జిమ్ కార్బెట్ వేట గాధల్లో…

0
970

లెజండ్ హంటర్, పులుల సంరక్షకుడు అయిన ఎడ్వర్డ్ జిమ్ కార్బెట్ ఉత్తరాఖండ్ లోని గఢ్ వాల్, కుమావన్ ప్రాంతాల ప్రజల గుండెల్లో నేటికీ నిలిచి ఉన్నారు. పులుల సంరక్షకుడిగా, ప్రకృతి ఆరాధకుడిగా, 19 పులులు మరియు 14 చిరుతలను హతమార్చిన వేటగాడిగా పేరొందిన ఆయన జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.

దట్టమైన అడవి మొదలుకొని వన్యప్రాణుల వరకు దీన్ని ఆసియాలోనే మొదటి జాతీయ పార్క్ గా మాత్రమే గాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వన్యప్రాణి ప్రేమికులకు దీన్ని కలలతీరంగా చేశాయి.

జిమ్ కార్బెట్ కథల్లోని ప్రాంతాల వివరాల్లోకి వెళ్ళితే

Rudraprayag

1. రుద్రప్రయాగకు చెందిన ప్రఖ్యాత నరభక్షక చిరుత, రుద్రప్రయాగ

ఉత్తరాఖండ్ హిమాలయాల ఒడిలో ఓ పర్వత పట్టణమిది. నరభక్షక జంతువులతో జిమ్ కార్బెట్ చేసిన ఎన్నో సాహసాలకు కూడా ఇది నిలయంగా ఉండింది. ప్రకృతి ప్రేమికులకు ఇది భూతల స్వర్గం. డియోరియా తాల్, నాగ్ వంటి సుందర దృశ్యాలెన్నో ఇక్కడ చూడవచ్చు.

2. కుమావన్ మ్యానీటర్స్

Kumaon

  • కుమావన్

కార్బెట్ కు బాగా పేరు తెచ్చిన వాటిలో ఒకటి, కుమావన్ ప్రాంతాన్ని నరభక్షక పులుల నుంచి సురక్షితంగా ఉంచడం. ఉత్తరాఖండ్ రెండు పాలనాపరమైన జోన్లకు తూర్పు భాగంలో (మరొక జోన్ గఢ్ వాల్) నెలకొన్న ఈ ప్రాంతం ఎంతో సుందరంగా ఉంటుంది. కుమావన్ కు మణిహారంగా పేరొందిన నైనిటాల్ వంటి పట్టణాలెన్నో ఇక్కడ ఉన్నాయి.

Champawat

  • చంపావత్

కార్బెట్ మొదటి నరభక్షక పులి వేట మొదలైంది ఇక్కడే. ( రికార్డు స్థాయిలో 436 దాడులు చేసిన ఆడపులి). కుమావన్ లోని ఈ చిన్న పట్టణం ఆధ్యాత్మిక కేంద్రాలు, పర్యాటక కేంద్రాల కలబోతగా ఉంటుంది.Kanda

  • కాండ

నరభక్క్షక పులుల వేటలకు సంబంధించి కార్బెట్ కథల్లో ఓ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది కాండ. ఉత్తరాఖండ్ లోని ఓ చారిత్రక ప్రాంతం ఇది. కొన్ని పల్లెల సమాహారం. ఇక్కడి కాళిక ఆలయం బాగా పేరొందింది. ఉత్తరాఖండ్ లో ఇది చక్కటి విద్యాకేంద్రంగా ఉంది.Pipal -Pani

  • పిపాల్ పానీ

ఉత్తరాఖండ్ లోని అల్మోరా జిల్లా లోని ఓ గ్రామం పిపాల్ పానీ. ఎంతో ఆసక్తిదాయకంగా సాగిన కార్బెట్ వేటకు తోడుగా ఎన్నో మనోహర ప్రకృతి దృశ్యాలను కలిగి ఉంటుంది.

3. టెంపుల్ టైగర్ మరియు కుమావన్ కు చెందిన మరిన్ని నరభక్షక పులులు

Mukteshwar

ముక్తేసర్ (ముక్తేశ్వర్)

కార్బెట్ నరభక్షక పులుల వేట అద్భుత వీరగాధలకు మొదట్లో ఇది ఎంతగానో పేరొందింది. నైనిటాల్ కు తూర్పు దిక్కున ఉన్న హిల్ స్టేషన్ ఈ ముక్తేసర్ (ముక్తేశ్వర్). హిమాలయాల ఒడిలో మంత్రముగ్ధులను చేసే ప్రకృతి అందాలతో రిఫ్ట్ అడ్వెంచర్లకు నిలయంగా ఉంటోంది.

ఎన్నో భారతీయ నదులకు జన్మస్థలంగా ఉండడంతో పాటుగా జిమ్ కార్బెట్ చారిత్రక, సాహసోసేత వేటగాధల ప్రాంతాలెన్నో కూడా ఉత్తరాఖండ్ లో ఉన్నాయి. ఆయన ప్రఖ్యాతిని అవి నేటికీ సజీవంగా ఉంచుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here