మీరు గనక సాహస క్రీడలను అమితంగా ప్రేమిస్తే – మీ కోసమే ఈ జాబితా. మీరు ఎక్కువ ఎత్తుకు వెళ్లాలనుకున్నా లేక నిదానంగా వెళ్లాలనుకున్నా, ఈ ఏడాది మీ వేసవి అనుభవాలు విసుగు తెప్పించేవిగా ఉండమని మేం హామీ ఇస్తున్నాం.
మోటర్ సైకిల్ టూరింగ్: షిమ్లా నుంచి లేహ్
షిమ్లా నుంచి మనాలీ మీదుగా లేహ్‌కు మోటర్‌బైక్‌పై సాహసయాత్ర చేయడం జీవితాన్ని మార్చేసే అనుభవం. మీరు ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన మానాలి – లేహ్ – నుబ్రా వ్యాలీ – పన్‌గాంగ్ లను సందర్శించవచ్చు. ఫోటోగ్రఫీ, క్యాంపింగ్ మరియు మొనాస్టెరీస్‌ల దర్శనం లాంటివీ మీరు చేయవచ్చు.
ఫిట్‌నెస్ అవసరం: ముందుగానే వ్యాయామం చేయడం మొదలుపెట్టండి. రకరకాల ఎత్తుల్లో వాహనాన్ని నడపడానికి మీరు శారీరకంగా ధృఢంగా ఉండాలి.
రాక్ క్లైంబింగ్: సాత్పురా, మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్‌లో రాపెల్లింగ్, వ్యాలీ క్రాసింగ్, మౌంటైన్ క్లైంబింగ్‌తో పాటే రాక్ క్లైంబిగ్ కూడా చాలా ఆదరణ పొందుతున్న సాహసక్రీడ. అతిపెద్దదైన సాత్పురా పర్వత శ్రేణులు రాక్ క్లైంబింగ్ మరియు ట్రెక్కింగ్ చేయడానికి అవకాశాన్ని కల్పిస్తున్నాయి. కాబట్టి, సాత్పురా సందర్శన కాస్తైనా సాహసం చేయకపోతే పూర్తి కాదు.
ఖర్చు: పచ్‌మర్హిలోని చాలా అడ్వెంచర్ క్లబ్స్ రూ.1500 నుంచే సాహస కార్యకలాపాలను అందిస్తున్నాయి.
ఫామ్‌లో నివాసం & చీజ్ తయారీ: కూనూర్
కూనూర్ అనేది తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఉండే ప్రశాంతమైన చిన్న హిల్ స్టేషన్. ప్రకృతి అందాలకే కాకుండా, ఇక్కడ ఫామ్స్‌లో ఉండడంతో పాటు చీజ్ తయారు చేసే కోర్సులు నేర్చుకోవచ్చు. సాధారణమైన, ఆనందకరమైన గ్రామీణ జీవితాన్ని అనుభవించడానికి ఫామ్స్‌లో ఉండి ప్రత్యేకమైన చీజ్ తయారీని నేర్చుకోండి.
ఎక్కడికి వెళ్లాలి: చీజ్ తయారీకి మెరుగైన ప్రదేశం – ఏకర్స్ వైల్డ్
బంగీ జంపింగ్ : రిషికేశ్
దశాబ్దకాలంగా బంగీ జంపింగ్ భారతదేశంలో అందుబాటులో ఉంది. అయితే.. న్యూజిలాండ్‌కో నేపాల్‌కో వెళ్లాల్సిన పని లేకుండా నదీలోయకోలకి బంగీజంప్ చేసే అవకాశం మాత్రం ఇప్పుడే మొదటిగా అందుబాటులోకి వచ్చింది. రిషికేష్‌లోని గంగానదిలోకి చూస్తున్న రాతికొండపై బంగీ ప్లాట్‌ఫామ్‌ను తొలిసారి నిర్మించడం వల్ల సాధ్యమయ్యింది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని, ఇక్కడి నుంచి సాహసోపేతమైన జంప్ చేస్తే మీ జీవితాంతం గుర్తుండిపోయే అనుభవాన్ని సంపాదించండి.
ఆరోగ్యమే ధనం: మీ బరువుకు తగ్గ ఎత్తును తనిఖీ చేసుకోండి. మీకు వెన్నునొప్పి ఉంటే గనక దాన్ని దాచకండి.
జోర్బింగ్: సోలాంగ్ వ్యాలీ
హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో ఉండే సహజమైన అందమైన ప్రాంతం సోలాంగ్ వ్యాలీ. కానీ, ఆసక్తికరమైన భౌగోళిక ప్రాంతమే కాక, పచ్చికమైదానాల్లో జోర్బింగ్‌ను అనుభవించడానికి సరైన ప్రదేశం. జోర్బింగ్ బాల్‌లో తలక్రిందులవుతూ ప్రపంచాన్ని చూడడం నిజంగానే అద్భుతంగా ఉంటుంది.
ఖర్చు: రూ.500 ప్రతీ వ్యక్తికి