గ్రేట్ హిమాలయన్ కుమ్రు కోట : 15వ శతాబ్ది నాటి జ్ఞాపిక

0
989

ఉత్తర భారతదేశం ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. అలాంటి వాటిలో ఒకటి కిన్నౌర్ లోని సాంగ్లా లోయ ఒకటి. అత్యంత అందమైన ల్యాండ్ స్కేప్ లలో ఇది ఒకటి. కుమ్రు కోట వద్ద నుంచి ఇదెంతో అందంగా కనిపిస్తుంది. బద్రీనాథ్ ఆలయానికి నెలవైన ఈ కోట, ఈ లోయను దుష్ట శక్తుల నుంచి కాపాడుతుందని ప్రతీతి.

Kamru Fort exterior

కుమ్రు ను సందర్శించేందుకు అనువైన సమయం ఏప్రిల్ నుంచి మే వరకు మరియు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు ఈ కోటను చూసేందుకు అనువైన కాలం. ఈ కాలంలో సాంగ్లా లోయ పూర్తిగా పూలతో వికసించి ఉంటుంది. ఈ కోట లోకి ప్రవేశించేందుకు ముందుగా ఇక్కడి దేవత గౌరవార్థం స్థానికులు ఇచ్చే టోపీ, బెల్టు ను ధరించాల్సి ఉంటుంది. ఎలాంటి రుసుము లేకుండానే కెమెరాలను లోనికి అనుమతిస్తారు.

సాంగ్లా లోయ లోని ఇతర విశేషాలు

Sangla Kanda

సాంగ్లా కాండ

దీన్నే సాంగ్లా పచ్చిక బయళ్ళుగా కూడా వ్యవహరిస్తుంటారు. సాహసక్రీడలను ఇష్టపడే వారికి ఇది చక్కటి ఎంపిక కాగలదు. హిమనీనదాలు మరియు కైలాశ్ శిఖరం మీదుగా ఒక రోజు ట్రెక్కింగ్ చేయవచ్చు. ఈ ట్రెక్కింగ్ మధ్యస్థ స్థాయి కష్టంతో కూడుకున్నది.

బాస్పా నది

Baspa River

బాస్పా నది నుంచి ఇక్కడి పర్వతాలు, ల్యాండ్ స్కేప్ లను 360 డిగ్రీల కోణంలో చూడవచ్చు. చేపల వేటతో, నది ఒడ్డున కూర్చొని లేదా ప్రశాంతంగా అంతర్ముఖులై కాలం గడపవచ్చు.

రక్చామ్

Rakcham

సాంగ్లా నుంచి 13 కి.మీ. దూరంలో నెలకొన్న ఈ గ్రామం ఈ లోయకు వచ్చిన అతిథులంతా తప్పక సందర్శించాల్సిన ప్రాంతం. ఈ గ్రామాన్ని చేరుకునేందుకు చక్కటి రోడ్డు మార్గం ఉన్నప్పటికీ, పల్లె ఆనందాలను చూస్తూ ఆనందిస్తూ వెళ్ళాలంటే మాత్రం 1-2 గంటల సమయం పట్టే నడక మార్గాన్ని ఎంచుకోవడమే మంచిది.

చిత్కుల్

Chitkul

టిబెట్ సరిహద్దులో జనావాసాలు ఉండే చివరి గ్రామం చిత్కుల్ . ఇది సాంగ్లా నుంచి 23 కి.మీ. దూరంలో నెలకొంది. ఇక్కడి నుంచి చిత్కుల్ నదికి 5 నిమిషాల్లో చేరుకోవచ్చు.

బౌద్ధ ఆరామం

సమయాభావం వల్ల పైన పేర్కొన్న ప్రాంతాలను సందర్శించే వీలు లేకుంటే, రెకాంగ్ పియో సమీపంలో నెలకొని, బ్రెలెంగి గొంప గా వ్యవహరితమయ్యే బౌద్ధ ఆరామంను సందర్శించండి.

సాంగ్లా లోయకు చేరుకోవడమెలా ?

దీనికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ షిమ్లా రైల్వే స్టేషన్. సాంగ్లా లోయ నుంచి 230 కి.మీ. దూరం. షిమ్లా రైల్వే స్టేషన్ నుంచి సాంగ్లా లోయకు చేరుకునేందుకు బస్సులు, టాక్సీలు సిద్ధంగా ఉంటాయి.

 

Originally written by Yashpal Sharma. Read here.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here