భాంగడ్ ని మించిన ప్రదేశాలు: రాజస్తాన్ లో భీతిగొల్పే ప్రదేశాలు చాలా తక్కువ తెలుసు

0
1173

వారసత్వ రాజభవనాలు, కోటలు, ఉత్సాహపూరితమైన సంస్కృతులకు పేరొందిన రాజస్తాన్, భయం పుట్టించే సంఘటనలు తెలిపే ఎన్నో రహస్యభరిత ప్రదేశాలకు కూడా ఆలవాలమే. ఒళ్లు గగుర్పొడిచే దెయ్యాల కథలు మీకు ఇష్టమైతే, రాజస్తాన్ లో పెద్దగా తెలియని కొన్ని భీతిగొల్పే ప్రదేశాల జాబితా ఇదే.

కుల్ధారా

Kuldhara
అనాదరణకు గురైన ఈ గ్రామం జైసల్మేర్ నుంచి పదిహేడు కిమీ దూరంలో ఉంది. కుల్ధారాతో సహా, చుట్టుపక్కల ఉండే ఎనభై నాలుగు గ్రామాలు ఖాళీగానే ఉన్నాయి. స్థానికుల కథనం ప్రకారం, అప్పట్లో జాలిమ్ సింగ్ అనే మంత్రి గ్రామపెద్ద కూతుర్ని వివాహం చేసుకోదలిచాడు. కానీ, స్థానిక ప్రజలు ఈ వివాహాన్ని నిరాకరించారు. కక్ష కట్టిన జాలిమ్ సింగ్, గ్రామస్థులను హింసించి, పన్నులు పెంచేసాడు. అప్పుడు గ్రామస్తులు గ్రామాన్ని వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నారు. అలా వెళ్లిపోయేటపుడు గ్రామస్థులు ఆ ఊరిని శపించారు, అందుకే అప్పటినుంచీ అక్కడ ఎవరూ నివాసముండరు.

దగ్గ్రర్లోని రైల్వే స్టేషన్: జైసల్మేర్

జగత్పురా

Jagatpura
జగత్పురా అనే ప్రాంతం, జైపూర్ నగరంలోఉంది. చాలామంది సందర్శకులు ఇక్కడ కొన్ని అతీంద్రియ కార్యకలాపాలను అనుభూతి చెందారు, ముఖ్యంగా రాత్రి వేళలో. చాలా ఏళ్ల క్రితం జగత్పురా రాజు(దుర్మార్గంతో, అత్యాశ కలిగిన వ్యక్తి) గ్రామస్తులను వేధించడం మొదలుపెట్టాడు. అతని పాలనలో, చాలామంది తీవ్రమైన ఆకలితో అలమటించి, అతడ్ని శపిస్తూ చనిపోయేవారు. చీకటి పడ్డాక జగత్పురాని సందర్శించడానికి వెళ్లినపుడు కొంతమంది మహిళలు తెల్లని వస్త్రాలలో అనూహ్యంగా కనిపించారని, ఆ తర్వత గాల్లోకి మాయమైపోయారని, దెయ్యం ఏడుపుల్లా కూడా వినిపించాయని చెప్పారు.

దగ్గ్రర్లోని రైల్వే స్టేషన్: జైపూర్

రాణా కుంభ రాజభవనం

Rana Kumbha Palace
చిత్తోడ్ గడ్ వద్ద ఉన్న ఈ వారసత్వ ప్రదేశాన్ని రాజస్తాన్ లోని భయంకరమైన కోటల్లో ఒకటిగా భావిస్తారు. చాలామంది సందర్శకుల కథనం ప్రకారం, “రాణి పద్మిని, ఏడువందలకు పైగా అంతఃపుర మహిళలతో కలసి ఆత్మాహుతికి పాల్పడి ప్రాణత్యాగం చేసిన ప్రదేశం వద్ద అగ్గిని వెలిగించరాదు” అనే నిబంధననను మీరు పాటించకపోతే దెయ్యం కనబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాణి పద్మిని అందం చూసి సమ్మోహితుడైన డిల్లీ చక్రవర్తి అల్లాదీన్ ఖిల్జీ చిత్తోడ్ గడ్ మీద దండెత్తాడు. ఓటమి చవిచూసాక, ధైర్యవంతులైన రాజ్పుత్ మహిళలు, ముస్లిం ఆక్రమణదారుల నుంచి తమ గౌరవాన్ని, మానాన్ని కాపాడుకునేందుకు ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఈ ధైర్యవంతమైన రాజ్పుత్ మహిళల ఆత్మలు ఇంకా ఆ రాజభవనంలో తిరుగాడుతూ ఉంటాయని, సహాయం కోసం అర్ధిస్తూ అరిచే అరుపులు వినిపిస్తాయని స్థానికులు చెప్త్తుంటారు. ఎవరైనా వెనుతిరిగి ఆ శబ్దాలకి ప్రతిస్పందిస్తే ఆ వ్యక్తికి మొహం కాలిపోతున్న రాజమహిళ కనిపిస్తుందని కూడా నమ్ముతారు.

దగ్గ్రర్లోని రైల్వే స్టేషన్: చిత్తోడ్ గడ్

బ్రిజ్ రాజ్ భవన్

Brij Raj Bhawan
బ్రిజ్ రాజ్ భవన్ అనే భవనం, కోటలో 178 ఏళ్ల క్రితానికి చెందినది. గతంలో కోట పాలకులకి చిరునామాగా, ఆ తర్వాత మేజర్ బర్టన్ (బ్రిటిష్ రెసిడెన్సీ ఉద్యోగి)కి నివాసంగా నిలిచింది. 1857 సిపాయ తిరుగుబాటు సమయంలో, భారతీయ సైనికులు కుటుంబంతో సహా అతడ్ని ఖండఖండాలుగా నరికేసారు. ఇప్పటికీ బ్రిటిష్ అధికారి, అతని కొడుకుల ఆత్మలు ఆ రాజభవనం చుట్టూ కనిపిస్తాయని నమ్ముతారు. బ్రిజ్ రాజ్ భావన్ ని ఇప్పుడు ఒక వారసత్వ హోటల్ గా తీర్చిదిద్దారు, రాత్రిపూట సెక్యూరిటీ గార్డులు డ్యూటీ సమయంలో నిద్రపోతున్నట్లు కనిపిస్తే ఈ దెయ్యాలు వాళ్లని కొడతాయని చెప్తారు.

దగ్గ్రర్లోని రైల్వే స్టేషన్: కోటా

ఎన్ హెచ్-79, డుడు

NH-79 Road
అజ్మేర్, ఉదయ్ పూర్ లను కలుపుతున్న ఎన్ హెచ్-79 మీదుగా చాలామంది ప్రయాణిస్తూ ఉంటారు. ఆ దారిలో ఒక మహిళ తన చేతుల్లో ఒక బిడ్డని పట్టుకుని లిఫ్ట్ అడగటం చాలామంది చూసామని చెప్తారు. ఒక ఐదురోజుల పాప, మూడేళ్ల బాబుని పెళ్లాడాలని స్థానిక పెద్ద సూచిస్తారు. పాప తల్లికి ఆ పెళ్లి అంటే ఉన్న విముఖత వల్ల తన బిడ్డని కాపాడుకునేందుకు ఇంటి నుంచి పారిపోతుంది. హైవే దాటుతుండగా, ప్రమాదం జరిగి, బిడ్డతో సహా ఆమె కూడా చనిపోయింది. అప్పటినుంచి ఆమె ఆత్మ అలా తిరుగాడటం మొదలైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here