బిర్ బిల్లింగ్ : పారాగ్లైడింగ్ కు మించి మరెంతో!

0
1491

మంచుతో నిండి ఉండే దౌలాదర్ పర్వత శ్రేణిలో నెలకొని ఉండే బిర్ బిల్లింగ్ హిమాచల్ ప్రదేశ్ లోని చూడదగ్గ ప్రాంతాల్లో ఒకటి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జంపింగ్ స్పాట్. పారా గ్లైడింగ్ ఇక్కడి ప్రధాన ఆకర్షణ. అది ఒక్కటి మాత్రమే కాదు…ఇంకా మరెన్నో విశేషాలు ఇక్కడ  చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి.

Bir Buddhist Monastery

బుద్ధిస్ట్ సర్క్యూట్

Bir Trekking Trails

బిర్ లో బౌద్ధ వాతావరణం కనిపిస్తుంది. అందమైన బౌద్ధారామాలు, స్తూపాలు ఇక్కడి అందాలకు మరింత వన్నె తెస్తాయి. ఈ పట్టణంలో టిబెట్ శరణార్థుల సెటిల్మెంట్ ఉన్నది. స్థానికులు దీన్ని కాలనీగా వ్యవహరిస్తుంటారు. ఇక్కడ చూడదగిన ఆరామాల్లో కొన్ని:

  • డ్రికుంగ్ డోజిన్ తెక్చో లింగ్ మోనాస్టరీ
  • పాల్ యుల్ చొకొహోర్లింగ్ మోనాస్టరీ
  • డీర్ పార్క్ ఇనిస్టిట్యూట్
  • టిబెటన్ హ్యాండీ క్రాఫ్ట్స్ సెంటర్
  • ట్రెక్కింగ్ ట్రయల్

ట్రెక్కింగ్ ట్రయల్

Villages of Bir

చిన్న చిన్న ట్రెక్స్, ట్రయల్స్ లాంటివి బిర్ బిల్లింగ్ లో అడుగడుగునా ఉంటాయి. బిర్ నుంచి ట్రెక్కింగ్ ట్రయల్స్ సన్నటి కనుమల గుండా సాగుతాయి. పర్యాటకులు వీటిని, బిర్ సౌందర్యాన్ని ఎంతో ఆనందించగలుగుతారు.

  • -ప్రఖ్యాత ట్రయల్స్ : బారా బంగాల్, గోర్ నాలా, లడఖ్ రీజియన్ కు చెందిన జాన్స్ కర్ లోయలకు దారి తీసే ట్రెక్ లకు బిర్ ఆరంభ కేంద్రం. ఈ ప్రాంతం నుంచి రూపుదిద్దుకునే చిన్నా, పెద్ద ట్రెక్ లు హనుమాన్ గఢ్, చంబా లోయ, బరోత్ లోయ, రాజ్ గుందా అందమైన గ్రామానికి దారి తీస్తాయి.
  • షార్ట్ హైక్స్ : షార్ట్ హైక్స్ మిమ్మల్ని చౌగాన్ లోని తేయాకు తోటల మధ్య లోకి లేదా చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న అందమైన జనావాసాల్లోకి తీసుకెళ్తాయి.
  • తాతాని ట్రెక్: ఈ లోయలో మరో గొప్ప ట్రెక్ తాతాని. ఇతరాలతో పోలిస్తే (బారా బంగాల్ మినహాయించి) దీనికి డిమాండ్ ఎక్కువే. ఈ లోయ ఎంతో వాలుగా ఉంటుంది. ఈ ట్రెక్ 6 కి.మీ.కు తక్కువ కాకుండా ఉంటుంది. ఈ ట్రెక్ హైడ్రో ప్రాజెక్టు వద్ద మొదలవుతుంది మరియు ఇది మిమ్మల్ని తాతాని వేడినీటి బుగ్గల వద్దకు చేరుస్తుంది.

అందమైన గ్రామాలు

Camping in Bir

అందమైన జంట గ్రామాలు, రాజ్ గుందా, కులార్ గుందా అనేవి దట్టమైన గుందా (బిర్ కు 16-17 కి.మీ. దూరం)లో నెలకొన్నాయి. నగర జీవితానికి ఇవి ఎంతో దూరంగా ఉంటాయి. ఔత్సాహికులు 2-3 రోజుల వ్యవధిలో ఈ గ్రామాలను చేరుకోవచ్చు. ఈ లోయ అందమైన ప్రకృతి దృశ్యాలతో, వన్యప్రాణులతో ఉంటుంది.

నక్షత్రాల కింద క్యాంపింగ్

Bir Sunset Point

బిర్ లోని పచ్చటి వాలు ప్రాంతాలు నక్షత్రాలతో నిండిన రాత్రుళ్ళు వాటి కింద క్యాంప్ చేయాలనుకునే వారికి ఎంతో అనువుగా ఉంటాయి. మృదువైన గడ్డి పొరతో ఉండే ఈ ప్రాంతంలో 5 నిమిషాల్లో క్యాంప్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. పెద్ద చలిమంట వేసుకోవాలనుకునే కోరికను ఇక్కడ చక్కగా నెరవేర్చుకోవచ్చు!

సన్ సెట్ స్పాట్

సూర్యాస్తమయం ఎంతో మంది పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంటుంది. 2400 మీటర్ల ఎత్తున, ఈ పారాగ్లైడింగ్ సైట్ దిగువ భూములకు ఎన్నో వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. కాంగ్రా వ్యాలీలో ఒక చక్కటి సన్ సెట్ స్పాట్ ఇది. రాత్రి వేళ మీరు గనుక ఇక్కడే క్యాంప్ చేస్తే కొండల వెనుక నుంచి మొదలయ్యే అందమైన సూర్యోదయాన్ని కూడా చూడవచ్చు.

బిర్ కు చేరుకోవడం ఎలా?

రైల్వేస్: సమీప రైలు కేంద్రం అజు (పఠాన్ కోట్ మరియు జోగిందర్ నగర్ వయా కాంగ్రాల మధ్య నేరో గేజ్ పై ఉంది) బిర్ నుంచి 5 కి.మీ. దూరంలో ఉంటుంది.

రోడ్డు మార్గం: రోడ్డు మార్గం నుంచి బిర్ చేరుకునేందుకు ఎన్ హెచ్ 20పై వయా బిర్ రోడ్ పై టర్న్ ఆఫ్ తీసుకోవాలి.  ఇది బైజ్ నాథ్ మరియు జోగిందర్ నగర్ ల మధ్య ఉంటుంది.

 

Originally written by Yashpal Sharma. Read here.