇవ్వండి సార్’’– ఇటువంటి వాళ్లు తమ ప్రయాణం మొత్తం, ఇతర ప్రయాణికులతో ఒప్పందాలు కుదర్చుకోవడంలోనే గడుపుతారు, కాబట్టి వాళ్లు గ్రూపులో మిగతా వాళ్లతో కలిసి కూర్చుంటారు. వాళ్లు ఒకరికి ఒకరు దగ్గరగా సీట్ల రాకపోతే తోటి ప్రయాణికులను ‘‘కాస్త అడ్జెస్టు’’ చేసుకోమని అడుగుతారు. ఇదంతా వాళ్లు ప్రేమించే వ్యక్తుల కోసమే. ఎందుకంటే వాళ్లు పక్కన లేకపోతే ఆ ప్రయాణం మొత్తం వీళ్లకు చాలా కష్టంగా ఉంటుందది.

Seat issue on train

ఈ కేటగిరిలోకి వచ్చే ఇతరులు టిక్కెట్ లేని ప్రయాణికులు, వాళ్లు ఎప్పుడూ సీట్ల కోసం టిటిఈతో లేదా ఇతర ప్రయాణికులతో బేరసారాలు జరుపుతూంటారు.

• హాట్ షాట్ కార్పొరేట్స్ – ఒక కార్పోరేట్ ఆఫీసు మొత్తం మీ కళ్ల ముందు కనిపిస్తుంది. మరో ప్రధాన విషయం ఏమిటంటే, చార్జింగ్ పాయింట్లు అన్నీ వీళ్లే ఆక్రమించేసుకుంటారు. ఈ కార్పొరేట్ హాట్ షాట్స్ ల్యాప్ టాప్ లు బయటకు తీసి ఇతర ప్రయాణికుల కోసం సినిమాలు, సంగీతం పెడతారు. పెద్దగా పనికి సంబంధించిన విషయాలు చర్చించుకోవడం, ఖరీదైన తమ స్మార్ట్ ఫోన్ల గురించి మాట్లాడటం, ల్యాప్ టాప్ లో ప్రజెంటేషన్లు ఇవ్వడం చేస్తారు.

Business men on train

• 440 – ఓల్ట్ డిబెటర్స్ – రాజకీయాలు, దేశం, అవినీతి, నిరుద్యోగం ఇలా ఏదైనా తీసుకుని మీ నాలెడ్జ్ ని పరీక్షిస్తూ ప్రశ్నలు వేస్తారు. ఏదో ఒక సబ్జెక్టు ఎంచుకుని దాని మీద వేడి వేడి చర్చలు జరుపుతారు.

Volt debators on train

• డేర్ డేవిల్స్ – ఇటువంటి వాళ్లు తమ సీట్లలో కూర్చోరు, తరచూ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ట్రైన్ డోర్లు దగ్గర తిరుగుతారు. తాజా గాలిని, ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వాళ్లు తలుపుల దగ్గర వేలాడుతూ ఎంతటి రిస్క్ కైనా సిద్ధపడతారు.

Daredevils hockers on train

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here